భారత ప్రభుత్వం 8 మార్చి 2025 నుండి రేషన్ కార్డు పథకంలో మార్పులు చేసింది. రేషన్ కార్డు ద్వారా సమాజంలోని అత్యంత పేద వర్గాలకు ఆహార భద్రత, ఆర్థిక సహాయాన్ని అందించడమే ముఖ్య లక్ష్యం. భారతదేశంలో పేదలు, నిరుపేదలకు ప్రభుత్వం తక్కువ ధరకు రేషన్ ద్వారా అందిస్తుంది. అయితే అర్హత ఉన్న లబ్ధిదారులకు మాత్రమే ఉచిత రేషన్ కూడా ఇవ్వబడుతుంది. రేషన్ ఇవ్వడంలో పారదర్శకతను తీసుకురావడానికి, కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులను e-KYC చేయాలని కోరింది. రేషన్ కార్డు కోసం అప్లయ్ చేసుకోవడానికి, మీరు మీసేవా సెంటర్ లేదా తెలంగాణ పౌర సరఫరాల శాఖ వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ ఫామ్ తీసుకొని నింపాల్సి ఉంటుంది అలాగే అవసరమైన డాకుమెంట్స్ అటాచ్ చేసి నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించి సబ్మిట్ చేయాలి. అంతేకాదు మీరు ఇంట్లో కూర్చొని రేషన్ కార్డు e-KYC చేయవచ్చు.

రేషన్ కార్డు e-KYC ప్రక్రియ?
*ముందుగా e-KYC చేయడానికి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వెబ్‌సైట్‌కి వెళ్లండి.
* e-KYC చేయడానికి ఇక్కడ మీ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోండి.
* 'సర్వీస్ ఆప్షన్' హోమ్‌పేజీలో చూపిస్తుంది లేదా మీరు రేషన్ కార్డ్ మెనూ ఆప్షన్‌లో చూడవచ్చు.
*ఇక్కడ "రేషన్ కార్డ్ కోసం e-KYC" అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.
*దీని తర్వాత రేషన్ కార్డ్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
*కుటుంబ పెద్ద లేదా రేషన్ కార్డు ఎవరి పేరుతో ఉందొ వారి ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
*వెరిఫికేషన్ కోసం ఆధార్ లింక్ చేసిన ఫోన్ నంబర్‌కు OTP వస్తుంది, దానిని ఎంటర్ చేయండి.
*దీని తరువాత పూర్తి సమాచారాన్ని ఎంటర్ చేయండి, ఇప్పుడు e-KYC ప్రక్రియ పూర్తయినట్లు మెసేజ్ వస్తుంది.
e KYC ఎందుకు అవసరం: కేంద్ర ప్రభుత్వం ప్రకారం, రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఈ-కెవైసి చేయడం తప్పనిసరి. దీనితో మీరు మీ గుర్తింపును వెరిఫై చేయవచ్చు. దీని వలన మీరు భారతీయ పౌరులని, నకిలీ డాకుమెంట్స్ ఉపయోగించకూడదని స్పష్టమవుతుంది.నకిలీ రేషన్ కార్డులను తొలగించడానికి E-KYC అవసరం.
రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే: కొత్త రేషన్ కార్డు కోసం అప్లయ్ చేసుకోవాలంటే మీ సమీపంలోని మీ సేవా సెంటర్ లేదా మీ సేవ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. మీ సేవ సర్వీస్ ఫామ్‌పై క్లిక్ చేస్తే వివిధ శాఖల అప్లికేషన్లు కన్పిస్తాయి. వీటిలో మీరు పౌర సరఫరాల శాఖ సెలెక్ట్ చేయాలి. అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి. ఇప్పుడు మీ పేరు, వయస్సు, జెండర్, తండ్రి పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు వివరాలు ఎంటర్ చేయాలి. కావల్సిన డాకుమెంట్స్ అటాచ్ చేసి నిర్ణీత మొత్తం చెల్లించి మీ సేవా కేంద్రంలో సమర్పించాలి. దరఖాస్తు చేసేందుకు రెసిడెన్స్ ప్రూఫ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు కాపీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.


Click it and Unblock the Notifications