ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితులు, మిడిల్ ఈస్ట్ సంక్షోభం వల్ల ఎల్‌పిజి (LPG) సరఫరాపై ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో చాలామంది ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. అందుకే ఇప్పుడు 'పైప్డ్ నేచురల్ గ్యాస్' (PNG) పై అందరి దృష్టి పడింది. సిలిండర్ బుకింగ్ చేసే పని లేకుండా నేరుగా పైపుల ద్వారా మీ కిచెన్‌లోకి గ్యాస్ రావడం అనేది పెద్ద ఊరటనిచ్చే విషయం. మరి ఈ కనెక్షన్ ఎలా తీసుకోవాలి? దీనికి ఎంత ఖర్చవుతుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PNG వల్ల కలిగే లాభాలేంటి?
సాధారణ ఎల్‌పిజి సిలిండర్లతో పోలిస్తే PNG చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
- బుకింగ్ టెన్షన్ ఉండదు: గ్యాస్ అయిపోతుందనే భయం ఉండదు, రీఫిల్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు.
- స్థలం ఆదా: వంటింట్లో భారీ సిలిండర్లను ఉంచాల్సిన పని ఉండదు.
- వాడిన దానికే బిల్లు: మీరు నెలకు ఎంత గ్యాస్ వాడారో దానికి మాత్రమే బిల్లు చెల్లిస్తే సరిపోతుంది.
- నిరంతర సరఫరా: గ్యాస్ కంపెనీల నెట్‌వర్క్ ద్వారా 24 గంటల సరఫరా ఉంటుంది.
కనెక్షన్ కోసం ఎలా అప్లై చేయాలి? (Application Process)
మీ ఏరియాలో గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్ ఉందో లేదో ముందుగా చెక్ చేసుకోవాలి.
- అప్లికేషన్: మీ నగరంలోని అధికారిక గ్యాస్ ప్రొవైడర్ (ఉదాహరణకు భాగ్యనగర్ గ్యాస్, గెయిల్ గ్యాస్, అదానీ గ్యాస్) వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు లేదా కస్టమర్ సెంటర్‌కు వెళ్లవచ్చు.
- డాక్యుమెంట్లు: ఆధార్ కార్డ్ (Identity Proof), ఇంటి పన్ను రసీదు లేదా అద్దె ఒప్పందం (Address Proof), , ప్రాపర్టీ పేపర్లు సమర్పించాల్సి ఉంటుంది.
- సర్వే: అప్లికేషన్ తర్వాత ఒక టెక్నీషియన్ మీ ఇంటికి వచ్చి పైప్‌లైన్ వేయడానికి వీలవుతుందో లేదో పరిశీలిస్తారు.
ఖర్చులు ఎంత ఉంటాయి? (Costs and Deposit)
PNG కనెక్షన్ కోసం ప్రారంభంలో కొంత సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా రూ. 5,000 నుండి రూ. 10,000 మధ్యలో డిపాజిట్ ఉంటుంది. ఇంద్రప్రస్థ గ్యాస్ వంటి సంస్థలు సుమారు రూ. 7,000 వసూలు చేస్తున్నాయి. పైప్‌లైన్ పొడవు పెరిగినా లేదా అదనపు ఫిట్టింగ్‌లు కావాలన్నా అదనపు చార్జీలు పడవచ్చు.
ఎంత సమయం పడుతుంది? (Timeline)
మీ ఇంటి పరిసరాల్లో ఇప్పటికే మెయిన్ పైప్‌లైన్ ఉంటే, అప్లై చేసిన 7 నుండి 15 రోజుల్లో కనెక్షన్ పూర్తవుతుంది. ఒకవేళ మీ ఏరియాలో నెట్‌వర్క్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తుంటే మాత్రం మరికొంత సమయం పట్టవచ్చు. ఇన్‌స్టాలేషన్ తర్వాత సేఫ్టీ చెక్ చేసి గ్యాస్ సరఫరాను ప్రారంభిస్తారు.
మొత్తంగా చెప్పాలంటే.. భారతదేశంలోని ఢిల్లీ, ముంబై, గుజరాత్ వంటి ప్రాంతాల్లో PNG ఇప్పటికే బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు టైర్-2 నగరాల్లో కూడా గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోంది. మీరు కూడా పదే పదే గ్యాస్ బుకింగ్ (Gas booking) చేసే ఇబ్బంది పడకూడదనుకుంటే, మీ ఏరియాలో PNG లభ్యతను తనిఖీ చేసి కనెక్షన్ తీసుకోవడం మంచి నిర్ణయం.


Click it and Unblock the Notifications