ఎయిర్ హోస్టెస్ జీతం ఎంతో తెలుసా.. కానీ దీని గురించి తెలిస్తే ఇంకా పోటీయే..

భారతదేశంలోని సగం మందికి ఎయిర్ హోస్టెస్ జీతం ఎంత ఉంటుందో తెలియదు. దీని గురుంచి తెలిస్తే ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం కావాలంటూ పోటీ పడతారు. ఎయిర్ పోర్ట్ పరిశ్రమలో ఎయిర్ హోస్టెస్ కెరీర్ అన్ని సీజన్లలో మంచి ఆకర్షణీయమైన ఉద్యోగంగా ఉంటుంది. అంతెందుకు ఆకర్షణీయమైన జీతం ప్యాకేజీని కూడా అందిస్తుంది. సమాచారం చారం ప్రకారం భారతదేశంలో ఎయిర్ హోస్టెస్ జీతం, ఇంకా వాళ్ళు చేసే పని అంశాలు, అవసరమైన అర్హతలు, కెరీర్ అవకాశాలపై పూర్తి సమాచారం మీకోసం...

ఎయిర్ హోస్టెస్ లకు జీతం ఎంత వస్తుందంటే :
*అనుభవం: ఎయిర్ హోస్టెస్ జీతం అనేది వారికీ ఉన్న అనుభవంతో జీతం ఆధారపడి ఉంటుంది. ఎయిర్ హోస్టెస్ ఫ్రెషర్ జీతం ఇంకా అనుభవం ఉన్న ఎయిర్ హోస్టెస్ జీతం మధ్య తేడా ఉంటుంది.
*ఎయిర్‌లైన్ క్యాటగిరి: ప్రభుత్వ ఇంకా ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో జీతాల ప్యాకేజీలలో తేడా ఉంటుంది. అంతే కాకుండా దేశీయ అలాగే అంతర్జాతీయ విమానాల ఎయిర్ హోస్టెస్ జీతాలలో వ్యత్యాసం కనిపిస్తుంది.
*లొకేషన్: మెట్రో నగరాల్లో పనిచేసే ఎయిర్ హోస్టెస్‌లు చిన్న నగరాల కంటే ఎక్కువ జీతాలు అందుకుంటుంన్నారు.
*విద్యా అర్హత ఇంకా స్కిల్స్ : ఉన్నత విద్య, విదేశీ భాషల పరిజ్ఞానం, అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ జీతంపై ప్రభావం చూపుతాయి.

how much salary an air hostess gets if you know then there will be competition in it

భారతదేశంలో ఎయిర్ హోస్టెస్ జీతం: మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం, భారతదేశంలో ఒక ఫ్రెషర్ ఎయిర్ హోస్టెస్ జీతం సంవత్సరానికి దాదాపు రూ.5 లక్షల నుండి రూ.9 లక్షల వరకు ఉంటుంది.
*ప్రతినెల జీతం: గ్లాస్‌డోర్ వెబ్‌సైట్ ప్రకారం, భారతదేశంలో ఫ్లయిట్ అసిస్టెంట్ ప్రతినెల జీతం రూ.1,56,000 వరకు ఉంటుంది.
*ప్రభుత్వ విమానయాన సంస్థలు: ఎయిర్ ఇండియా వంటి ప్రభుత్వ విమానయాన సంస్థలలో ఎయిర్ హోస్టెస్ ప్రతినెల జీతం *రూ.40,000 నుండి రూ.50,000 మధ్య ఉంటుంది.
*అనుభవంతో జీతం పెంపు: మూడు సంవత్సరాల అనుభవం తర్వాత ఎయిర్ హోస్టెస్ జీతం నెలకు రూ.1 లక్ష నుండి రూ.1.5 లక్షల వరకు చేరుతుంది.

అంతర్జాతీయ విమానయాన సంస్థలో జీతం: అంతర్జాతీయ విమానయాన సంస్థలలో ఎయిర్ హోస్టెస్‌లకు ఎక్కువ జీతం ఉంటుంది, అంటే నెలకు రూ. 2 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. దీనితో పాటు వారు ట్రావెల్ ఆలోవేన్స్ , ఆరోగ్య బీమా ఇతర సౌకర్యాలు వంటి ప్రయోజనాలు కూడా పొందుతారు.

ఇతర ప్రయోజనాలు, ఉపయోగాలు
ట్రావెల్ అలోవేన్స్ : దేశీయ ఇంకా అంతర్జాతీయ విమానాలకు అదనపు భత్యాలు
ఆరోగ్య బీమా: ఆరోగ్య బీమాతో పాటు వైద్య సౌకర్యాలు
ట్రావెల్ డిస్కౌంట్: కుటుంబం, స్నేహితులతో కలిసి డిస్కౌంట్ ధరలకు ప్రయాణించే సౌకర్యం ఉంటుంది.
పదోన్నతులు సహా కెరీర్ వృద్ధి: అనుభవం ఆధారంగా సీనియర్ పోస్ట్స్, మెయింటెనెన్స్ పోస్టుల్లో పదోన్నతికి అవకాశాలు.

ఎయిర్ హోస్టెస్ కావడానికి అవసరమైన అర్హతలు
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: సాధారణంగా 18 నుండి 26 సంవత్సరాల మధ్య వయసు వారై ఉండాలి
శారీరక ప్రమాణాలు: కనీస ఎత్తు 155CM, ఎత్తుకు అనుగుణంగా బరువు ఉండాలి.
భాషా పరిజ్ఞానం: ఇంగ్లీష్, హిందీ భాషలలో ప్రావీణ్యం, విదేశీ భాషల పరిజ్ఞానం చాలా ప్రయోజనకరం.
ఇతర స్కిల్స్: అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, టీం వర్క్, సమస్య పరిష్కార సామర్థ్యాలు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం.

కెరీర్ ప్రమోషన్
ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్ ప్రారంభించిన తర్వాత అనుభవం, పనితీరు ఆధారంగా వివిధ ప్రమోషనల్ అవకాశాలు ఉంటాయి.

సీనియర్ ఫ్లైట్ అటెండెంట్: కొన్ని సంవత్సరాల అనుభవం తర్వాత ఇన్-ఫ్లైట్ మేనేజర్/క్యాబిన్ సర్వీస్ మేనేజర్ అంటే టీమ్ లీడర్‌షిప్ అలాగే మేనేజ్‌మెంట్ పోస్ట్స్ ఉండొచ్చు.
గ్రౌండ్ డ్యూటీలు: శిక్షణ, నియామకం, కస్టమర్ సర్వీస్ మేనేజ్‌మెంట్ మొదలైన వాటిలో అవకాశాలు కల్పిస్తారు.
కార్పొరేట్ పోస్ట్స్: సేల్స్, మార్కెటింగ్, ప్రజా సంబంధాలు ఇతర విభాగాలకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+