ఉద్యోగం చేస్తున్న వాళ్లకు ప్రతి నెల జీతం నుంచి కొంత మొత్తం కట్ అవుతుంది. చాలా మంది దాన్ని కేవలం జీతం తగ్గింపుగా మాత్రమే భావిస్తారు. కానీ నిజానికి, అది మీ భవిష్యత్తు రిటైర్మెంట్ జీవితానికి నిశ్శబ్దంగా బలమైన పునాది వేసే ఒక రహస్యమైన పొదుపు సాధనం లాంటిది.
ఈ EPF పద్ధతిలో ఉద్యోగి, కంపెనీ ఇద్దరూ ప్రతి నెలా సమానంగా కాంట్రిబ్యూట్ చేస్తారు. ప్రతి నెల మీ బేసిక్ సాలరీ + డియరెనెస్ అలవెన్స్ (DA)లో 12% EPFకి వెళ్తుంది. కంపెనీ కాంట్రిబ్యూషన్‌లో 3.67% EPFకి, 8.33% (EPS)కి వెళ్తుంది. గరిష్టంగా రూ. 15,000 వరకు మాత్రమే EPFపై కాంట్రిబ్యూషన్ లెక్కిస్తారు.

నిజంగా EPF ఒక్కదానితోనే కోటీశ్వరుడిని అవ్వగలమా? అనేది చాలామంది ఉద్యోగులు అనుకునే ప్రశ్న. ప్రస్తుతానికి EPF వడ్డీ రేటు సంవత్సరానికి 8.25%గా ఉంది. మీరు 25 సంవత్సరాల పాటు నిరంతరం EPFలో ఇన్వెస్ట్ చేస్తారని అనుకుంటే, 60 ఏళ్ల వయసు వరకు పనిచేస్తారని అనుకుంటున్నాం. సాలరీ ప్రతి సంవత్సరం కన్సర్వేటివ్‌గా 8% లేదా ఆప్టిమిస్టిక్‌గా 10% పెరుగుతుందని కూడా భావిధాం. అలాగే మొదటి జీతం కన్సర్వేటివ్‌గా రూ. 30,000 లేదా ఆప్టిమిస్టిక్‌గా రూ. 50,000 ఉంటుంది. ఈ పరిస్థితుల్లో EPFలో నిరంతర పెట్టుబడి పెడితే, దీర్ఘకాలంలో మీరు కోటీశ్వరుడిగా మారే అవకాశముంది.
కన్సర్వేటివ్ గ్రోత్:
ఒకవేళ మీరు నెలకు రూ. 30,000 బేసిక్ జీతంతో ఉద్యోగం మొదలుపెట్టారని ఊహించండి. ప్రతీ ఏడాది 8% ఇన్క్రిమెంట్ వస్తుందని, అలాగే EPF మీద సగటున 8.25% వడ్డీ వస్తుందని అనుకుందాం. ఈ పరిస్థితుల్లో, మీరు ప్రతీ నెలా EPFలో క్రమం తప్పకుండా కాంట్రిబ్యూట్ చేస్తూ 25 సంవత్సరాలు కొనసాగితే ఆ మొత్తానికి కాంపౌండింగ్ మ్యాజిక్ జోడై, మీ EPF బ్యాలెన్స్ దాదాపు రూ. 1.11 కోట్లు అవుతుంది.
ఇక్కడ అందరికీ అర్థం కావాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మొదట జీతం తక్కువగానే ఉన్నా, నిరంతరంగా పొదుపు చేస్తూ ఉండటం చాలా ముఖ్యం. ప్రతి నెలా చిన్న మొత్తాలు పెట్టడమే అయినా, అవి సంవత్సరాల తరబడి వడ్డీపై వడ్డీ పెరుగుతూ పెద్ద మొత్తంగా మారుతాయి. అంటే, మీరు పెద్ద మొత్తాలు పెట్టాల్సిన అవసరం లేదు చిన్న మొత్తాలతోనే క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ ఉంటే, మీ రిటైర్మెంట్ సమయానికి కోటికి పైగా సంపదను సృష్టించుకోవచ్చు.
ఆప్టిమిస్టిక్ గ్రోత్:
మీరు నెలకు రూ. 50,000 బేసిక్ జీతంతో ఉద్యోగం మొదలు పెట్టారని అనుకుందాం. ప్రతి సంవత్సరం సుమారు 10% ఇన్క్రిమెంట్ వస్తుందని, అలాగే EPF మీద సగటున 8.25% వడ్డీ వస్తుందని తీసుకుంటే, మీరు 25 సంవత్సరాలు క్రమం తప్పకుండా EPFలో కాంట్రిబ్యూట్ చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది. కాంపౌండింగ్ శక్తితో వడ్డీపై వడ్డీ పెరుగుతూ, ఈ కాలానికి మీ EPF బ్యాలెన్స్ సుమారు రూ. 2.36 కోట్ల వరకు చేరుతుంది.
ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ జీతం ఎక్కువగా ఉండి, ప్రతీ సంవత్సరం మంచి హైక్ వస్తే, కేవలం EPF ద్వారానే 2 కోట్లకు పైగా సంపదను కూడగట్టడం పూర్తిగా సాధ్యం. అంతేకాకుండా, ఈ మొత్తం రిస్క్ లేకుండా, సేఫ్‌గా, ప్రభుత్వ హామీతో కూడిన పొదుపుగా పెరుగుతుంది. అంటే, సేఫ్‌గా ఉండాలనుకునే వారికి EPF ఒక మైలురాయి లాంటి రిటైర్మెంట్ సాధనం అవుతుంది.
EPF ఎందుకు వర్కౌట్ అవుతుంది?
EPF కాంట్రిబ్యూషన్ ఆటోమేటిక్‌గా జీతం నుంచి కట్ అవుతుంది. అంటే మీరు ఖర్చు చేసేయకుండా ముందే పొదుపు అవుతుంది. EPFO ప్రతి సంవత్సరం హామీ వడ్డీ రేటు ప్రకటిస్తుంది. ఇది మార్కెట్ రిస్క్‌కి లోనవ్వదు. పన్ను మినహాయింపులు కూడా ఉండటంతో EPF మరింత ప్రయోజనకరంగా మారుతుంది.
EPF ఒక్కరోజులోనే మీను ధనవంతుడిని చేయదు. కానీ మీరు 25 సంవత్సరాలు ఓపికగా, ప్రతి నెల క్రమం తప్పకుండా దానిలో డబ్బు వేస్తూ ఉంటే, రిటైర్మెంట్ సమయానికి సులభంగా రూ. 1 నుంచి రూ. 2 కోట్ల వరకు సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా ఈ సక్సెస్‌కి ఎలాంటి హై-రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్ అవసరం లేదు. కేవలం ఓపిక, క్రమం, మరియు కాంట్రిబ్యూషన్ కొనసాగించడం చాలు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications