ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా మహిళల కోసం ఓ ప్రత్యేక పొదుపు పథకాన్ని తీసుకొచ్చింది. అదే మహిళా వికాస్ పత్రా(మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్). ఈ పథకం 2023 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు అంటే రెండేళ్ల పాటు ఉంటుంది. ఈ పథకలంలో భాగంగా ఒక మహిళా లేదా ఒక బాలిక గరిష్ఠంగా రెండు లక్షల వరకు పొదుపు చేయవచ్చు. ఇందులో కేవలం రెండేళ్ల పాటు మాత్రమే పొదువు చేయడానికి అవకాశం ఉంది.

7.5 శాతం వడ్డీ
మీరు 2023 ఏప్రిల్ లో నుంచి ఈ పథకంలో చేరవచ్చు. ఈ పథకంలో 7.5 శాతం వడ్డీ రేటు ఇస్తారు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం 8 శాతం ఇస్తుండగా.. సుకన్య సమృద్ధియోజనకు 7.6 శాతం ఇస్తున్నారు. అంటే ఈ రెండు పథకాల తర్వాత ఎక్కువ వడ్డి వచ్చే పథకం మహిళా వికాస్ పత్రా.. ఈ పథకంలో చేరిన వారు మధ్యలో వారి డబ్బును కొంత మొత్తం తీసుకోవచ్చు. ఎంత మొత్తం తీసుకోవచ్చో ఇంకా నిబంధనలు విడుదల చేయలేదు.

పన్ను మినహాయింపు
ఈ పథకానికి పన్ను మినహాయింపు ఉంటుందో లేదో ఇంకా ప్రకటించలేదు. కాగా మహిళా వికాస్ పత్రా పథకంలో చేరాలంటే 2023 ఏప్రిల్ 1 నుంచి మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ లేదా పోస్టాఫీస్ కు వెళ్లి ఈ పథకంలో చేరొచ్చు. కావాల్సిన పత్రాలు సమర్పించి, అప్లికేషన్ సర్పించి ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు.
మీరు డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత మీకు సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ఉదాహరణకు ఈ పథకంలో ఒక మహిళ రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే ఏడాదికి 7.5 శాతం చొప్పున రూ.16,125 వస్తాయి. రెండేళ్ల కాలనికి రూ. 31,125 వస్తాయి. అంటే మీరు రెండు లక్షల రూపాయాలు పెట్టిబడి పెడితే రెండళ్ల తర్వాత మీకు రూ.2.31 లక్షలు వస్తాయి.

ఎఫ్‌డీలపై
భారతీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఇండియా ప్రస్తుతం రెండేళ్ల కాలపరిమితి గల ఎఫ్‌డీలపై 6.75% వడ్డీ ఇస్తోంది. అలాగే, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా వంటి కొన్ని బ్యాంకులు ఇదే కాలపరిమితి గల డిపాజిట్లపై 7% వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటి కొన్ని బ్యాంకులు రెండేళ్ల కాలపరిమితి గల డిపాజిట్లపై 7.50% వడ్డీ ఆఫర్ చేస్తుండగా.. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 8% వడ్డీని కూడా ఆఫర్ చేస్తున్నాయి. అయితే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ప్రభుత్వ పథకం కాబట్టి రిస్క్ తక్కువగా ఉంటుంది.


Click it and Unblock the Notifications