ట్విట్టర్‌కు ఎలాన్ మస్క్ భారీ ఆఫర్? ఆ మొత్తం ఎక్కువా తక్కువా?
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఇంకా బిలియన్లకొద్ది క్రియాశీలక వినియోగదారులను ఆకర్షించడంలో విఫలమైందనే వాదనలు ఉన్నాయి. ట్విట్టర్‌తో పోలిస్తే ఫేస్‌బుక్ రోజువారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య పదకొండు రెట్లు అధికం. గత త్రైమాసికంలో గూగుల్ నేతృత్వంలోని యూట్యూబ్‌తో పోలిస్తే ట్విట్టర్ ఆదాయం ఐదు రెట్లు తక్కువ. అయినప్పటికీ ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ముందుకు వచ్చారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో అతిపెద్ద వాటాదారుగా ఉన్న మస్క్ మిగిలిన వాటాను కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. ఈ మేరకు ఆఫర్ ఇచ్చారు.
ఒక్కో ట్విట్టర్ షేరును 54.20 డాలర్ల చొప్పున కొనుగోలు చేస్తామని, ఇందుకు 43 బిలియన్ డాలర్లు చెల్లిస్తామని ఆఫర్ చేసినట్లు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమీషన్‌కు ఇచ్చిన సమాచారంలో వెల్లడించారు. ఇది మన కరెన్సీలో రూ.3.22 లక్షల కోట్లు. మస్క్ ఆఫర్ తమకు అందిందని, వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తుది నిర్ణయం తీసుకుంటామని ట్విట్టర్ ప్రకటించింది. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

మస్క్ ట్విట్టర్‌లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ముందు ట్విట్టర్ షేర్ వ్యాల్యూ 39.91 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ప్రస్తుతం ఇది 45 డాలర్ల వద్ద ఉంది. అయితే తాను 54.20 డాలర్లు ఇస్తానని మస్క్ ప్రకటించారు. ప్రీమియం చాలా ఎక్కువగా ఉన్నందున బోర్డు ఆమోదం తెలిపే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అంతకుముందు ట్విట్టర్ షేర్ ఓ సమయంలో 70 డాలర్లకు వెళ్లింది. దాంతో చూస్తే మాత్రం మస్క్ ఆఫర్ తక్కువ.
ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని మస్క్ ప్రకటించిన నేపథ్యంలో పలువురు భిన్నంగా స్పందించారు. ట్విట్టర్‌ను ఒక వ్యక్తి సొంతం చేసుకోవడం, నియంత్రించడం చాలా ముఖ్యమని వెంచర్ క్యాపిటలిస్ట్ ఫ్రెడ్ విల్సన్ ట్వీట్ చేశారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తే సొసైటీ, పాలిటిక్స్ పైన ప్రభావం చూపుతుందని నేను భయపడ్డానని వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ మాక్స్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఏదైనా జరుగుతుందని అతను నమ్ముతున్నాడని, ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే మనకు ఎక్కువ కంటెంట్ నియంత్రణ అవసరమని, తక్కువ కాదన్నారు.


Click it and Unblock the Notifications