దిగ్గజ బ్యాంకులు హెచ్‌ఎస్‌బీసీ, స్టాండర్డ్ చార్టర్డ్, బార్‌క్లేస్, డాయిష్ బ్యాంకు వంటి దిగ్గజ బ్యాంకుల ద్వారా గత రెండు దశాబ్దాల్లో భారీగా అక్రమ నిధుల ట్రాన్సాక్షన్స్ జరిగాయని వార్తలు వచ్చాయి. దీంతో హెచ్‌ఎస్‌బీసీ, స్టాండర్డ్ చార్టర్డ్, బార్‌క్లేస్ బ్యాంకుల షేర్లు భారీగా నష్టపోయాయి. మొదటి రెండు బ్యాంకుల షేర్లు ఏకంగా 1998 నాటి కనిష్టస్థాయికి క్షీణించాయి.
అమెరికా ఆర్థిక శాఖలోని ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నెట్ వర్క్స్(ఫిన్‌సెన్) వద్ద బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సమర్పించిన అనుమానిత కార్యకలాపాల నివేదికల నుండి లీకైన వివరాల ఆధారంగా బజ్‌ఫీడ్ సహా ఇతర సంస్థల్లో వార్తలు వచ్చాయి.

1998 స్థాయికి పడిపోయిన షేర్ ధర
ఈ వివరాలు లీక్ కావడంతో హాంగ్‌కాంగ్‌లో హెచ్‌ఎస్‌బీసీ షేర్ ధర 5 శాతం క్షీణించి 288 పెన్స్‌కు పడిపోయింది. 2009, 2016 తర్వాత ఇదే కనిష్టస్థాయి. ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే షేర్ వ్యాల్యూ దాదాపు సగానికి తగ్గింది. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు షేర్ లండన్ ఎక్స్చేంజీలో 4.6 శాతం క్షీణించి 1998 నాటి కనిష్టస్థాయికి పడిపోయింది. దాదాపు 2వేలకు పైగా అనుమానిత కార్యకలాపాల నివేదికలకు సంబంధించిన వివరాలు బజ్ ఫీడ్ న్యూస్‌కు లభ్యమయ్యాయి. ఈ వివరాలను ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేట్ జర్నలిస్ట్స్(ICIJ), ఇతర వార్తా సంస్థలతో బజ్ ఫీడ్ షేర్ చేసుకుంది.

ఈ మధ్య కాలంలో..
1999-2017 మధ్యకాలంలో ప్రపంచదేశాల్లోని పలు బ్యాంకుల ద్వారా 2 లక్షల కోట్ల డాలర్లకు(సుమారు రూ.150 లక్షల కోట్లు) పైగా చట్ట విరుద్ధ సొమ్ము చేతులు మారినట్లుగా వార్తలు వచ్చాయి. భారత బ్యాంకుల ద్వారా కూడా పలు లావాదేవీలు జరిగాయట. ICIJలో 88 దేశాలకు చెందిన 110 వార్తా సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. అమెరికా ట్రెజరీ శాఖలో ఆర్థిక మోసాలు, అక్రమ ట్రాన్సాక్షన్స్ పైన నిఘా వేసే విభాగమే ఫిన్‌నెస్. మనీలాండరింగ్, తీవ్రవాదం, డ్రగ్స్‌కు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక మోసాలకు సంబంధించి అమెరికన్ డాలర్లలో జరిగిన అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్‌ను బ్యాంకులు ఫిన్‌నెస్‌కు సమాచారం అందించాల్సి ఉంటుంది. అయితే ఈ ట్రాన్సాక్షన్స్ తప్పు జరిగిందనటానికి ఆధారంగా భావించలేమని కూడా అంటున్నారు.

బ్యాంకులు ఏం చెబుతున్నాయి
ICIJ వద్ద ఉన్న సమాచారం కొత్తదేమీ కాదని, ఆర్థిక నేరాలపై చాలా ఏళ్ళుగా తాము పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తున్నామని, ఆర్థిక నేరాల నియంత్రణ కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నామని, అన్ని రకాల చట్ట, నియంత్రణ నిబంధనలు పాటిస్తున్నామని బ్యాంకులు వెల్లడించాయి. అనుమానిత కార్యకలాపాల నివేదికల్లో చాలా వరకు డాయిష్ బ్యాంకుకు చెందినవే ఉన్నాయి. దీంతో దీని షేర్ ధర సోమవారం 5 శాతానికి పైగా నష్టపోయింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications