గొగోరోతో జతకట్టిన HPCL.. ఇకపై పెట్రోల్ బంకుల్లోనూ ఆ ఫెసిలిటీ
మారుతున్న అవసరాలకు అనుగుణంగా దేశం యావత్తు పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ కు మారుతోంది. ఈ పరిస్థితుల్లో పెట్రోల్ బంకుల్లోనూ ఈ మార్పులు కనిపిస్తున్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం తాజాగా ఓ కంపెనీతో జతకట్టింది. దాని సాయంతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనుంది.
దేశంలో బ్యాటరీ మార్పిడి స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో గొగోరో ఓ ఒప్పందం చేసుకుంది. కంపెనీని చెందిన 21 వేల రిటైల్ అవుట్‌లెట్లలో బ్యాటరీ-స్వాపింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మిస్తోంది. దీన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం వినియోగించనున్నట్లు తెలుస్తోంది.

"రాబోయే రోజుల్లో మేము దేశవ్యాప్తంగా విస్తరించనున్నాం. HPCL రిటైల్ అవుట్‌లెట్‌లలో వేలకొద్దీ బ్యాటరీ మార్పిడి స్టేషన్‌లను రూపొందించడానికి మేము HPCLతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం" అని గోగోరో వ్యవస్థాపకులు, CEO హోరేస్ లూక్ తెలిపారు. భారత్ లోని పట్టణాల్లో టూవీలర్ రవాణా వ్యవస్థ విద్యుత్ ఇంధనానికి మారే దశలో ఉంది. ఇందులో బ్యాటరీ మార్పిడి కీలకంగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్రాలతో పాటు స్థానిక ప్రభుత్వాలు, వ్యాపార సంఘాలతో కలిసి బ్యాటరీ మార్పిడి సేవలను ప్రారంభించనున్నట్లు ఓ ప్రకటనలో గొగోరో ఓ ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు దాదాపు 500 మిలియన్ల బ్యాటరీ స్వాప్ లతో కూడిన గొప్ప వేదికను గొగోరో అభివృద్ధి చేసిందని HPCL ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శర్మన్ తెలిపారు.


Click it and Unblock the Notifications