తల్లిదండ్రులు తమ పిల్లలకు అత్యుత్తమ విద్య, వైద్య సౌకర్యాలు లేదా మంచి జీవనశైలిని అందించేందుకు వారి జీవితకాలంలో తమవంతు కృషి చేస్తారు. వారి తదనంతరం సంపాదించిన ఆస్తులను, పిల్లలకోసం ఇన్నాళ్లుగా నిర్వహించిన సేవింగ్స్ ప్రయోజనాలు వారికి చేరాలని కోరుకుంటుంటారు. తల్లిదండ్రులు తమ ఆస్తులను, అప్పులను తదనంతరం పిల్లలు సులువుగా నిర్వహించగలిగే విధంగా ఏర్పాట్లు చేయవచ్చు.
అనుకోని పరిస్థితి ఎదురైతే..
జీవితం అనిశ్చితితో నిండి ఉంటుంది. కరోనా మహమ్మారి మనకు కఠినమైన మార్గాన్ని నేర్పింది. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. కానీ ప్రతి ఒక్కరూ దానికి సిద్ధంగా ఉండాలి. అయితే.. అసలైన సంఘటన జరిగే సమయానికి ముందుగానే మనం ప్లాన్ చేసుకోవచ్చు. అలాటిది జరిగినప్పుడు కుటుంబం మానసిక క్షోభకు గురవుతుంది. ఆ సమయంలో.. వారసత్వానికి సంబంధించిన విషయాలను సులభంగా క్రమబద్ధీకరించడం చాలా ముఖ్యం. దానిని దృష్టిలో ఉంచుకుని.. ఒక వీలునామా ఏర్పాటు చేయటం ప్రాథమికంగా చాలా ముఖ్యం. ఇలా తమ తరువాత నామినీల వివరాలు అందించకపోవటం వల్ల దేశంలోని బ్యాంకుల వద్ద రూ. 24,000 కోట్లు క్లెయిమ్ చేయకుండా పడి ఉన్నాయని ఆర్‌బిఐ నివేదిక పేర్కొంది.
వీలునామాను రూపొందించడం..
ఆస్తులు & అప్పుల రెండింటి వివరాలను ఇందులో పరిగణలోకి తీసుకోవాలి. వీలునామా పత్రం మన ప్రియమైన వారికి మనం ఊహించిన/కేటాయించిన ఆర్థిక ప్రయోజనాలను పొందేదుకు చట్టపరంగా దోహదపడుతుంది. అకాల మరణం సంభవించినప్పుడు డ్రాఫ్టింగ్ మరింత క్లిష్టంగా మారుతుంది. చెల్లుబాటు అయ్యే తేదీతో పాటు అన్ని పేజీలపై సంతకం తప్పక చేయాలి. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది సాక్షులు వీలునామాకు సాక్ష్యమివ్వాలి. వీలునామాపై సంతకం పెట్టే సాక్షి వీలునామా వల్ల లబ్ధిదారుడు అయిఉండకూడదు.
NRI పిల్లల కోసం వీలునామా డ్రాఫ్టింగ్..
ఒకరి వారసుడు వేరే దేశంలో ఉంటున్నాడనుకుందాం. అలాంటప్పుడు.. అతనికి/ఆమెకు బ్యాంకు ఖాతాల వివరాలు, పెట్టుబడులు, లాకర్ల ప్రదేశం, ఆస్తులకు సంబంధించిన అన్ని ముఖ్యమైన పత్రాల గురించి తెలియకపోవచ్చు. వారికి తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తుల పూర్తి వివరాలు తెలియకుండా పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అన్నింటికి మించి పిల్లలకు తెలియకపోవచ్చు. ఒక వేళ ఆఖరికి అనుకోకుండా వచ్చే బాధ్యతల గురించి కూడా వారికి అవగాహన ఉండకపోవచ్చు. అన్ని వివరాలను వీలునామాలో క్లియర్ గా తెలియజేయటం ఉత్తమం.
మీ బ్యాంక్ బ్యాలెన్స్, లాకర్‌లోని విలువైన వస్తువులు, ఎఫ్‌డిలు, మ్యూచువల్ ఫండ్‌లు, డీమ్యాట్ ఖాతాలలో హోల్డింగ్‌లు ఇతర పెట్టుబడులు, ప్రైవేట్ కంపెనీ షేర్లు, పెన్షన్ ఫండ్, ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ మొదలైనవన్నీ మీకు స్వంతమైన ఆస్తులుగా ఉంటాయి. మీరు ఖాతా లేదా లాకర్‌ని కలిగి ఉన్న బ్యాంక్/సంస్థ, బ్రాంచ్ చిరునామా మొదలైనవి, వాటి అకౌంట్ నంబర్లు ఉంటాయి. మీకు కళ & కళాఖండాలు వంటి ఆస్తులు ఉంటే వాటిని గుర్తించాలి. చివరగా, మీకు ఏవైనా బాధ్యతలు ఉన్నట్లయితే, కుటుంబ సభ్యులకు వాటి గురించి తెలిసేలా వీలునామాలో వాటిని పేర్కొనడం సముచితం. ఒకవేళ మీకు పెట్టుబడులలో లేదా మీ సంబంధాన్ని నిర్వహించడంలో మీకు సహాయం చేస్తున్న వ్యక్తి ఉంటే, మీరు ఈ వ్యక్తి పేరు కరెస్పాండెన్స్ వివరాలను జోడించడాన్ని ఎంచుకోవచ్చు.

పిల్లలు, డిపెండెంట్ కుటుంబ సభ్యుల మధ్య సంపద స్పష్టమైన విభజన:
ఆస్తులు, అప్పుల విభజనను వీలునామాలో స్పష్టంగా తెలపాలి. మైనర్ల విషయంలో.. సంరక్షకుడిని నియమించడానికి ఒక నిబంధన ఉండేలా చూసుకోవాలి. చివరికి వదిలివేయబడిన ఏదైనా ఆస్తితో వ్యవహరించడానికి తగిన నిబంధనలు వెల్లడించాలి. మీరు వీలునామాను స్వతంత్రంగా, ఎటువంటి బలవంతం లేకుండా రాసినట్లు పేర్కొనడం అత్యవసరం. ఒక వేళ మీకు అదే విషయాన్ని పేర్కొంటూ డాక్టర్ సర్టిఫికేట్‌ను వీలునామాకు జతచేయవచ్చు.
ఛారిటీ..
మీరు ఆస్తిని దాతృత్వానికి విరాళం ఇవ్వాలనుకుంటున్న సంస్థ పేరు లేదా వ్యక్తి వివరాలను వీలునామాలో పేర్కొనాలి. విరాళం మెుత్తం వివరాలను స్పష్టంగా వీలునామాలో పొందుపరచాలి.
విల్ కార్యనిర్వాహకుడిని ఎంపిక..
ఒకవేళ అవసరమైన సందర్బంలో వీలునామాను కోర్టు దృష్టికి తీసుకెళ్లి సదరు ఆస్తిని పంచాల్సిన బాధ్యతను పొందిన కార్యనిర్వాహకుడి వివరాలను వీలునామాలో ఉంచాలి. అతను ఆదర్శంగా మీ కంటే చిన్నవాడైన వ్యక్తి అయి ఉండాలి. ఈ బాధ్యతను మీ NRI పిల్లలు కూడా తీసుకోవచ్చు. అయితే కార్యనిర్వాహకుడిని ఎంపిక గురించి వారితో సంప్రదించడం తెలివైన పని. చివరగా.. దీనికి తోడు వీలునామా పత్రం ఎవరి వద్ద ఉందనే విషయాన్ని మీరు తప్పకుండా విదేశాల్లో నివసిస్తున్న వారసులకు తప్పకుండా తెలియజేయాలి. సరైన పద్ధతిలో వీలునామా ఏర్పాటు చేయటం వల్ల ఆస్తులు తల్లిదండ్రుల తరువాత వారి మనోభీష్టానికి అనుగుణంగా వారి వారసులకు చేరతాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications