నమ్మండి..రూ.200 ఉంటే లక్షాధికారి అయిపోతారు..మీ జీవితాన్ని మార్చే చెట్ల పెంపకం ఇదే..

ఈ మధ్య కాలంలో భారతీయ రైతులు కొత్త అంశాల వైపు తమ దృష్టిని మళ్లిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం సాంప్రదాయ పంటలతో లాభాలు తగ్గిపోవడమేనని చెప్పుకోవచ్చు. దీనికి తోడు వాతావరణ మార్పులు, అధిక ఖర్చులు రైతులను వెంటాడుతున్నాయి. ఈనేపథ్యంలోనే రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందించే మార్గాలను వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల పాలిట వరంగా మహోగని చెట్ల సాగు మారుతోంది. తక్కువ ఖర్చుతో ఈ చెట్లు ఎక్కువ లాభాలు ఇస్తుండటం వల్ల చాలామంది రైతులు ఈ చెట్ల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు.

మహోగని" లేదా "మహాగని". ఇది ఒక రకమైన గట్టి చెక్క. దీని కలప ఎరుపు-గోధుమ రంగులో ఉండి చాలా మన్నికైనదిగా ఉంటుంది. మహోగని చెట్లు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాలలో పెరుగుతాయి. ఈ చెట్లను కలప రాజుగా పిలుస్తుంటారు. దీని కలప చాలా గట్టిగా ఉంటుంది. ఎంతో మన్నికైనది. తెగుళ్లను తట్టుకుని నిలబడుతుంది. అతి తక్కువగా నీటిని వినియోగించుకుంటుంది.

Mahogany tree farming green gold India Rs 200 to Rs 1 lakh farming profitable tree plantation mahogany cultivation business timber farming India long-term investment crops mahogany wood price high return tree farming sustainable farming India 200 1 200 1

ఫర్నిచర్ తయారీ, నౌకానిర్మాణం, సంగీత వాయిద్యాలు, లగ్జరీ ఇంటీరియర్స్ వంటి వాటిల్లో ఈ చెట్ల బెరడును ఉపయోగిస్తారు. ఈ చెట్లలోని ఆకులు, గింజలు, ఆఖరికి బెరడు కూడా అమ్మకానికి ఉపయోగపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే.. ఈ మొక్కలు నాటిన తరువాత దాదాపు 12 సంవత్సరాలు పంట కోసం ఉండాల్సి ఉంటుంది.మహాగని మొక్కలు వేడి వాతావరణంతో పాటు అతి శీతల వాతావరణంలో పెరగవు. కాబట్టి మన రెండు తెలుగు రాష్ట్రాలు ఈ చెట్ల పెంపకానికి చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇండియాలో మహోగని కలప ధర క్యూబిక్ అడుగుకు రూ.1,500 నుంచి రూ.2,500 వరకు ఉంటుంది.కాబట్టి కేవలం రూ. 200 పెట్టుబడితో ఒక మొక్కను నాటినట్లయితే 10-12 సంవత్సరాల తర్వాత ఒక్క చెట్టు రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ విలువైన కలపను మీకు అందిస్తుంది. ఈ చెట్లు వేర్లు భూమికి కొంత పైభాగంలోనే ఉంటాయి. కొండ ప్రాంతాల్లో కాకుండా మిగిలిన అన్ని భూభాగాల్లో ఈ చెట్లను పెంచుకోవచ్చు. రైతులు వ్యవసాయ, బంజరు భూములలో చాలా ఈజీగా వీటిని పెంచుకోవచ్చు. ఈ చెట్లు పెరిగాక కలప రంగును బట్టి మార్కెట్లో గిరాకీ ఉంటుంది.

ఎరుపు రంగులో ఉన్న కలప ధర రూ. 1300 నుంచి రూ. 2500 వరకు (క్యూబిక్‌ఫీట్‌) ఉంటుంది. అలాగే బ్రౌన్ రంగులో ఉన్న కలప కొంత తక్కువ ధరకు అమ్ముడుపోతోంది. ఈ చెట్టు సుమారు 60 నుంచి 80 అడుగులు పెరుగుతుంది. సరాసరి ఈ చెట్టు 40 క్యూబిక్‌ అడుగులు పెరుగుతుంది. తీవ్రమైన ఎడారి వేడి (50°C) ఉన్నప్పటికీ ఈ చెట్టు బాగా పెరుగుతోంది. ఇది మహోగని చెట్టు యొక్క దృఢత్వం మరియు తక్కువ నీరు సరిపడే సామర్థ్యాన్ని చూపిస్తోంది. దీనికి ఎరువులు, పురుగుమందుల ఖర్చు తక్కువగా ఉంటుంది.

మహోగని కేవలం కలపకే పరిమితం కాదు. ఈ Mahogany విత్తనాలు, బెరడు, ఆకులు మొదలైనవి మలేరియా, డయాబెటిస్, విరేచనాలు మరియు కొన్ని క్యాన్సర్ రకాల చికిత్సల్లో ఉపయోగిస్తారు.
ఇంకా ఈ చెట్ల ఆకులను సహజ సబ్బులు, దోమల వికర్షకాలు, ఆయుర్వేద టానిక్స్, పెయింట్లు, పురుగుమందులు తయారీలో ఉపయోగిస్తారు. ఈ అంశాల వల్ల మహోగనికి ఔషధ, పారిశ్రామిక రంగాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది.

ఒక కేజీ Mahogany విత్తనాల ధర మార్కెట్లో రూ. 1000 పలుకుతున్నాయి. ఈ విధంగా కూడా రైతులు డబ్బు సంపాదించుకోవచ్చు. 12 ఏళ్ల పాటు నిరంతరంగా రూ.10,000లకు పైగానే విత్తనాల ద్వారా ఆదాయాన్ని రైతులు పొందవచ్చు. ఈ విధంగా 12 సంవత్సరాల కాలంలో రూ.70 వేల రూపాయల ఆదాయాన్ని పొందవచ్చు. ఒక రైతు పొలంలో 1000 చెట్లను నాటితే 12 ఏళ్ల తర్వాత వాటిని రూ.6 కోట్లకు అమ్మవచ్చు.అయితే ఒక వ్యక్తి మహాగని పెంచాలనుకున్నప్పుడు సుదీర్ఘ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో ఈ పొలంలోనే అంతర పంటగా వేరేది ఏదైనా సాగు చేసుకోవచ్చు. ఈ పంటలు కూడా రైతులకు కొంత లాభాన్ని తీసుకురావడంలో సహాయపడతాయి.

బార్మర్ రైతు కథ : రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలోని ఆలయ పూజారి వాసుదేవ్ జోషి మహోగని సాగు లాభాలను చూపిస్తూ ఒక మోడల్‌గా నిలిచారు. మూడు సంవత్సరాల క్రితం ఆయన ఫేస్‌బుక్ ద్వారా రూ. 200 విలువైన మహోగని మొక్కను కొనుగోలు చేసి ఆలయం దగ్గర నాటారు. ఇప్పటికే ఆ చెట్టు 8-10 అడుగుల ఎత్తు పెరిగి పచ్చని చాయలను ఇస్తోంది. జోషి మాట్లాడుతూ ఇది నా కోసం ఒక స్టాండింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లాంటిది. 12 సంవత్సరాల తర్వాత ఇది సాధారణ పొదుపు పథకాల కంటే ఎక్కువ లాభం ఇస్తుందని చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+