For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Voter ID link With Aadhaar: ఓటర్ ఐడీతో ఆధార్ ఎలా లింక్ చేయాలంటే..

|

అన్ని ముఖ్యమైన పత్రాలతో ఆధార్ కార్డును లింక్ చేయడం ఇప్పుడు తప్పనిసరి చేశారు. మన రేషన్‌కార్డు, పాన్‌కార్డు తదితర అన్ని ముఖ్యమైన పత్రాలతో ఆధార్‌ను అనుసంధానం చేయాలని ఆయా శాఖలు ఇప్పటికే సూచించాయి. ఇదిలా ఉంటే భారత ఎన్నికల సంఘం ఓటర్ ఐడీ లేదా ఓటర్ ఐడీ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం ఎన్నికల సంఘం కూడా ప్రచారం ప్రారంభించింది.

ఫారం 6B
మన ఓటరు ఐడీకి ఆధార్ కార్డును లింక్ చేయడం ద్వారా ఓటరు జాబితాలో డబుల్ ఎంట్రీని నివారించవచ్చని చెబుతున్నారు. డూప్లికేట్ ఎంట్రీని నివారించడానికి కొత్త ఫారం 6B జారీ చేశారు. ఒక వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఉన్నట్లయితే లేదా ఒకే నియోజకవర్గంలో రెండుసార్లు నమోదు చేయబడినట్లయితే, దానిని సరిచేయడానికి ఆధార్ లింకింగ్ చేయబడుతుంది.

how to link voter id card with aadhaar card follow below steps

బిల్లు ఆమోదం..
గతేడాది డిసెంబర్‌లో లోక్‌సభ ఎన్నికల నిబంధనల (సవరణ) బిల్లును ఆమోదించింది. ఈ సవరణ ద్వారా మన ఓటర్ ఐడీతో ఆధార్‌ను లింక్ చేసుకోవచ్చు. కాబట్టి మన ఓటర్ ఐడీకి ఆధార్‌ని ఎలా లింక్ చేయాలో తెలుసుకుందాం..

1.జాతీయ ఓటరు అధికారిక సేవా పోర్టల్ అయిన NVSP.inకి లాగిన్ అవ్వాలి.
2.మీ NVSP ఖాతాకు లాగిన్ అవ్వాలి
3.సైన్ ఇన్ చేసిన తర్వాత, ఎలక్టోరల్ రోల్‌లో శోధనపై క్లిక్ చేయాలి
4.ఓటర్ IDని సెర్చ్ చేయడానికి మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి
5.ఆధార్ సమాచారాన్ని పూరించాలి
6.మొబైల్‌ని ఆధార్‌తో లింక్ చేయడానికి OTP వస్తుంది
7.ఈ OTPని నమోదు చేసిన తర్వాత లింక్ పూర్తవుతుంది.

English summary

Voter ID link With Aadhaar: ఓటర్ ఐడీతో ఆధార్ ఎలా లింక్ చేయాలంటే.. | how to link voter id card with aadhaar card follow below steps

Linking of Aadhaar card with all important documents is now mandatory. The respective departments have already suggested to link Aadhaar with all important documents like our ration card, pan card etc.
Story first published: Saturday, August 6, 2022, 16:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X