బంగారం ప్రియులు షాపుల్లో బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే వారు కొనుగోలు సమయంలో జీఎస్టీ అనే అంశం ప్రస్తావనకు వస్తూ ఉంటుంది. బంగారు కొన్న తరువాత వారు ఇచ్చే రసీదులో జీఎస్టీ ఇంత కట్ అయింది అంటూ చెబుతారు. అయితే బంగారంపై జీఎస్టీ లెక్కింపు ఎలా వేస్తారు అనేది చాలా మందికి తెలియదు. దీని గురించి ప్రతిఒక్కరూ తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే మీ జేబులకు చిల్లులు భారీగానే పడతాయి. మరి బంగారంపై జీఎస్టీ లెక్కింపు ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం.
భారత ప్రభుత్వం జూలై 2017లో వస్తువులు మరియు సేవల పన్ను (GST)ని అమల్లోకి తీసుకురావడంతో బంగారం ధర...దాని పన్ను విధానం మారిపోయింది. ఈ కొత్త పన్ను విధానం ప్రకారం, బంగారం కొనుగోలు, దిగుమతి, తయారీ ఇలా ప్రతి దశలోనూ GST వర్తిస్తుంది. అందువల్ల, బంగారం ధర లెక్కించేటప్పుడు GST ఎలాగా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం కొనుగోలుదారులకు చాలా ముఖ్యం. ఇక ప్రభుత్వం జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి పసిడి ధరలు భారీగానే పెరుగుతున్నాయి.

బంగారంపై GST అంటే ఏమిటి? GST అనేది ప్రభుత్వం విధించే పరోక్ష పన్ను. ఇది బంగారం లేదా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే సమయంలో వర్తిస్తుంది. అలాగే ఇతర ఏ వస్తువు కొనుగోలు చేసే విషయంలోనైనా వర్తిస్తుంది. GST కేవలం వినియోగదారుడిపై మాత్రమే కాకుండా.. తయారీదారులు కూడా వస్తువు తయారీ ఛార్జీలపై GST చెల్లించాల్సి ఉంటుంది. కొత్త బంగారం లేదా ఆభరణాల కొనుగోలుపై GST తప్పక వర్తిస్తుంది. ఇక పాత బంగారం అమ్మకానికి పెట్టినప్పుడు దానికి GST వర్తించదు. దీంతో పాటుగా పాత బంగారాన్ని కొత్త ఆభరణాలుగా మార్చుకున్నా కూడా ఎటువంటి పన్ను ఉండదు. ఈ నిబంధనలు కొనుగోలుదారులకు కొంత ఉపశమనం ఇస్తాయని చెప్పుకోవచ్చు.
ప్రస్తుత GST రేట్లు బంగారంపై ఎలా ఉన్నాయో ఓ సారి చూసినట్లయితే.. బంగారం తుది ధరపై 3 శాతం GST ఉంటుంది. అలాగే తయారీ ఛార్జీలపై 5 శాతం GST ఉంటుంది. ఇక మీరు బంగారం కొనుగోలు చేసినప్పుడు కేవలం బంగారం ధరపై మాత్రమే కాకుండా, ఆభరణాల తయారీ ఖర్చుపైనా పన్ను చెల్లించాలి.2017లో GST రాకముందు కొనుగోలుదారులు బంగారం కొనుగోళ్లపై 1 శాతం VAT, 1 శాతం అమ్మకపు పన్ను చెల్లించేవారు. GST విధానం అమల్లోకి వచ్చాక ఈ రెండు పన్నులను తొలగించినప్పటికీ, ప్రస్తుతం ఉన్న పన్ను నిర్మాణం మధ్యతరగతికి బంగారం ఖరీదు పెరగడానికి కారణమైంది.
బంగారంపై GST లెక్కింపు ఎలా చేస్తారు? సాధారణంగా బంగారం GST లెక్కింపు సాధారణంగా మూడు భాగాలపై ఆధారపడుతుంది.. అవి Gold ధర (ప్రస్తుత మార్కెట్ రేటు × బరువు), ఇక రెండోది తయారీ ఛార్జీలు మూడవది GST (ఆభరణాల మొత్తం విలువపై 3%)
జీఎస్టీ ఫార్ములా:
తుది ధర = (బంగారం ధర × బరువు) + తయారీ ఛార్జీలు + [(బంగారం ధర + తయారీ ఛార్జీలు)పై 3% GST]
ఉదాహరణ లెక్కింపు
గ్రాముకు బంగారం ధర: రూ. 4,000
బరువు: 25 గ్రాములు
తయారీ ఛార్జీలు: బంగారం ధరలో 10% (రూ.10,000)
లెక్కింపు ఎలా చేయాలంటే..
బంగారం ధర = రూ. 4,000 × 25 (గ్రాములు) = రూ. 1,00,000
తయారీ ఛార్జీలు = రూ. 10,000
GST = (రూ. 1,00,000 + రూ.10,000) × 3% = రూ. 3,300
బంగారం మొత్తం ఖరీదు : రూ. 1,00,000 + రూ. 10,000 + రూ. 3,300 = రూ. 1,13,300. అంటే, 25 గ్రాముల బంగారు ఆభరణాలపై చెల్లించాల్సిన తుది మొత్తం gold Rate రూ. 1,13,300 అవుతుంది.
GST అమలులోకి వచ్చాక Gold ధరలో పారదర్శకత పెరిగింది.అయితే అదే సమయంలో తయారీ ఛార్జీలపై కూడా పన్ను ఉండటంతో బంగారం కొనుగోలు ఖర్చు పెరిగింది. దీంతో బంగారం ధర కూడా పెరుగుతూ వస్తోంది.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications