2025-26 ఏడాదికి టీటీడీ వార్షిక బడ్జెట్ ఆమోదించింది. చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలోని ట్రస్ట్ బోర్డు వచ్చే ఏడాదికి సంబంధించిన వార్షిక బడ్జెట్ అంచనాలను విడుదల చేశారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ. 5258 కోట్ల బడ్జెట్ అంచనా వేశారు. ఇది గతేడాది కన్నా ఎక్కువ అని చెప్పుకొచ్చు. గతేడాడి రూ. 5179 కోట్లను బడ్జెట్ గా ప్రవేశపెట్టారు. ఇక గతేడాది హుండీ రసీదుల నుండి గరిష్ట ఆదాయం రూ. 1,671 కోట్ల రాగా.. ఈ ఏడాది రూ. 1,729 కోట్లకు పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది.
ఇక తిరుపతి ట్రస్ట్ ప్రసాదాల అమ్మకం ద్వారా గతేడాది రూ. 550 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఈ ఆదాయాన్ని రూ. 600 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక గతేడాది ఇతర ఆదాయాల విషయానికి వస్తే.. దర్శన టిక్కెట్ల అమ్మకం ద్వారా రూ.310 కోట్లు ఆదాయం రూపంలో రాగా.. ఆర్జిత సేవా టిక్కెట్ల అమ్మకం ద్వారా రూ.130 కోట్లు ఆదాయం వచ్చింది. అలాగే వసతి, కల్యాణ మండపం వసూళ్లు ద్వారా రూ.157 కోట్లు వచ్చాయి. దీంతో పాటుగా కల్యాణకట్ట వసూళ్లు రూ. 176.5 కోట్లు, ట్రస్ట్ వసూళ్లు రూపంలో రూ.90 కోట్లు ఆదాయం రూపంలో వచ్చాయి. ఇక కొండపై అద్దె, విద్యుత్, నీటి ఛార్జీల వసూళ్లు రూపంలో రూ. 66 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రచురణ వసూళ్లు రూ. 31 కోట్లు..అలాగే ఇతర వసూళ్లు రూ. 170 కోట్లు వచ్చినట్లు టీటీడీ ఆలయ ట్రస్ట్ తెలిపింది.

ఈ ఏడాది రూ.1773.75 కోట్ల ఖర్చు : ఇక ఖర్చుల విషయానికి వస్తే.. టీటీడీ ట్రస్ట్ ఈ ఏడాది రూ.1773.75 కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేయనుంది. ఇక వసూళ్ల కంటే టిటిడి జీతం రూ.44.75 కోట్లు ఎక్కువగా ఉంది, ఈ సంవత్సరం జీతాల కింద రూ.1729 కోట్లు ఖర్చు చేయున్నారు. కార్పస్, ఇతర పెట్టుబడుల కోసం రూ.800 కోట్లను బోర్డ్ కేటాయించింది. ఆలయ ట్రస్ట్ వస్తు సామగ్రి కొనుగోళ్ల కోసం రూ.768.5 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఇంజనీరింగ్ క్యాపిటల్ వర్క్స్ రూ.350 కోట్లు, ఇంజనీరింగ్ నిర్వహణ పనులకు రూ.150 కోట్లు ఖర్చు చేయాలని టీటీడీ భావిస్తోంది.
ఇతర ఖర్చుల వివరాలు : అలాగే టీటీడీ ట్రస్ట్ SVIMS ఇంజనీరింగ్ క్యాపిటల్ పనులకు, SVIMS రెవెన్యూ గ్రాంట్లకు ఒక్కో దానికి రూ.60 కోట్లు కేటాయించింది. ఇతర సంస్థలకు గ్రాంట్లుగా రూ.130 కోట్లు కేటాయించింది.అలాగే TTD HDPP, ఇతర ప్రాజెక్టులకు రూ.121 కోట్లు కేటాయించింది. వీటితో పాటుగా TTD రుణాలు, అడ్వాన్సుల కోసం రూ.117.62 కోట్ల మొత్తాన్ని కేటాయించినట్లు తెలిపింది. అలాగే సౌకర్యాల నిర్వహణ సేవల కోసం రూ.80 కోట్లు, పెన్షన్, గ్రాట్యుటీ నిధి సహకార నిధి కోసం రూ.100 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాలు ఇవ్వడానికి రూ.50 కోట్లు కేటాయించినట్లు ట్రస్ట్ బోర్డు తెలిపింది.
గదులు బుక్ చేయడం కోసం కష్టాలు : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తుల సంఖ్య ఏ సందర్భంలోనైనా ఎక్కువగానే ఉంటుంది.అయితే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు బస చేయడానికి తిరుమలలో గదులు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్మించిన కాటేజీలు, గెస్ట్ హౌస్‌లలో గదులు బుక్ చేయడం అనేది తీవ్ర పోటీతో కూడిన ప్రక్రియగా ఉంది. ఇప్పుడు తిరుమలలో గది బుకింగ్ ఇక అంత కష్టమేమీ కాదు! భక్తులకు టీటీడీ ఆన్‌లైన్ వసతులు ఎక్కువగానే అందిస్తోంది.
ఈ సమస్యను పరిష్కరించడానికి టీటీడీ ఇప్పుడు భక్తులకు ఆన్‌లైన్ ద్వారా గదులు బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. తిరుమలకు వెళ్లే భక్తులు మొబైల్ యాప్ ద్వారా కూడా దీనిని సులభంగా చేసుకోవచ్చు. తద్వారా భక్తులు ముందుగానే గదిని బుక్ చేసుకుని, అక్కడికి వెళ్లిన తర్వాత ఇబ్బంది పడకుండా శ్రీవారి సేవలో భాగమయ్యే అవకాశాన్ని పొందవచ్చు.శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు గది బుకింగ్‌ను ముందుగానే చేసుకోవడం ద్వారా మీ ప్రయాణాన్ని సులభతరం చేసుకోవచ్చు. టీటీడీ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ ఉపయోగించి కొన్ని నిమిషాల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
టీటీడీ గదులు ఎలా బుక్ చేసుకోవాలి?
1. ముందుగా మీ మొబైల్ ఫోన్లో TTD Tirumala Tirupati Devasthanams అనే అధికారిక యాప్‌ను Google Play Store లేదా Apple App Store నుంచి డౌన్లోడ్ చేయాలి.
2.యాప్ ఓపెన్ చేసిన తర్వాత Accommodation(వసతి)విభాగంలోకి వెళ్లాలి.
3. మీరు ఉండదలచిన ప్రదేశాన్ని ఎంచుకోండి. తిరుమల, తిరుపతి, ఒంటిమిట్ట, తలకోన వంటి ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో గదులు అందుబాటులో ఉంటాయి.
4. గది బుకింగ్‌కు ముందు రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకోవడం తప్పనిసరి. ఆ టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మీరు గదులు బుక్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది.
5. అందుబాటులో ఉన్న AC/Non-AC గదులలో మీరు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు.అయితే ప్రతి గది 24 గంటల వసతికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఒక గదిలో గరిష్టంగా ఆరుగురు వరకు ఉండవచ్చు.
6.గది బుకింగ్ సమయంలో మీ ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరిగా అందించాలి. ఆధార్ కార్డు కలిగిన వ్యక్తికి గరిష్టంగా రెండు గదులు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంది.
తిరుమలలో గదుల కోసం నేరుగా తిరుమలలోనే ఎలా ప్రయత్నించాలి :
తిరుమల దర్శనంకు వచ్చిన భక్తులు వసతి గదుల కోసం ముందుగా తిరుమల బస్టాండ్ దగ్గర ఉన్న సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీసు (సీఆర్ఓ)కు వెళ్లాలి. అక్కడ మీ ఒరిజినల్ గుర్తింపు కార్డు (ఐడీ కార్డు) చూపించి వసతి గదులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫీసులో ఆధార్ కార్డు, దర్శనం టికెట్, మొబైల్ నంబర్ తదితర వివరాలతో ఒక దరఖాస్తు ఫామ్‌ను అక్కడే నింపాలి. ఆ తర్వాత కార్యాలయ సిబ్బందికి దాన్ని సమర్పిస్తే వారు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు.
ఈ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత మీ రిజిస్టర్ మొబైల్ కి మెసేజ్ వస్తుంది. మనకు కేటాయించిన గది వివరాలు ఆ మెసేజ్ లో ఉంటాయి. సీఆర్ఓ కార్యాలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తుల కోసం అందుబాటులో ఉంటుంది. ఇక్కడ గదుల కేటాయింపు అనేది ముందుగా వచ్చిన వారికే ప్రాధాన్యం ఉంటుందనే విషయం భక్తులు గమనించాలి.
తిరుమలలో గదులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మీరు వీలైనంత త్వరగా బుక్ చేసుకోవడం మంచిది. మీరు బుకింగ్ సమయంలో మీతో పాటు వచ్చే వారి వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. టిటిడి అందించే గదుల ధరలు ఇతర ప్రైవేట్ వసతులతో పోలిస్తే చాలా తక్కువ. భక్తుల ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అద్దె ధరలు నిర్ణయించబడతాయి. ఇది తిరుమలలో భక్తులకు భద్రతగా, భరోసాగా, తక్కువ ఖర్చుతో నివాసం కల్పించే చక్కటి మార్గంగా నిలుస్తోంది.
గురువారం జూన్ 26 2025వ తేదీన శ్రీవారిని 64,879 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,960 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4.09 కోట్లు కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.ప్రస్తుతం కొత్తగా క్యూ లైన్‌లోకి వెళ్తున్న వారికి15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు.ప్రస్తుతం భక్తులు 26 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారని, తెలిపారు.ఇక బుధవారం జూన్ 26 విషయానికి వస్తే. స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.67 కోట్లుగా టీటీడీ ప్రకటించింది. 23,765మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 75,001మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications