adani: అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణల కారణంగా అదానీ గ్రూపు కంపెనీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. దాదాపుగా ప్రతిరోజూ లోయర్ సర్క్యూట్లను తాకుతూ, పెట్టుబడిదారుల్లో గుబులు పట్టిస్తున్నాయి. పలు కంపెనీలు తమ మార్కెట్ విలువలో 50 శాతానికి పైగా కోల్పోయి చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అదానీ సంస్థల స్టాక్ కొనవచ్చా, లేదా ? అందుకు కారణాలేమిటో చూద్దాం..

ఆదాయం పెరిగినా..
ఫిబ్రవరి 14న అదానీ ఎంటర్ ప్రైజైస్ ఫలితాలు మార్కెట్ లో విడుదలయ్యాయి. ఇదే సమయంలో గతేడాది నమోదుచేసిన రూ.11.63 కోట్ల నష్టంతో పోలిస్తే, ఈసారి రూ.820 కోట్ల ఏకీకృత లాభాన్ని ప్రకటించింది. అంటే ఆదాయం 42 శాతం పెరిగింది. ఫలితాల అనంతరం కనిష్ఠ స్థాయి నుంచి 17 శాతానికి ఎగబాకింది. కానీ మూడీస్ సంస్థ తన రేటింగ్ ను 'స్థిరం' నుంచి 'ప్రతికూలత'గా మార్చడంతో చివరికి 1.8 శాతం లాభపడి రూ.1,750 వద్ద ట్రేడింగ్ ముగిసింది.

రేటింగ్ సంస్థలు నెగిటివ్ గా..
అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, ACC ఫ్రీ-ఫ్లోట్ స్టేటస్ ను ఫైనాన్షియల్ ఇండెక్స్ ప్రొవైడర్ MSCI తగ్గించడంతో.. మూడీస్ సైతం కొన్ని గ్రూపు కంపెనీల రేటింగ్ ను డౌన్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతకుముందు S&P గ్లోబల్ రేటింగ్స్ కూడా ప్రతికూల దృక్పథాన్ని కనబరిచింది. వీటికి తోడు, గ్రూపు వృద్ధి లక్ష్యాలను 40 శాతం నుంచి 15-20 శాతానికి అదానీ మేనేజ్ మెంట్ తగ్గించినట్లు నివేదికలు బయటకు రావడమూ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

అప్పటి నుంచీ నష్టాలబాటే:
జనవరి 24 నుంచి చూస్తే అంబుజా, ACC, NDTVతో సహా అదానీ గ్రూపు స్టాక్ లు దాదాపు రూ.10.2 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. ఇది వాటి మొత్తం ఉమ్మడి మార్కెట్ క్యాప్ లో దాదాపు 53 శాతం. అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్ వరుసగా 77, 73, 70 శాతం చొప్పున క్షీణించాయి. అదే సమయంలో NDTV, అదానీ పవర్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ విల్మర్ లో 53 నుంచి 65 శాతం మధ్య నష్టాలను మూటగట్టుకున్నాయి.

మిక్స్ డ్ టాక్:
ఫిబ్రవరి చివరి నాటికి MSCI ఇండెక్స్ లో సర్దుబాటు కారణంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్, ACCల నుంచి మరో రూ.3,450 కోట్లు బయటకు మళ్లవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్ సంస్థలు సైతం భారీ ఎత్తున తమ పోర్ట్ ఫోలియో నుంచి అదానీ కంపెనీల స్టాక్ విలువను తగ్గించుకున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ గ్రూపు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. కానీ అగ్రెసివ్, రిస్క్ ట్రేడర్స్ ప్రస్తుత వాలటాలిటీని వినియోగించుకుని వెంటనే బయటపడితే మంచి లాభాలు గడించవచ్చని పేర్కొనే వారూ ఉన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications