HMPV టెస్ట్ చేపిస్తే ఎంతో తెలుసా ? మీలో ఈ లక్షణాలు ఉంటే చేయాల్సింది ఇదే..

ప్రస్తుతం దేశం మొత్తంలో కొత్త వైరస్ హ్యూమన్ మెటాన్యూమోవైరస్ గురించి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ వైరస్ గురించి ప్రజల్లో ఎన్నో అనుమానాలు, భయాలు నెలకొన్నాయి. అయితే తాజాగా మంగళవారం రెండు కొత్త కేసులు నమోదయ్యాయి, దింతో ఇండియాలో మొత్తం కేసుల సంఖ్యా ఏడుకి చేరుకుంది. ఇవి బెంగళూరులో రెండు కేసులు, అలాగే అహ్మదాబాద్, చెన్నై ఇంకా సేలంలలో ఒక్కొక్కటి చొప్పున తరువాత నాగ్‌పూర్‌లో కేసులు కనుగొన్నారు. దేశవ్యాప్తంగా ఈ శ్వాసకోశ వైరస్ వ్యాప్తి అందరి దృష్టికి చేరింది.

హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV) అంటే ఏమిటి?
HMPV అనేది ఒక సాధారణ శ్వాసకోశ వైరస్. ముఖ్యంగా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, జలుబు వంటి తేలికపాటి లక్షణాలు ఉంటాయి. చాలా మంది ఆరోగ్యకరమైన వ్యక్తులు తగినంత విశ్రాంతి, మంచి ఆహారం తీసుకుంటే కోలుకోవచ్చు. కానీ చిన్న పిల్లలు, వృద్ధులు ఇంకా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారికీ తీవ్రమైన సమస్యలకు దారి తీయవచ్చు.

How much will HMPV tests cost What you need to know about lab fees

HMPV టెస్ట్ చేస్తే ఎంత ఖర్చువుతుందంటే :
HMPV టెస్ట్ చేయడానికి బయోఫైర్ ప్యానెల్ వంటి అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్స్ పద్ధతులు అవసరం, ఇది ఒకే టెస్టులో HMPVతో సహా వివిధ వ్యాధికారకాలను గుర్తించగలవు. భారతదేశంలోని చాల ప్రైవేట్ ల్యాబ్‌లు ఈ టెస్ట్ అందిస్తున్నప్పటికీ వీటికి ఖర్చు ఎక్కువగానే ఉంటాయి. పాత్‌ల్యాబ్స్, టాటా 1ఎంజి ల్యాబ్స్, మాక్స్ హెల్త్‌కేర్ ల్యాబ్ వంటి ప్రముఖ ల్యాబ్‌లలో సాధారణ హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ RT PCR టెస్ట్ కోసం రూ. 3,000 నుండి రూ. 8,000 వరకు ఖర్చవుతుంది. HMPV, Adenovirus, Coronavirus 229E, Coronavirus HKU1తో కూడిన టెస్ట్ కోసం మొత్తం ఖర్చు రూ. 20,000 వరకు ఉండవచ్చు. టెస్ట్ కోసం సాంపుల్స్ రకంలో నాసోఫారింజియల్ స్వాబ్స్, కఫం, బ్రోంకోఅల్వియోలార్ లావేజ్ (BAL) లేదా ట్రాచల్ ఆస్పిరేట్ ఉన్నాయి.

HMPV లక్షణాలు ఇంకా ప్రమాదాలు:
ఆరోగ్యకరమైన వ్యక్తులలో HMPV సాధారణంగా గొంతు నొప్పి, జలుబు, దగ్గు ఇంకా లో ఫీవర్ వంటి తేలికపాటి లక్షణాలను ఉంటాయి. అయితే వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, న్యుమోనియాతో సహా తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు దారితీయవచ్చు. చిన్న పిల్లలలో లక్షణాలు చూస్తే శ్వాస సమస్యలు, ఛాతీ కండరాల సమస్యా వంటివి ఉంటాయి. కొన్ని కొన్న్ని సందర్భాల్లో ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి.

HMPV చికిత్స :
ప్రస్తుతం HMPV చికిత్సకు సరైన యాంటీవైరల్ మందులు లేవు. తేలికపాటి లక్షణాలు ఉన్న చాలా మంది వ్యక్తులు సరైన విశ్రాంతి ఇంకా మంచి పౌష్టికహరం తీసుకుంటూ ఇంట్లోనే ఉండొచ్చు. అయితే ఒకవేళ లక్షణాలు తీవ్రమైతే ఆసుపత్రిలో చేరడం అవసరం కావచ్చు. తీవ్రమైన సందర్భాల్లో ఆక్సిజన్ థెరపీ, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్, కార్టికోస్టెరాయిడ్స్ తీసుకోవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+