Retirement corpus: జీవితాంతం ఆదాయం పొందాలా? ఇలా చేస్తే చాలు!
చాల మంది రిటైర్మెంట్ ప్లాన్ చేసుకునేటప్పుడు కేవలం సేఫ్టీ గురించి ఆలోచిస్తారు. కానీ ద్రవ్యోల్బణం (Inflation) అనే నిశ్శబ్ద శత్రువు మీ డబ్బు విలువను ఎలా తగ్గిస్తుందో మర్చిపోతుంటారు. ఓమ్నిసైన్స్ క్యాపిటల్ నివేదిక ప్రకారం, మనం ఎంచుకునే పెట్టుబడి మార్గాన్ని బట్టి మన రిటైర్మెంట్ లైఫ్ స్టైల్ మారుతుంది.

1. ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) - రిస్క్ తక్కువే కానీ..
చాలా మంది భారతీయులు తమ రిటైర్మెంట్ కార్పస్ (retirement corpus) మొత్తాన్ని ఎఫ్‌డీలలోనే ఉంచుతారు. అయితే, 70 ఏళ్ల వయస్సులో మీకు రూ. 10.7 లక్షల వార్షిక ఆదాయం అవసరమైతే, ఎఫ్‌డీ ద్వారా కేవలం రూ. 4.8 లక్షలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల 75 ఏళ్ల వయస్సు వచ్చేసరికి మీ అసలు సొమ్ము కూడా అయిపోవచ్చు. ఇది ద్రవ్యోల్బణాన్ని తట్టుకోలేదు, వారసులకు ఎలాంటి ఆస్తిని మిగల్చదు.
2. లైఫ్ యాన్యుటీ (Life Annuity)
ఇది గ్యారెంటీ ఆదాయాన్ని ఇస్తుంది. కానీ, ఇందులో వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. మీరు పెట్టిన పెట్టుబడి (Capital) లాక్ అయిపోతుంది. 70 ఏళ్ల వయస్సులో మీకు కావలసిన దానికంటే చాలా తక్కువ ఆదాయమే అందుతుంది. ఇన్‌ఫ్లేషన్ ప్రొటెక్షన్ కేవలం 55% మాత్రమే ఉంటుంది. మీ తర్వాత మీ కుటుంబానికి భారీ మొత్తంలో ఆస్తిని ఇచ్చే అవకాశం ఇందులో ఉండదు.
3. సిస్టమాటిక్ విత్ డ్రా ప్లాన్ (SWP)
మ్యూచువల్ ఫండ్ల ద్వారా చేసే ఈ ఎస్‌డబ్ల్యూపీ పద్ధతి ఎఫ్‌డీల కంటే మెరుగైన ఫలితాలను ఇస్తుంది. ఇది కొంత వరకు ద్రవ్యోల్బణాన్ని తట్టుకుంటుంది. కానీ, మార్కెట్ ఒడిదుడుకుల వల్ల 83 ఏళ్ల వయస్సు వచ్చేసరికి మీ కార్పస్ మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. అంటే శేష జీవితంలో నిధుల కొరత ఏర్పడవచ్చు.
4. సైంటిఫిక్ పే (ScientificPay) - కొత్త తరం వ్యూహం
ఈ నివేదిక ప్రకారం.. గోల్-బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అయిన 'సైంటిఫిక్ పే' పద్ధతి అత్యంత ప్రభావవంతమైనది. ఇందులో 75% ఈక్విటీ, 25% డెట్ కేటాయింపులతో పోర్ట్‌ఫోలియోను రూపొందిస్తారు.
- దీనివల్ల 70 ఏళ్ల వయస్సులో మీకు కావలసిన రూ. 10.7 లక్షల కంటే ఎక్కువ అంటే రూ. 11.5 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
- ఇది ద్రవ్యోల్బణాన్ని 101% తట్టుకుంటుంది.
- విచిత్రం ఏమిటంటే.. మీరు జీవితాంతం ఆదాయం పొందుతూనే.. 100 ఏళ్ల వయస్సు నాటికి మీ వారసులకు సుమారు రూ. 14.4 కోట్ల భారీ నిధిని (Legacy) వదిలి వెళ్ళవచ్చు.
రిటైర్మెంట్ అంటే కేవలం డబ్బును దాచుకోవడం కాదు. అది పెరుగుతూ మీకు కావలసినంత ఆదాయాన్ని ఇచ్చేలా ప్లాన్ చేసుకోవడం. అందుకే సాంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాలను కూడా పరిశీలించడం మంచిది.


Click it and Unblock the Notifications