పహల్గామ్ ఉగ్రవాద దాడి అలాగే కాశ్మీర్ పై చేసిన వివాదాస్పద ప్రకటనలతో తాజగా వార్తల్లో నిలిచిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ పాకిస్తాన్ సైన్యంలో అత్యున్నత హోదా, ఆర్మీ చీఫ్ పదవిలో కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం అతని జీతం, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి చాల ప్రశ్నలు తలెత్తుతాయి, కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విషయంలో ఖచ్చితమైన లెక్కలను బహిరంగంగా వెల్లడించలేదు. కానీ పహల్గామ్ దాడి, కాశ్మీర్ గురించి చేసిన ప్రకటనలు అసలు అసిమ్ మునీర్‌కు పాకిస్తాన్ ఎంత జీతం ఇస్తుంది అని అనుమాలను వ్యక్తం చేసింది.

అసిమ్ మునీర్ కెరీర్: జనరల్ అసిమ్ మునీర్ మంగళాలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ ద్వారా పాకిస్తాన్ సైన్యంలో చేరి, ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్‌లో చేరాడు. 2018 సంవత్సరంలో అతను త్రీ-స్టార్ జనరల్‌గా పదోన్నతి పొందాడు. తరివాత ఆయన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) డైరెక్టర్ జనరల్‌గా కూడా పనిచేశారు, ఇక్కడ ఆయన పదవీకాలం ఎనిమిది నెలలు మాత్రమే కొనసాగింది. ప్రస్తుతం, ఆయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌గా ఉన్నారు అంతేకాక ఆయన పదవీకాలం 2027 వరకు పొడిగించింది.
అసిమ్ మునీర్ జీతం: పాకిస్తాన్‌లో ఆర్మీ చీఫ్ జీతం, అలవెన్స్ గురించి సమాచారం బహిరంగంగా లేనప్పటికీ ఆర్మీ చీఫ్‌కు అత్యధిక జీతం, ప్రభుత్వ వసతి, భద్రత, వాహనం ఇంకా ఇతర సౌకర్యాలు కల్పించబడుతున్నాయని నమ్ముతారు. అంతేకాకుండా అతని రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అలాగే ఇతర ప్రయోజనాలను కూడా ఉంటాయి. కొన్ని నివేదికల ప్రకారం పాకిస్తాన్ జనరల్ అసిమ్ మునీర్ 2 లక్షల పాకిస్తానీ రూపాయల జీతం అందుకుంటున్నాడట.
కాశ్మీర్ పై చేసిన ప్రకటన: కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఇటీవల చేసిన వివాదాస్పద ప్రకటనల కారణంగా భారతదేశం ఇంకా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వేగంగా పెరిగింది. అతని రెచ్చగొట్టే ప్రసంగాలు ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిందని నమ్ముతారు.
తాజాగా పహల్గామ్ దాడికి అసిం మునీర్ ప్రసంగం కూడా కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ షంషాద్ మీర్జా ఓ పెద్ద వాదన చేశారు. అసిం మునీర్ ఇటీవలి ప్రకటనలు ఉగ్రవాద సంస్థలను రెచ్చగొట్టిందని, దాని కారణంగానే పహల్గామ్ ఊచకోత వంటి భయంకరమైన సంఘటన జరిగిందని అన్నారు. ఈ సంఘటన తర్వాత భారతదేశం అలాగే పాకిస్తాన్ మధ్య సంబంధాలలో చాలా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దౌత్య స్థాయిలో కూడా రెండు దేశాల మధ్య పరిస్థితి చాలా తీవ్రంగా మారింది.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications