IT News: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితికి కరోనా సంక్షోభం బీజం వేయగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దాన్ని పెంచి పోషించింది. ఇవి కాస్తా గ్లోబల్ జాబ్ మార్కెట్ పై తీవ్ర ప్రతికూలత చూపించాయి. వరుస లేఆఫ్స్, ఆన్ బోర్డింగ్స్ డిలే చేయడం, రిక్రూట్‌మెంట్ ను నిలిపివేయడంతో ఉద్యోగార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి పరిస్థితి ఎలా ఉందనే దానికి ఈ సంఘటనే ఉదాహరణ.
HR టెక్ స్టార్టప్ స్ప్రింగ్ వర్క్స్ CEO కార్తీక్ మాండవిల్లే ఓ ట్వీట్ చేశారు. తమ కంపెనీ వెబ్‌సైట్‌లో కొన్ని ఉద్యోగాలను పోస్ట్ చేసినట్లు అందులో చెప్పారు. అయితే కేవలం 48 గంటల్లోనే 3 వేల అప్లికేషన్స్ రావడం చూసి కంగు తిన్నట్లు తెలిపారు. దీనిని బట్టి బయట జాబ్ మార్కెట్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చారు.

మొత్తం మీద ఇప్పటివరకు 12 వేల 500కు పైగా ధరఖాస్తులు వచ్చినట్లు కార్తీక్ వెల్లడించారు. సేల్స్ & మార్కెటింగ్, ఆపరేషన్స్, ప్రొడక్ట్ మరియు టెక్ రోల్స్‌లోని అన్ని ఓపెన్ పొజిషన్‌లు "కంప్లీట్ రిమోట్" విధానంలోనే పని చేయాల్సి ఉంటుందని అని స్ప్రింగ్‌వర్క్స్ తన కెరీర్ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇంత భారీ స్థాయిలో ఉద్యోగార్థుల నుంచి రెస్పాన్స్ రావడానికి ఇదే కారణం అయి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు.
మరికొందరు యూజర్లు సైతం ప్రస్తుత జాబ్ మార్కెట్ పై దాదాపు ఇదే విధంగా స్పందించారు. ఢిల్లీలో ఓ IT కంపెనీలో 20 ఓపెన్ పొజిషన్స్ ఉండగా.. 700 మంది ఇంటర్వ్యూకి వచ్చినట్లు ఒక యూజర్ తెలిపారు. 2.5 LPA వేతనంతో కూడిన జాబ్ కోసం అంత మంది రావడంతో ఆశ్చర్యపోయినట్లు వెల్లడించారు. ఈ ఏడాది చివరి నుంచి నియామకాలు పుంజుకుంటాయని నిపుణుల అంచనా. ఏమవుతుందో చూడాలి మరి!


Click it and Unblock the Notifications