అమెరికాలో ఉద్యోగ వీసా పొందడం ఎప్పుడూ సవాలుగా ఉంటుంది. ఫారం, డాక్యుమెంట్స్, ఫీజులు, లా ఫరంలలో పేపర్ వర్క్... ప్రతి దశకూ చాలా సమయం, శ్రమ, మరియు కొన్నిసార్లు భ్రమ కూడా తగలుతుంది. ఈ కష్టాన్ని తన జీవితంలో బాగా అనుభవించినవారిలో ఒకరు ప్రియాంకా కులకర్ణి. 34 ఏళ్ల మిషన్ లెర్నింగ్ సైంటిస్ట్ అయిన ప్రియాంకా, తన H-1B వీసా కోసం 9 సంవత్సరాలపాటు వివిధ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ అనుభవాన్ని ఆధారంగా తీసుకుని, ఇప్పుడు ఆమె AI సాయంతో ఇతరులకు అమెరికాలో ఉద్యోగ వీసాలను సులభంగా, వేగంగా మరియు తక్కువ ఇబ్బందులతో పొందే మార్గాన్ని అందిస్తున్నారు.
2024లో స్థాపించబడిన Casium స్టార్టప్ ఇటీవల $5 మిలియన్ల సీడ్ ఫండింగ్ సొంతం చేసుకుంది. ఇందులో మావెరిక్ వెంచర్స్, AI2 ఇంక్యుబేటర్, GTMfund, సక్సెస్ వెంచర్ పార్టనర్స్, మరియు ఏంజెల్ ఇన్వెస్టర్ జేక్ హెల్లర్ పాల్గొన్నారు.

Casium ఎలా పనిచేస్తుంది?
Casium కంపెనీలకు ఒక "డిజిటల్ పోర్టల్" ఇస్తుంది. దీన్ని ఉపయోగించి వీసా కేసులను మొదలు నుండి ముగింపు వరకు సులభంగా మేనేజ్ చేయవచ్చు. పాత Excel షీట్లు, ఖరీదైన లా ఫర్మ్ లపై ఆధారపడకుండానే, ఫాస్ట్, సులభంగా, పారదర్శకంగా వీసా ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ స్టార్టప్ ఇప్పటికే వందల మందికి అసెస్‌మెంట్స్, కాంప్లయెన్స్ చెక్స్, ఫైలింగ్స్ లో సహాయం చేసింది. కొన్ని సందర్భాల్లో, అప్లికేషన్ నుండి ఉద్యోగం చేరే వరకు ఒకే నెలలోనే ప్రక్రియ పూర్తయింది.
ప్రియాంకా కులకర్ణి ఎవరు?
భారతదేశంలో పెరిగిన ప్రియాంకా, కళాశాల తర్వాత "Microsoft" లో చేరారు. H-1B వీసా మీద 10 సంవత్సరాలు మిషన్ లెర్నింగ్ సైంటిస్ట్ గా పనిచేశారు. "నిజంగా, వీసా ప్రక్రియ కష్టంగా, గందరగోళంగా, మరియు కొన్ని సార్లు కెరీర్ పరిమితులను కలిగించేలా అనిపించింది," అని ఆమె చెప్పింది. 2024 లో EB-1 వీసా కోసం అప్లై చేసినప్పుడు, లా ఫిరం ద్వారా పేపర్ వర్క్ మూడు నెలల్లో పూర్తి అయ్యింది. కొత్త ఉద్యోగంలో మొదటి రోజున ఆమె ఇమ్మిగ్రేషన్ టెక్ పై పనిచేయాలని నిర్ణయించుకున్నారు.
Casium లో ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Casiumలో అభ్యర్థి మొదట ఫారం పూర్తి చేస్తారు. తర్వాత, AI "ఎజెంట్స్" పబ్లిక్ డేటా, పేటెంట్స్, రీసర్చ్ పేపర్స్ పరిశీలించి అభ్యర్థి ప్రొఫైల్ అర్థం చేసుకుంటాయి. కొన్ని నిమిషాల్లో Casium, H-1B, O-1, లేదా EB-1A వంటి ఉత్తమ వీసా ఆప్షన్ సిఫార్సు చేస్తుంది. తర్వాత ఈ వివరాలు లైసెన్స్ పొందిన లాయర్లు మరియు వారి అసిస్టెంట్స్‌కి వెళ్తాయి. వాళ్లు అన్ని డాక్యుమెంట్లు చెక్ చేసి, అభ్యర్థి వీసాకు అర్హత ఉందా లేదా అనేది ఒక్క క్లిక్‌తోనే తెలుసుకోవచ్చు. కులకర్ణి చెప్పినట్లుగా, ఈ టెక్నాలజీ వల్ల ముందుగా 3-6 నెలలు పట్టే పేపర్ వర్క్ ఇప్పుడు కేవలం 10 రోజులలోనే పూర్తవుతోంది. Casium ద్వారా, అమెరికా వీసా ప్రక్రియ ఇప్పుడు వేగంగా, తక్కువ ఖర్చుతో, సులభంగా మారింది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications