ఎటువంటి హామీ లేకుండా రూ. 20 లక్షల లోన్, ఎలా అప్లై చేసుకోవాలంటే..

చాలామందికి ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఎక్కడ అప్పు కాని లోన్ కాని పుట్టే అవకాశం ఉండదు..ఇక బ్యాంకులు అయితే సవాలక్ష డాక్యుమెంట్లు అడుగుతాయి. వాటిని సబ్మిట్ చేసే బదులు చాలా మంది లోన్ వద్దని అనుకుంటూ ఉంటారు.

పైగా గ్యారంటీ కూడా అడుగుతారు.. కాబట్టి ఈ రోజుల్లో ఎవరూ గ్యారంటీ ఇవ్వరు.. దీంతో బ్యాంకులు కూడా లోన్లను రిజెక్ట్ చేస్తుంటాయి. అయితే మోదీ సర్కారు ఇందుకోసం సరికొత్త స్కీమును అందుబాటులోకి తెచ్చింది. అదే ముద్రా లోన్.. దీని ద్వారా చాలామంది యువతీ యువకులు లోన్లు తీసుకున్నారు. వ్యాపారాల్లో స్థిరపడ్డారు.

ఈ ముద్రా లోన్ స్కీం కింద ఇప్పటికే దేశంలో దాదాపు 50 కోట్ల మందికి పైగా యువతీ యువకులు అన్ని కేటగిరిలకు చెందిన వారు బ్యాంకుల ద్వారా రుణాలను పొంది వ్యాపారాల్లో స్థిరపడుతున్నారు.

MSME support Pradhan Mantri Mudra Yojana Mudra scheme 2025 low interest loan India youth business support

ఇంకో శుభవార్త ఏమిటంటే.. ముద్రా రుణాల లిమిట్ 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.దీంతో యువ వ్యాపారవేత్తలకు అదనంగా రుణం లభించే అవకాశం కూడా ఏర్పడింది.అయితే ఈ రుణానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉంటాయో ఓ సారి మనం తెలుసుకుందాం.

ముద్ర రుణాలు: యువతకు ఉపాధి, అభివృద్ధికి ఓ బలమైన అండంగా చెప్పుకోవచ్చు. 2025 ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా ముద్రా రుణాల మాధ్యమంగా దాదాపు 50 కోట్ల మందికి పైగా యువతీ యువకులు లబ్ధి పొందారు. బ్యాంకింగ్ వర్గాల గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు రూ.33 లక్షల కోట్లకు పైగా ముద్ర రుణాలుగా విడుదలయ్యాయి. ఇది దేశంలో స్వయం ఉపాధికి ఊతమిచ్చే గొప్ప ముందడుగు అని నిపుణులు పేర్కొంటున్నారు.

ముద్ర రుణాల పరిధి విస్తరణ: ప్రారంభంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా మాత్రమే ముద్ర రుణాలు అందుబాటులో ఉండేవి. అయితే, పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ప్రైవేట్ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFCs), అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు వంటి అనేక ఆర్థిక సంస్థలు కూడా ఇప్పుడు ఈ రుణాలను అందిస్తున్నాయి.

ఈ ముద్రా రుణాలకు ఎటువంటి తాకట్టు అవసరం లేదు! ఈ రుణాల ప్రత్యేకత ఏమిటంటే, తాకట్టు లేకుండా రుణం లభిస్తుంది. ఇతర ప్రైవేట్ రుణాల వడ్డీలతో పోలిస్తే ముద్ర రుణాలు తక్కువ వడ్డీ రేటుతో లభిస్తాయి. ఇది చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లు ప్రారంభించాలనుకునే వారికి గణనీయమైన సహాయంగా మారుతోంది.

ముద్ర రుణాల వర్గీకరణ:

ముద్రా రుణాలు వ్యాపార అవసరాల ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించబడ్డాయి:

1. శిశు (Shishu):
రూ.50,000 వరకు రుణం (ప్రారంభ దశ వ్యాపారాలకు)

2. కిశోర్ (Kishor):
రూ.50,000 నుండి రూ.5 లక్షల వరకు (వృద్ధి దశలో ఉన్న వ్యాపారాలకు)

3. తరుణ్ (Tarun):
రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు (వ్యాప్తి దశ వ్యాపారాలకు)

4. తరుణ్ ప్లస్ (Tarun Plus):
రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల వరకు (మరింత పెద్ద స్థాయి వ్యాపార అభివృద్ధికి)

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) ద్వారా మీరు ఈ రుణాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద రుణం పొందడానికి మీకు కావలసిన వివరాలు, దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం.

ముద్రా అంటే ఏమిటి?
ముద్రా అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్. దేశంలో సూక్ష్మ, చిన్న పరిశ్రమలు, వ్యాపారాల అభివృద్ధి కోసం స్థాపించిన ఆర్థిక సంస్థ. బ్యాంకులు, బ్యాంకింగేత ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమకూర్చటమే ముద్రా లక్ష్యం. 2015లో ఈ పథకాన్ని ప్రారంభించారు.అవేంటో ఓ సారి చూద్దాం.

ముద్ర రుణం ఎలా పొందాలి? (Step-by-Step Process):

1. ముందుగా ఈ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి:

* ఆధార్ కార్డు
* పాన్ కార్డు
* బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్
* వ్యాపార ప్రణాళిక / ప్రాజెక్ట్ రిపోర్టు

2. దరఖాస్తు ప్రక్రియ:

* మీకు సమీపంలో ఉన్న బ్యాంక్‌ను సందర్శించండి
* మేనేజర్‌ను కలసి అవసరమైన రుణం రకం, కావాల్సిన మొత్తాన్ని తెలియజేయండి
* దరఖాస్తు ఫారం నింపి, అవసరమైన డాక్యుమెంట్లతో సమర్పించండి

3. పరిశీలన, ఆమోదం:

బ్యాంకు అధికారులు మీ అప్లికేషన్‌ను సమీక్షించి రుణాన్ని మంజూరు చేస్తారు లేదా తిరస్కరించే విషయాన్ని తెలియజేస్తారు.

ఆన్ లైన్ ద్వారా ఎలా చేయాలి

ఆన్‌లైన్ దరఖాస్తు ముద్రా రుణాల కోసం అధికారిక వెబ్ సైట్ ఉద్యమిమిత్ర www.udyamimitra.in వెబ్‌సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేయవచ్చు.

అందులో దరఖాస్తుదారు పేరు, ఇ-మెయిల్, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.

తర్వాత వ్యక్తిగత వివరాలు, వ్యాపార, పరిశ్రమ వివరాలు ఇవ్వాలి.

తర్వాత మీ ప్రాజెక్ట్ ప్రతిపాదనలతో హ్యాండ్ హోల్డింగ్ ఏజెన్సీని ఎంచుకోవాలి లేదా నేరుగా లోన్ అప్లికేషన్ సెంటర్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేయవచ్చు.

Take a Poll

బ్యాంకులు కిషోర్ రుణాలు కేటగిరీ కింద 50 వేల నుంచి 5 లక్షల వరకు రుణాలు ముంజూరు చేస్తారు.. అలాగే తరుణ్ కేటగిరి కింద ఐదు లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణాలను మంజూరు చేస్తాయి బ్యాంకులు.. ఇక తరుణ్ ప్లస్ రుణాలు చూసుకున్నట్లయితే ఈ స్కీం కింద పది లక్షల నుంచి 20 లక్షల రూపాయలు మీకు రుణంగా అందిస్తారు. అయితే వివరాలన్నీ సరిగా ఉంటేనే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయనే విషయం గుర్తించుకోండి. బ్యాంకులో మీరు అప్లై చేసుకున్న దరఖాస్తు ఫారం పరిశీలించిన అనంతరమే మీకు రుణం ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేస్తాయి. కాబట్టి ముందుగా అప్లయి చేసే సమయంలో అన్ని వివరాలను డాక్యుమెంట్లతో సహా కరెక్ట్ గా ఉంచుకోండి.

చివరగా మా మాట

ముద్రా రుణాలు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధికి దారితీసే మార్గం. కేవలం ప్రభుత్వ రంగం మాత్రమే కాకుండా, ఇప్పుడు ప్రైవేట్ రంగం కూడా ఈ యోజనలో భాగమవుతుండటంతో ఇది మరింత విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. వ్యాపార ఆలోచనలను నిజం చేసుకోవడానికి ఈ పథకం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

గమనిక: ఈ కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే, దీనిని పెట్టుబడి సలహాగా పరిగణించకూడదు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+