బ్యాంక్ వేలం వేసే ఇళ్ల ప్రక్రియ గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్! తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ ఇళ్లు దొరికే ఏకైక మా
సొంత ఇల్లు అనేది ఈ రోజుల్లో చాలామందికి ఒక తీరని కల. అయితే ప్రస్తుతం పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ధరల వల్ల సామాన్యులకు ఇల్లు కొనడం భారంగా మారుతోంది. కానీ, మీకు తెలుసా? మార్కెట్ ధర కంటే సుమారు 20 శాతం తక్కువ ధరకు ఇల్లు కొనే అవకాశం మనకు అందుబాటులో ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBs) వేలం వేసే ఆస్తుల ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఎవరైనా వ్యక్తి హోమ్ లోన్ (home loan) తీసుకుని, దానిని సకాలంలో చెల్లించలేకపోయినప్పుడు.. బ్యాంకులు ఆ బకాయిలను వసూలు చేసుకోవడానికి సదరు ఆస్తిని వేలం వేస్తాయి.

తక్కువ ధరకే ఎందుకు లభిస్తాయి?
సాధారణంగా బ్యాంకులు రుణం ఇచ్చే సమయంలో చేసే ఆస్తి విలువ (Paper Valuation) మార్కెట్ రేటు కంటే తక్కువగా ఉంటుంది. బ్యాంకుల ప్రధాన ఉద్దేశం తమ అసలు, వడ్డీని తిరిగి పొందడమే. అందుకే వారు పేపర్ వ్యాల్యూ కంటే కొంచెం ఎక్కువ ధరకు అమ్మినా లాభంగానే భావిస్తారు. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లకు లేదా సామాన్య కొనుగోలుదారులకు ఇక్కడ మంచి డిస్కౌంట్ లభిస్తుంది.
వేలం ఇళ్లను ఎక్కడ వెతకాలి?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. బ్యాంకులు వేలం వేయబోయే ఆస్తుల వివరాలను తప్పనిసరిగా కొన్ని వెబ్‌సైట్లలో ఉంచాలి. అందులో ముఖ్యమైనవి..
- బ్యాంక్ నెట్ (baanknet.com): కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల దీనిని సరికొత్తగా లాంచ్ చేసింది. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ నగరం, మీకు కావాల్సిన ఇంటి రకాన్ని ఎంచుకుంటే, వేలానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల జాబితా కనిపిస్తుంది.
- ఐబీఏపీఐ(Indian Bank Auction Mortgage Properties Information): ఇది కూడా ప్రభుత్వ వెబ్‌సైట్. దీనిలో కూడా వేలకొద్దీ ఆస్తుల సమాచారం ఉంటుంది. అయితే దీని యూజర్ ఇంటర్‌ఫేస్ కొంచెం పాతదిగా ఉండవచ్చు.
కొనేముందు గమనించాల్సిన కీలక అంశాలు..
బ్యాంక్ వేలంలో పాల్గొనే ముందు ఈ మూడు విషయాలను తప్పకుండా చెక్ చేసుకోవాలి..
- రిజర్వ్ ప్రైస్ (Reserve Price): వేలం ప్రారంభమయ్యే కనీస ధర ఇది. దీనికంటే తక్కువ బిడ్ వేయడానికి వీలుండదు. పోటీని బట్టి ధర 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పెరిగిన ధర కూడా మీకు లాభదాయకమో కాదో ముందే ఆలోచించుకోవాలి.
- EMD (Earnest Money Deposit): వేలంలో పాల్గొనాలంటే రిజర్వ్ ప్రైస్ లో సుమారు 10 శాతం మొత్తాన్ని ముందుగానే డిపాజిట్ చేయాలి. ఉదాహరణకు రిజర్వ్ ప్రైస్ రూ. 30 లక్షలు ఉంటే.. మీరు రూ. 3 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
- పొసెషన్ రకం (Physical vs Symbolic): ఇది చాలా ముఖ్యం. 'ఫిజికల్ పొసెషన్' ఉంటే ఇల్లు ఖాళీగా ఉందని అర్థం. కానీ 'సింబాలిక్ పొసెషన్' అని ఉంటే.. పాత యజమాని ఇంకా అక్కడే ఉండి ఉండవచ్చు. అటువంటి సందర్భంలో ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి సమయం పట్టవచ్చు.
మొత్తంగా చెప్పేదేంటంటే. బ్యాంక్ వేలం ద్వారా ఇల్లు కొనే ముందు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించడం (Due Diligence) చాలా ముఖ్యం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే.. తక్కువ ధరకే అద్భుతమైన ఇంటిని సొంతం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications