Gold Price: సెప్టెంబర్‌లో బంగారం ధరలు తగ్గుతాయా..!
బంగారం ధరల భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మూడు రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.770 తగ్గి రూ.1,62,980 వద్ద నమోదు అయింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.700 తగ్గి రూ.1,49, 400 పలుకుతుండగా.. తులం 18 క్యారెట్ల పుత్తడి ధర రూ.570 తగ్గి రూ.1,22,240 వద్ద కొనసాగుతోంది. అయితే ఆగస్ట్ లో భారీగా పెరిగిన పసిడి ధరలు సెప్టెంబర్ లో ఎలా ఉండబోతున్నాయో ఆసక్తిగా మారింది. సాధారణంగా ఒక నెల పుత్తడి ధరలు భారీగా పెరిగితే, తరువాతి నెలలో తగ్గుదల ఉంటుంది.
అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, డాలర్ విలువ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలపై బంగారం ధరలు ఆధారపడి ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్‌లో బంగారం ధరలు కూడా భారీగా పడిపోయే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారానికి దీర్ఘకాలంలో అనుకూల పరిస్థితులు కొనసాగుతున్నాయని పేర్కొంటున్నారు. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పసిడికి మద్దతుగా నిలిచే అవకాశం ఉందని వివరిస్తున్నారు. 2026 చివరి నాటికి అంతర్జాతీయంగా బంగారం ధర మరింత పెరిగే అవకాశాన్ని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

అదే సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం సెప్టెంబర్‌లో కీలకంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు. వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని.. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగితే బంగారంపై తాత్కాలిక ఒత్తిడి ఉండవచ్చని పేర్కొంటున్నారు. ఇటీవల ఫెడ్ చైర్ కెవిన్ వార్ష్ వ్యాఖ్యల తర్వాత బంగారం ధర ఒకే రోజులో 3 శాతానికి పైగా పడిపోయిన సంగతి తెలిసిందే. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారి ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయకుండా.. క్రమ క్రమంగా కొనుగోలు చేస్తే మంచిదని పేర్కొంటున్నారు. బంగారంపై పెట్టుబడి పెట్టే వారు గోల్డ్ ఈటీఎఫ్ ల్లో కూడా పెట్టుబడి పెట్టొచ్చని సూచిస్తున్నారు.
బంగారం ధర అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం, అమెరికా డాలర్ విలువ, అంతర్జాతీయ ద్రవ్యోల్బణ పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు,
భారత్‌లో పండుగలు, వివాహాల సీజన్‌లో డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధరపై ఆధారపడి ఉంటుంది. సెప్టెంబర్‌లో బంగారం ధరలకు పూర్తిగా క్షీణించే పరిస్థితి కంటే, హెచ్చుతగ్గులతో కూడిన బలమైన మార్కెట్ ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications