ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అనేది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మే 1, 2016న ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా నుండి ప్రారంభించిన ప్రతిష్టాత్మక సామాజిక సంక్షేమ పథకం. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద దేశంలోని బిపిఎల్ గృహాలకు అంటే పేదింటి మహిళలకు ఎల్‌పిజి కనెక్షన్‌లను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
గ్రామీణ భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే కట్టెల పొయ్యి వంటి ఇంధనాలను వదిలి శుభ్రమైన, మరింత సమర్థవంతమైన ఎల్‌పిజి (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్)తో భర్తీ చేయడం ఈ పథకం యొక్క ముఖ్యమైన లక్ష్యంగా చెప్పుకోవచ్చు.

మోదీ సర్కార్ పుణ్యమా అని ఈ స్కీం ద్వారా ఇప్పటికే దాదాపు పది కోట్ల మందికి పైగా కుటుంబాలకు సబ్సిడీ ధరలకే సిలిండర్ అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం కింద మీరు సబ్సిడీ సిలిండర్ పొందాలనుకుంటే ఆన్ లైన్ ద్వారా కాని, ఆఫ్ లైన్ ద్వారా కాని అప్లయి చేసుకోవచ్చు.
పేద కుటుంబాలకు శుభ్రమైన వంట గ్యాస్ (LPG) కనెక్షన్లు అందించడం ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం. 2016 మే 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగాఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు చెందిన దాదాపు 5 కోట్ల మందికి పైగా మహిళలకు LPG కనెక్షన్లు అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ పథకం కింద మహిళలకు రూ. 300 సబ్సిడీ రూపంలో అందుతుంది. సాధారణ లబ్దిదారుల కంటే PMUY కింద ఉండే లబ్దిదారులు ఇంకా ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. ప్రస్తుతానికి దీని కింద గ్యాస్ సిలిండర్ ధర 550 రూపాయలుగా ఉంది. 2025 మార్చి 1 నాటికి, భారతదేశంలో 32.94 కోట్ల LPG వినియోగదారులలో 10.33 కోట్ల మంది PMUY లబ్ధిదారులు ఉన్నారు.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకానికి అర్హత ప్రమాణాలు:
దరఖాస్తు చేసే మహిళ కనీసం 18 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి.
SECC-2011 డేటాబేస్‌లో ఉన్న BPL కుటుంబాలకు చెందిన మహిళలు అర్హులు
SC/ST, అతి వెనుకబడిన తరగతులు (MBC), అటవీ నివాసితులు, నదీ ద్వీపాలలో నివసించే వారు, PMAY (గ్రామీణ), Antyodaya Anna Yojana (AAY), టీ తోటల కార్మికులు మరియు మాజీ కార్మికులు వంటి వర్గాలకు చెందిన మహిళలు అర్హులు
రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి, అలాగే ఆదాయపు పన్ను పరిధిలో ఉండకూడదు. పురుషులకు అర్హత లేదు. అప్లయి చేసేవారికి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు. ఆధార్ కార్డు ఉండాలి. అలాగే బ్యాంక్ ఖాతా ఉండాలి. అలాగే మొబైల్ నంబర్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అవసరం.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకానికి దరఖాస్తు చేసుకునే విధానం
ఈ పథకం కోసం ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ దరఖాస్తుకు అప్లయి చేయాలనుకుంటే మీకు దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి, ఫారమ్ నింపి సమర్పించండి. మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనుకుంటే www.pmuy.gov.in లో లాగిన్ అయి అవసరమైన పత్రాలతో PMUY కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకు మీరు ఈ దశలను ఫాలో కావాల్సి ఉంటుంది.
ముందుగా రిజిస్ట్రేషన్ కోసం, ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి
అక్కడ కనిపించే న్యూ ఉజ్వల కనెక్షన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
అది క్లిక్ చేయగానే 3 గ్యాస్ ఏజెన్సీల పేర్లు కనిపిస్తాయి. వాటిలో మీకు ఏది కావాలో సెలక్ట్ చేసుకోండి.
ఆ తరువాత మీరు మరో కొత్త పేజీలోకి వెళతారు. ఆ పేజీలో మీ పేరు, మీ సమీపంలో గ్యాస్ ఏజెన్సీ పేరు, మొబైల్ నంబర్, పిన్ కోడ్ వంటి సమాచారాన్ని నింపండి.
తరువాత అక్కడ అడిగే పత్రాల ఫోటో కాఫీలను అప్ లోడ్ చేయండి. తరువాత దరఖాస్తు ఫారం సమర్పించండి.
అన్ని వివరాలు ఒకే అయిన తరువాత మీ దరఖాస్తు ఫారం విజయవంతంగా పూర్తి అయినట్లు మీకు కనిపిస్తుంది. మీ అప్లికేషన్ ఆమోదం పొందితే సిలిండర్ మీ ఇంటికి నేరుగా వస్తుంది.
More From GoodReturns

మీ రెస్టారెంట్ బిల్లుపై LPG ఫీజు వేస్తున్నారా..? వెంటనే ఇలా చేయండి!

LPG: భారత్‌కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

పిఎన్జి కనెక్షన్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి..స్టెప్ బై స్టెప్ గైడ్..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications