EPFO: మీ PF డబ్బులు సరిగ్గా జమ అవుతున్నాయా? ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి ఇలా..!
ప్రతి నెలా జీతం పడగానే మొబైల్‌కు వచ్చే మెసేజ్ చూసి మురిసిపోతుంటాం. కానీ, శాలరీ స్లిప్‌లో పీఎఫ్ (PF) కింద కట్ అయిన డబ్బులు నిజంగానే మీ EPFO అకౌంట్‌లో జమ అవుతున్నాయా? ఎప్పుడైనా చెక్ చేశారా? మనలో చాలామంది రిటైర్మెంట్ తర్వాత వచ్చే భరోసా కోసమే ఈ పొదుపు చేస్తున్నాం. కానీ, కొన్నిసార్లు కంపెనీల నిర్లక్ష్యం వల్ల లేదా సాంకేతిక కారణాల వల్ల మీ డబ్బులు ఖాతాలో అప్‌డేట్ కాకపోవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.

అసలు మీ డబ్బులు ఎక్కడకు వెళ్తాయి?
EPFO నిబంధనల ప్రకారం.. మీ బేసిక్ శాలరీ, డీఏ (DA)లో 12% మొత్తాన్ని పీఎఫ్ కింద కట్ చేస్తారు. అంతే మొత్తాన్ని మీ కంపెనీ కూడా మీ అకౌంట్‌లో జమ చేయాలి. అయితే కంపెనీ చెల్లించే 12% లో.. 3.67% నేరుగా మీ EPFO అకౌంట్‌లోకి వెళ్తుంది. మిగిలిన 8.33%.. పెన్షన్ స్కీమ్ (EPS)లోకి వెళ్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ డిపాజిట్లపై ఏడాదికి 8.25% వడ్డీ ఇస్తోంది. ఇది సాధారణ సేవింగ్స్ అకౌంట్ కంటే చాలా ఎక్కువ!
ఎన్ని రోజుల్లో బ్యాలెన్స్ అప్‌డేట్ అవుతుంది?
సాధారణంగా కంపెనీలు మీ జీతం నుండి పీఎఫ్ కట్ చేసిన 15 రోజుల్లోపు ఆ మొత్తాన్ని EPFO కి చెల్లించాలి. అంటే.. మీకు ఒకటో తేదీన జీతం వస్తే ఆ నెల 15 నాటికి పీఎఫ్ జమ అవ్వాలి. జమ అయిన రెండు మూడు రోజుల తర్వాత మీ పాస్‌బుక్‌లో అది కనిపిస్తుంది. ఒకవేళ 25వ తేదీ వచ్చినా అప్‌డేట్ కాకపోతే మీరు మీ హెచ్ఆర్ (HR)ని సంప్రదించడం మంచిది.
ఒక్క క్లిక్‌తో బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా..
ఇప్పుడు మీ పీఎఫ్ వివరాల కోసం ఎవరినీ అడగాల్సిన పని లేదు. మీ మొబైల్ నుంచే ఈజీగా తెలుసుకోవచ్చు..
- EPFO పోర్టల్ ద్వారా: EPFO అధికారిక వెబ్‌సైట్(epfindia.gov.in)లోకి వెళ్లి మీ UAN నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే చాలు. మీ పూర్తి పాస్‌బుక్ వివరాలు కనిపిస్తాయి. దీన్ని మీరు డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.
- ఉమాంగ్ (UMANG) యాప్: ఇది ప్రభుత్వ యాప్. ఇందులో EPFO సర్వీసెస్‌లోకి వెళ్లి మీ UAN నంబర్‌తో లాగిన్ అయితే, నిమిషాల్లో బ్యాలెన్స్ తెలిసిపోతుంది.
- మిస్డ్ కాల్ సదుపాయం: మీకు స్మార్ట్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ లేకపోయినా పర్వాలేదు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899 కు ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు. వెంటనే మీ బ్యాలెన్స్ వివరాలతో కూడిన SMS వస్తుంది.
- SMS ద్వారా: మొబైల్ మెసేజ్ బాక్స్‌లో EPFOHO UAN అని టైప్ చేసి 7738299899 కు పంపినా పూర్తి సమాచారం లభిస్తుంది.


Click it and Unblock the Notifications