నేటి యువత (Gen Z) డబ్బును ఎలా ఖర్చు చేస్తోంది? అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి ఖరీదైన ఫోన్లు లేదా బ్రాండెడ్ దుస్తులు. కానీ, ఇటీవల 'సూపర్ మనీ' (super money) విడుదల చేసిన నివేదిక మన అభిప్రాయాలను పూర్తిగా మార్చేస్తోంది. లక్షలాది యూపీఐ (UPI) లావాదేవీలను విశ్లేషించి రూపొందించిన ఈ నివేదిక.. భారతీయ యువత ఆర్థిక అలవాట్లపై ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.

'స్కాన్' చేయడమే వారి మంత్రం!
డిజిటల్ పేమెంట్స్ ఇప్పుడు యువతకు దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాయి. ఈ నివేదిక ప్రకారం.. 74% మంది యువకులు నెలకు 50 కంటే ఎక్కువ డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారు. చాలా మంది నెలకు 200 కంటే ఎక్కువ సార్లు క్యూఆర్ కోడ్ (QR Code) స్కాన్ చేసి పేమెంట్స్ చేస్తున్నారు. చిన్నపాటి చిరుతిండి దగ్గర నుంచి క్యాబ్ బుకింగ్ వరకు ప్రతిదానికీ వారు డిజిటల్ పేమెంట్స్‌నే నమ్ముకుంటున్నారు.
రూ. 200 ఎకానమీ: చిన్న మొత్తాలే ఎక్కువ!
యువత పెద్ద పెద్ద వస్తువుల కంటే చిన్న చిన్న అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సర్వే చెబుతోంది. దాదాపు 76% లావాదేవీలు రూ. 200 కంటే తక్కువ విలువ గలవే ఉండటం విశేషం. రోజువారీ నిత్యావసరాలు, కిరాణా సామాగ్రి మరియు చిన్నపాటి సరదాలకే ఈ మొత్తం ఖర్చవుతోంది.
అర్ధరాత్రి ఆకలి.. ఉదయాన్నే కిరాణా!
రోజులో ఏ సమయంలో ఏ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయో గమనిస్తే ఆశ్చర్యపోక తప్పదు. అర్ధరాత్రి నుంచి ఉదయం 6 వరకు.. ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్లు ఎక్కువగా ఉంటున్నాయి. అంటే యూత్ అంతా నైట్ ఫుడ్ కి బాగా అలవాటు పడ్డారన్న మాట. ఇక ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మెట్రో నగరాల్లో కిరాణా సామాగ్రి కొనుగోళ్లు మరియు సూపర్‌మార్కెట్ లావాదేవీలు టాప్‌లో ఉన్నాయి.
శుక్రవారం రాత్రి.. సరదాల వేళ!
వారమంతా కష్టపడి పనిచేశాక యువత తమను తాము సంతోషపెట్టుకోవడానికి ఎంచుకునే సమయం శుక్రవారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య. ఈ సమయంలోనే దేశవ్యాప్తంగా అత్యధిక లావాదేవీలు జరుగుతున్నాయి.
చిన్న నగరాల్లోనూ డిజిటల్ జోరు
డిజిటల్ విప్లవం కేవలం హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. టైర్-2, టైర్-4 నగరాల నుంచి 41% మంది యూజర్లు ఉన్నారు. కన్యాకుమారి నుంచి టిన్సుకియా వరకు ప్రతి చోటా యూపీఐ వాడకం విపరీతంగా పెరిగింది.
అప్పు తీసుకోవడంలో జాగ్రత్తగా..
క్రెడిట్ కార్డులు, అప్పుల విషయంలో నేటి యువత చాలా అప్రమత్తంగా ఉన్నట్లు కనిపిస్తోంది. 45% మంది కొత్తగా క్రెడిట్ ప్రపంచంలోకి వస్తున్నప్పటికీ.. వారు ఎఫ్.డి (FD) ఆధారిత సెక్యూర్డ్ కార్డులకే మొగ్గు చూపుతున్నారు. అనవసరమైన అప్పుల ఊబిలో కూరుకుపోకుండా.. ఆర్థిక క్రమశిక్షణతో కూడిన భవిష్యత్తును నిర్మించుకోవడంలో వారు ముందున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications