బంగారం ధరలు దేశ వ్యాప్తంగా భగ్గుమంటున్నాయి. పసిడి ధర ఏకంగా లక్ష మార్కును దాటింది. రానున్నది పండగల సీజన్ కావడంతో పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు. ఒక వేళ కొన్నా అది నిజమైనదేనా లేక నకిలీదా అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బంగారం అసలైనదా..లేక నకిలీదా అనే విషయాన్ని మీరు ఇంట్లో నుంచే తెలుసుకోవచ్చు. అధికారిక ఆభరణాల షాపుల్లో ప్రొఫెషనల్ పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ..మీ ఇంట్లోనే సరళమైన పద్ధతులతో Gold మొదటి దశ పరీక్షలు చేయొచ్చు. దీనికి సంబంధించిన ఏడు చిట్కాలు మీకు అందిస్తున్నాం ఓ సారి చూడండి.
హాల్‌మార్క్ తనిఖీ చేయండి: మీరు కొనేప్రతి నిజమైన బంగారు ఆభరణం BIS హాల్‌మార్క్‌తో వస్తుంది. ఈ స్టాంప్‌లో BIS లోగో.. క్యారెట్ (22K/24K వంటి స్వచ్ఛత సూచన)తో పాటుగా ఆభరణాలు ఇచ్చిన వ్యాపారి యొక్క గుర్తింపు నంబర్ ఉంటాయి. వెలుతురు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో దీన్ని జాగ్రత్తగా పరిశీలించండి. హాల్‌మార్క్ ఉంటే అది స్వచ్ఛతకు ఓ మొదటి గుర్తుగా మనం భావించవచ్చు.

అయస్కాంత పరీక్ష: రెండవ పరీక్ష ఏంటంటే అయస్కాంత పరీక్ష.. బంగారం అనేది అయస్కాంతం కాదు. ఒక చిన్న అయస్కాంతాన్ని తీసుకొని బంగారు ఆభరణానికి దగ్గర పెట్టండి. అది అయస్కాంతానికి ఆకర్షితమైతే అది నకిలీదని తెలుసుకోవాలి. అందులో ఇతర లోహాల మిశ్రమం ఉండే అవకాశం ఉందని గమనించాలి.
నీటిలో ముంచే పరీక్ష: మీ బంగారాన్ని ఓ సారి నీటిలో వేసి చూడండి. నిజమైన Gold బరువుగా ఉండి వెంటనే మునుగుతుంది. అయితే ఇది ఒక్కటే ఆధారంగా అది నకిలీదా నిజమైనదా అని తేల్చలేరు.. దీంతో పాటుగా ఇతర పరీక్షలతో దాన్ని కలిపి చూడాలి.
ధరించి చూడండి: మీరు కొనుగోలు చేసిన బంగారాన్ని ఒక రోజు ధరించి చూడండి. మీ చర్మం రంగు మారకుండా ఉంటే అది ఒరిజినల్ గా ఉండే అవకాశం ఉంది. అది ఆకుపచ్చ లేదా నలుపు రంగు అయితే మాత్రం నకిలీదా అని గుర్తించాలి. అది బంగారు పూత మాత్రమే అయి ఉండవచ్చు. కాబట్టి అధికారిక షాపుకు వెళ్లి వెంటనే దాన్ని తనిఖీ చేయండి.
సిరామిక్ ప్లేట్ టెస్ట్: ఒక గ్లేజ్ లేని సిరామిక్ టైలును తీసుకొనిమీరు కొనుగోలు చేసిన బంగారాన్ని నెమ్మదిగా దానిపై రుద్దండి. బంగారు రంగు గీతలు ఉంటే, అది నిజమైనదిగా భావించవచ్చు. నల్లటి గీతలు వస్తే మాత్రం అది నకిలీ బంగారమై ఉండే అవకాశం ఉంది. వెంటనే కొన్న చోటుకు వెళ్లి మార్చుకోండి.
వెనిగర్ పరీక్ష: బంగారంపై కొద్దిగా తెల్లని వెనిగర్ వేసి 15 సెకన్లు అలానే ఉంచండి. బంగారం రంగు మారకపోతే అది నిజమైనదిగా భావించవచ్చు. కానీ ముదురు రంగులోకి మారితే మాత్రం అది నకిలీగా గుర్తించాలి.
మేకప్ టెస్ట్: మీ చర్మానికి లిక్విడ్ ఫౌండేషన్ వేసి దానిపై బంగారం దానిపై రుద్ది చూడండి. అలాగే కొంచెం సేపు ఆరనివ్వండి. నలుపు గీతలు వస్తే, అది స్వచ్ఛమైన బంగారం కాదని సంకేతంగా గుర్తించాలి.
ఈ పద్ధతులు ఇంట్లో బంగారం గురించి తెలుసుకోవడానికి ఓ మెట్టు మాత్రమే.. ఖరీదైన పసిడి పెట్టుబడులు విషయంలో మాత్రం మీరు BIS సర్టిఫికేషన్ గల ఆభరణాల దుకాణాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ ల్యాబ్ టెస్ట్ అనేది తప్పనిసరిగా చేయించాలి.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications