కాలేజీ పూర్తయిన తర్వాత జాబ్ చేసే వారు జీతం గురించే కాకుండా జీతంలో ఎలాంటి అలవెన్సులు ఇస్తారనే దాని గురించి కూడా సరిగ్గా అవగాహనా ఉండదు. అసలు మనం తీసుకునే జీతం ఎలా విభజిస్తారు, దాని నుండి ఎంత పీఎఫ్ కట్ చేస్తారు ఇలాంటి సమాచారం తెలుసుకోవడం ముఖ్యం. సాధారణంగా, కంపెనీలు మీకు అందించే జీతంలో CTC (కంపెనీకి అయ్యే ఖర్చు) గురించి ప్రస్తావిస్తారు. కానీ మీ బ్యాంకు అకౌంట్లో వేసే జీతం అలాగే ఈ CTC మధ్య చాలా తేడాలు ఉంటాయి... ఇలా ఎందుకు జరుగుతుందో అర్ధం చేసుకోవడం ముఖ్యం... ఈ విషయాన్నీ తెలుసుకోవడం వల్ల మీరు వేరే కంపెనీకి మారినప్పుడు స్పష్టంగా జీతం పెరుగుదల అడగడానికి వీలు కలుగుతుంది. చాలా సార్లు, కంపెనీలు మనకు ఇచ్చే PaySlipలో అన్ని వివరాలు ఉంటాయి.
బేసిక్ శాలరీ:
దీని అర్థం ఒక కంపెనీ ఉద్యోగికి చెల్లించే ప్రాథమిక వేతనం. ఈ ప్రాథమిక జీతం ఆధారంగా ఒక వ్యక్తి PF కటింగ్ మొత్తం అలాగే చెల్లించాల్సిన ఇంటి అద్దె భత్యం (HRA) మొత్తాన్ని లెక్కించవచ్చు. ఈ ప్రాథమిక జీతం ఆధారంగా మీకు తరువాత చెల్లించాల్సిన గ్రాట్యుటీ లెక్కించబడుతుంది.

ఇంటి అద్దె భత్యం (HRA):
ఇంటి అద్దె భత్యం (HRA) హౌస్ రెంటల్ అలవెన్స్ . దీని అర్థం ఒక కంపెనీ ఉద్యోగులకు ఈ ఇంటి అద్దె భత్యాన్ని పన్ను రహిత డబ్బుగా అందిస్తుంది. దీనిని ఉద్యోగి ప్రాథమిక జీతంలో 40 నుండి 50% వరకు చెల్లించవచ్చు. ఇది కంపెనీని బట్టి ఉంటుంది. దీనిని తప్పనిసరి మీ జీతం స్లిప్‌లో చేర్చాలి.
సెలవు ప్రయాణ భత్యం(Leave travel allowancel):
కొన్ని కంపెనీలు ఉద్యోగులు ఇంకా వారి కుటుంబాలకు సెలవుల్లో ఇతర ప్రదేశాలకు ప్రయాణించడానికి అందించే భత్యం. మీరు చెల్లుబాటు అయ్యే ప్రయాణ టిక్కెట్లతో సహా డాకుమెంట్స్ అందిస్తే ఈ అలవెన్స్ పొందవచ్చు. అయితే ముందుగా మీ కంపెనీ దీన్ని అందిస్తుందో లేదో తెలుసుకోవడానికి మీరు మీ పే స్లిప్ చెక్ చేయవచ్చు.
ప్రత్యేక భత్యం:
కొన్ని కంపెనీలు ఉద్యోగులకు ప్రత్యేక బోనస్‌లను అందిస్తాయి, అంటే మీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ గుర్తించడం అండ్ కంపెనీ లాభాలలో వాటా అందుకోవడం.
మొబైల్ అండ్ ఇంటర్నెట్ భత్యం:
కొన్ని కంపెనీలు ఉద్యోగులు ఉపయోగించే సిమ్ కార్డులు అండ్ ఇంటర్నెట్ సేవల కోసం ప్రతి నెలా కొంత మొత్తంలో డబ్బు చెల్లిస్తాయి. కొన్ని కంపెనీలు నేరుగా సంబంధిత నెట్‌వర్క్ కంపెనీలకు డబ్బు చెల్లిస్తాయి.
ఆహార భత్యం:
కొన్ని కంపెనీలు ఆఫీస్ సమయాల్లో ఉద్యోగులకు అందించే టీ, పానీయాలు అండ్ ఆహారం కోసం కొంత మొత్తాన్ని ఛార్జ్ చేస్తాయి. అది కంపెనీలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని కంపెనీలు ఈ మొత్తాన్ని కట్ చేస్తాయి, మరికొన్ని కంపెనీలు ఎలాంటి కటింగ్ చేయవు. కానీ మీకు అలాంటి మినహాయింపు ఇస్తే దానిని మీ పే స్లిప్‌లో చూపించాలి.
రవాణా భత్యం: ఒక ఉద్యోగి ఇంటి నుండి ఆఫీస్ ప్రదేశానికి ప్రయాణించడానికి చెల్లించే రవాణా ఖర్చులు.
PF సహకారం (EPF):
కంపెనీ తరపున మీ PF అకౌంట్కు ఎంత మొత్తం జమ చేయబడింది అలాగే మీ జీతం నుండి ఎంత మొత్తాన్ని కట్ చేసి మీ PF అకౌంట్కు జమ చేసింది అనే వివరాలు ఉంటాయి.
పన్ను మినహాయింపు:
కొన్ని కంపెనీలు ఉద్యోగుల జీతాల నుండి TDS(deduct tax at source) కట్ తగ్గిస్తాయి. దీనిని మీ పాన్ నంబర్ మీద ఆదాయపు పన్ను శాఖకు సమర్పిస్తారు. మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసినప్పుడు, మీకు అర్హత కలిగి ఉంటే దాన్ని సమీక్షించి రిటర్న్ పొందవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications