టెక్ ఉద్యోగులకు లేఆఫ్ ల తిప్పలు తప్పడం లేదు. టెక్నాలజీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఈ సంవత్సరం కూడా కష్టకాలమే. గతేడాది ఆర్థిక మాంద్యం భయాలతో వేలమందిని ఇంటికి పంపిన టెక్ కంపెనీలు ఇప్పుడు మరో కొత్త కారణంతో మళ్లీ కోతలకు సిద్ధమవుతున్నాయి. అదేంటంటే..
టెక్ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన హెచ్‌పీ (HP) కూడా ఈ లేఆఫ్‌ల పరంపరలో చేరింది. పీసీ, ప్రింటర్ల తయారీలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ రెండు నుంచి మూడేళ్లలో దాదాపు 4,000 నుంచి 6,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. దీంతో టెక్ ప్రపంచంలో మరోసారి కలకలం రేగింది.

కారణాలు ఇవే..
HP ఉద్యోగులను తొలగించడానికి(Hp layoffs ) గల కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి.
1. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడం: కంపెనీ నిర్వహణ ఖర్చులను తగ్గించుకుని మరింత సమర్థంగా పనిచేయడం.
2. AI వినియోగం: ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో ఏఐ వినియోగాన్ని పెంచడం.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా HPలో సుమారు 58,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ తాజా లేఆఫ్ లు చూస్తే సుమారు 6 వేల మంది ఉన్నారు. అంటే కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మందికి లేఆఫ్ ప్రకటించారు. ముఖ్యంగా ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, కస్టమర్ సపోర్ట్, ఇతర అంతర్గత విభాగాలపై ఈ తొలగింపుల ప్రభావం ఎక్కువగా పడింది.
3. బిలియన్ డాలర్లు ఆదా..
ఈ కఠిన నిర్ణయాల గురించి కంపెనీ సీఈఓ ఎన్రిక్ లారెస్ మాట్లాడుతూ.. "పోటీ ప్రపంచంలో నిలబడాలంటే ఈ చర్యలు తప్పవు. ఈ లేఆఫ్‌ల ద్వారా కంపెనీకి సుమారు ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,300 కోట్లు) మేర ఖర్చు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నాం" అని పేర్కొన్నారు.
4. చిప్‌ల డిమాండ్
అమెరికాలో విధించిన ట్రంప్ టారిఫ్‌ల కారణంగా HP కంపెనీకి ఉత్పత్తుల తయారీ ఖర్చు పెరిగింది. దీనికి తోడు, కస్టమర్లు ఇప్పుడు ఏఐ ఫీచర్లు ఉన్న కొత్త కంప్యూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల కంపెనీపై మెమొరీ చిప్‌ల ధరల భారం కూడా అధికమవుతోంది. డేటా సెంటర్ల నుండి పెరుగుతున్న డిమాండ్ కారణంగా మెమొరీ చిప్‌ల ధరలు విపరీతంగా పెరగడం హెచ్‌పీ వంటి సంస్థల లాభాలపై భారం మోపుతోంది. ఈ కారణాలన్నీ ఖర్చు తగ్గింపు చర్యలు చేపట్టడానికి దారితీశాయి. ఈ భారీ తొలగింపుల ప్రకటన ప్రభావం కంపెనీ షేర్లపైనా పడింది. మంగళవారం నాటి అమెరికా మార్కెట్లలో హెచ్‌పీ షేరు ఏకంగా 5.5 శాతం మేర పడిపోయింది. టెక్ రంగంలో ఏఐ విప్లవం ఒకవైపు కొత్త ఆశలు చిగురింపజేస్తున్నా, మరోవైపు వేలమంది ఉద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది.
కొనసాగుతున్న కోతలు
ఓవరాల్ గా టెక్ రంగంలో ఈ కోతలు మున్ముందు కొనసాగే అవకాశం ఉంది. హెచ్‌పీ మాత్రమే కాదు టెక్ రంగంలో విస్తృత స్థాయిలో పునర్నిర్మాణం జరుగుతోంది. అమెజాన్ 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తుండగా యాపిల్ కూడా ఉద్యోగులను తొలగించింది. మెటా (Meta) సైతం ఏఐ బృందాలలో వందల కొద్దీ ఉద్యోగాలను తగ్గించింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications