War Stock: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అందరికీ చేటు చేసినప్పటికీ మన దేశంలోని ఒక కంపెనీకి మాత్రం చాలా ప్రయోజనాన్ని కలిగించింది. థానేకు చెందిన కంపెనీ యుద్ధం కారణంగా మల్టీబ్యాగర్‌గా మారింది. తన ఇన్వెస్టర్లకు సైతం ఊహించని లాభాలను అందించి ఇప్పుడు మార్కెట్లో అందరినీ ఔరా అనేలా చేసింది.

స్టాక్ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది Maharashtra Seamless Ltd స్టాక్ గురించే. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఈ కంపెనీకి ఎలా సహాయపడిందో ఇప్పుడు తెలుసుకోండి. యుద్ధం మహారాష్ట్ర సీమ్‌లెస్ వంటి దేశీయ పైపుల తయారీ కంపెనీలకు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టింది. దీంతో కంపెనీ గత సంవత్సరం తన ఇన్వెస్టర్ల డబ్బును రెట్టింపు చేసింది.

పెరిగిన ఎగుమతులు..
జూన్ 2022 త్రైమాసికంలో కంపెనీ ముడి చమురు రవాణాకు వినియోగించే పైపుల ఎగుమతిని భారీగా పెంచింది. ఇది ముడి చమురు ధరల పెరుగుదల, కొత్త గ్యాస్ సప్లయర్స్ కోసం యూరప్ చేస్తున్న ప్రయత్నాలు కంపెనీకి కలిసొచ్చాయి. యూరప్ చర్యలు ఉత్తర అమెరికా, మధ్యప్రాచ్యంలో గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి కార్యకలాపాలను ప్రేరేపించటంతో కంపెనీకి ఆర్డర్లు పెరిగాయి.

కంపెనీ లాభాలు..
మహారాష్ట్ర సీమ్‌లెస్ కంపెనీ పైపు ఉత్పత్తులతో పరిస్థితిని ప్రభావితం చేసింది. ఎగుమతి మార్కెట్‌లో ఎక్కువ వాటాను ఆక్రమించింది. ఈ కారణంగా Q1FY23లో కంపెనీ నికర లాభం 59.91% పెరిగి రూ. 153.23 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో కంపెనీ అమ్మకాలు 93.25% పెరిగి రూ.1334.37 కోట్లకు చేరుకున్నాయి.

విదేశీ పెట్టుబడులు..
ఈ కంపెనీలో ప్రమోటర్లు, ఎఫ్‌పీఐలు, డిఐఐలు ఈ త్రైమాసికంలో తమ పెట్టుబడుల వాటాను పెంచుకున్నారు.అధిక పీడన వాతావరణంలో ముడి చమురు, గ్యాస్ రవాణా కోసం ఉపయోగించే సబ్‌సీ సోర్ సర్వీస్ సీమ్‌లెస్ పైపులను సరఫరా చేసేందుకు రూ.130 కోట్ల డీల్‌ను కంపెనీ పొందింది.

దిగ్గజ కంపెనీలతో వ్యాపారం..
ప్రస్తుతం కంపెనీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, లార్సెన్ & టూబ్రో, అదానీ వంటి దేశీయ క్లయింట్‌లను కలిగి ఉంది. రానున్న కాలంలోనూ విశ్లేషకులు ఎగుమతులు బలంగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. స్టాక్ మరింతగా పెరిగే అవకాశం ఉండవచ్చని అంచనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ రోజు స్టాక్ ధర రూ.749.50 వద్ద ట్రేడ్ అవుతోంది.


Click it and Unblock the Notifications