ఈ డిజిటల్ యుగంలో చాలా మందికి UPI, నెట్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండవచ్చు. అయితే ఇంకా చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు లేదా చిన్న వ్యాపారులు, రైతులు, రోజువారీ కూలీలు వంటి వారికి ఈ డిజిటల్ సేవలు అందుబాటులో లేకపోవచ్చు. అయితే సంపద నిర్మాణంలో అందరికీ భాగస్వామ్యం ఉండాలన్న ఉద్దేశంతో SEBI డిజిటల్ సేవలు లేని వారికి కూడా అవకాశం కల్పించే మార్గాలను రూపొందించింది.

SEBI ప్రవేశపెట్టిన కొత్త అవకాశం
SEBI ప్రకారం, డిజిటల్ సేవలు లేని వ్యక్తులు కూడా ఒక ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ నుంచి మార్చి వరకు)లో గరిష్ఠంగా రూ. 50,000 వరకు నగదుగా మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ అవకాశం ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉండే ప్రజల కోసం రూపొందించబడింది.
మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ అనేది అనేక మంది పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి, ఆ డబ్బుని ప్రకటించిన పెట్టుబడి లక్ష్యాలతో పెట్టిన ధన నిధి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఆ మొత్తం డబ్బును ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ తీసుకుని, షేర్స్, బాండ్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో పెట్టుబడి పెడతారు. ఈ విధానం స్టాక్ మార్కెట్ గురించి అనుభవం లేని వారు కూడా చిన్న మొత్తంలో పెట్టుబడి చేయొచ్చు, అలాగే నిపుణుల సలహాతో నడిచే పెట్టుబడి కాబట్టి సురక్షితంగా కూడా ఉంటుంది.
ఎవరు ఈ అవకాశం పొందవచ్చు?
నగదు రూపంలో మ్యూచువల్ ఫండ్‌ల్లో పెట్టుబడి చేసే అవకాశం, ప్రధానంగా డిజిటల్ పద్ధతులు అందుబాటులో లేని వారికి అనుకూలంగా ఉంటుంది. బ్యాంక్ ఖాతా లేని వారు, PAN కార్డ్ లేని వారు (కానీ KYC కోసం PAN అవసరం ఉంటుంది), రైతులకు, చిన్న తరహా వ్యాపారులకు, రోజువారీ కూలీలకు, వేతన జీవులకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇవాళ్టి రోజుల్లో ఆర్థిక వ్యవస్థలో భాగమవ్వని వారు కూడా ఈ విధంగా పెట్టుబడి పెట్టే అవకాశం పొందడం ద్వారా సురక్షితమైన సంపద నిర్మాణం వైపు ముందడుగు వేయవచ్చు. SEBI ఈ మార్గం ద్వారా అందరికీ పెట్టుబడి చేసే అవకాశాన్ని ఇస్తుంది.
ఎలా పెట్టుబడి పెట్టాలి?
మ్యూచువల్ ఫండ్ కంపెనీ బ్రాంచ్ లేదా ఆథరైజ్డ్ ఏజెంట్ వద్దకు వెళ్లాలి. అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ ఫారమ్‌ను నింపాలి. KYC ప్రక్రియను పూర్తి చేయాలి. దీని కోసం ఆధార్, ఫోటో, అడ్రస్ ప్రూఫ్ అవసరం. మీ ఆధారాలతో KYCని పూర్తి చెయ్యాలి. ఆ తరువాత మీరు ఎంత పెట్టుబడి చేయలనుకున్నారో ఆ మొత్తాన్ని నగదు రూపంలో వారికి ఇవ్వాలి. వాళ్ళు అదే రోజు ఉన్న NAV (Net Asset Value) ఆధారంగా మీకు మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కేటాయిస్తారు. మీరు తప్పనిసరిగా రిసీప్ట్ తీసుకోవాలి. ఇది భవిష్యత్తులో పెట్టుబడి ఆధారంగా ఉపయోగపడుతుంది.
ఈ విధానం చట్టబద్ధమేనా?
ఈ నగదు ద్వారా పెట్టుబడి పద్ధతి ప్రీవెనషన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం (PMLA), 2002 మరియు SEBI యొక్క AML (Anti-Money Laundering) నిబంధనలు ప్రకారం చట్టబద్ధమైనదిగా గుర్తించబడింది. అంతేకాకుండా, ప్రతి నగదు లావాదేవీ ట్రేసబుల్‌గా ఉంటుంది.
ఈ కొన్ని జాగ్రత్తలు పాటించాలి
మీరు ఈ విధానంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మీరు కచిత్తంగా KYC అవసరం.కాబట్టి మీకు మీ PAN కార్డ్ లేకపోతే, దీనిని ముందుగా పొందండి. ఆ తరవాత మీకు KYCతో ఈ విధానం పూర్తి అవుతుంది. మీరు నగదు లావాదేవీలు పూర్తి అయినాక రిసీప్ట్ తీసుకోవడం తప్పనిసరి. ఏజెంట్ లేదా బ్రాంచ్ ఎంచుకునే సమయంలో ఆధికారిక గుర్తింపు ఉన్నవారినే ఎంచుకోండి. ముఖ్యంగా ఒక ఆర్థిక సంవత్సరం లో రూ. 50,000 మాత్రమే నగదు ద్వారా పెట్టుబడి చేయొచ్చు.
డిజిటల్ సేవలు అందుబాటులో లేనందుకు మ్యూచువల్ ఫండ్ వంటి సంపద నిర్మాణ సాధనాల నుండి వేరుపడాల్సిన అవసరం ఇక లేదు. SEBI తీసుకువచ్చిన ఈ నగదు పెట్టుబడి విధానం ద్వారా మ్యూచువల్ ఫండ్‌లో వారి భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టే అవకాశం పొందుతున్నారు. ఈ విధానం చట్టబద్ధమైనది, సురక్షితమైనది, అలాగే పారదర్శకమైనది కూడా. ఒకసారి మీరు KYC పూర్తి చేసుకుంటే, ఈ ప్రయోజనాన్ని మీరు సులభంగా వినియోగించుకోవచ్చు. సంపదను నిర్మించడానికి ఇది మంచి మొదటి అడుగు అవుతుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications