HPCL: దేశీయ రైతులకు ఆదాయాన్ని ఇచ్చే మంచి అవకాశాన్ని ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థ HPCL మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. వారు డబ్బు సంపాదించుకునేందుకు సదవకాశాన్ని తెస్తోంది.

బయో గ్యాస్..
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ గోబర్-ధన్ ప్రాజెక్ట్ కింద రాజస్థాన్‌లోని సంజూర్‌లో మొదటి ఆవు పేడ-కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఏడాదిలోగా పని ప్రారంభించనున్న ఈ ప్లాంట్‌లో బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసేందుకు రోజుకు 100 టన్నుల ఆవు పేడను వినియోగించనున్నారు. ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తయ్యే వాటినే కాకుండా కంప్రెస్డ్ బయోగ్యాస్‌ను వాహనాలకు ఇంధనంగా ఉపయోగించాలని నిర్ణయించింది.

రాజస్థాన్..
రాజస్థాన్‌లోని జలోర్‌లోని పద్మెడ గ్రామంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. "2018 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన గోబర్-ధన్ పథకం కింద స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీన్)లో భాగంగా బయోడిగ్రేడబుల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కాంపోనెంట్‌లో ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయబడుతోందని పెట్రోలియం అండ్ సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది.

అంబానీ, అదానీ..
దేశంలో గౌతమ్ అదానీకి చెందిన అదానీ న్యూ ఇండస్ట్రీస్, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండు కొత్త కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్‌లను ఏర్పాటు చేయబోతున్నాయి.

రూ.600 కోట్లు..
అదానీ న్యూ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఫ్యాక్టరీలను స్థాపించడానికి ఒక్కొక్కటి రూ.600 కోట్లు పెట్టుబడి పెడుతున్నాయి. ఈ ప్లాంట్లలో వ్యవసాయ వ్యర్థాలు, చెరకు వ్యర్థాలు, మున్సిపల్ వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తారు.

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్..
CBG గ్రీన్ హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేయగలదు. గృహ వినియోగం కోసం పైప్డ్ సహజ వాయువుకు ప్రత్యామ్నాయంగా దీనిని ఉపయోగించవచ్చు. కానీ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ గోబర్-ధన్ ప్రాజెక్ట్ కింద, బయోగ్యాస్ పూర్తిగా ఆవు పేడ నుంచి ఉత్పత్తి చేయబడుతుంది. ఇది పాడి రైతులకు ఆదాయ వనరుగా మారనుంది.


Click it and Unblock the Notifications