ఇలా తక్కువ ఖర్చుతో ఈజీగా మహాకుంభమేళాకు వెళ్లి రావొచ్చు.. ఇవన్నీ ఫ్రీ..

మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో మహా కుంభమేళా కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు నాసిక్, ఉజ్జయిన్, హరిద్వార్, ప్రయాగ్రాజ్ నగరాలకి వెళ్లి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. అయితే ఈ మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమై 45 రోజుల పాటు కొనసాగనుంది. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రపంచం నలుమూలల నుండి అందరూ వెళ్లి ఈ మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేస్తారు. కాబట్టి మహా కుంభమేళాకు వెళ్లేందుకు ఎంత ఖర్చవుతుందనే వివరాలు చూద్దాం..

మహా కుంభమేళా కోసం కమ్యూనిటీ కిచెన్‌లు, ఉచిత టెంట్లు ఏర్పాటు చేసారు, ఇంకా ఇక్కడ ఉచితంగా ఆహారాన్ని కూడా అందిస్తారు. మీకు లగ్జరీగా ఉండాలంటే అందుకు తగ్గట్టుగానే వసతులు కూడా ఉంటాయి. అయితే ఒకరి బడ్జెట్ ఆధారంగా అతను తన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లోని అస్సాంఘర్‌కు చెందిన రామచంద్రన్ అనే రైతు రైలులో ప్రయాగ్‌రాజ్‌ చేరుకొని అక్కడి నుంచి కుంభమేళా వేదిక వరకు 18 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి డబ్బు ఆదా చేసుకున్నట్లు తెలిపారు. ఉచిత కమ్యూనిటీ కిచెన్‌ల నుండి తనకు ఆహారం లభించిందని చెప్పారు. మొత్తానికి 200 రూపాయల వరకు ఖర్చు అయినట్లు వెల్లడించారు.

How much it cost to visit Mahakumba Mela here are travels charges room rents details

హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సుదర్శర్మ తన భార్యతో కలిసి మహా కుంభమేళా రైలులో వెళ్లి హోటల్‌లో బస చేసి స్థానిక రెస్టారెంట్లలో భోజనం చేస్తే మొత్తంగా వీరిద్దరికీ రూ.25వేలు ఖర్చు అయినట్లు ఆయన పేర్కొన్నారు. మరొకరు కుంభమేళా వేదికకు ఐదు కిలోమీటర్ల దూరంలోని ఓ హోటల్‌లో గది తీసుకుని రోజుకు రూ.7500 అద్దె చెల్లించినట్లు చెప్పారు. స్థానిక రెస్టారెంట్లలో భోజనానికి ఒక్కరికి రూ.350 అవుతుందని చెప్పారు. మహా కుంభమేళాకు లగ్జరీ టూర్ ప్లాన్ చేయాలనుకునే వారు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు చేయవచ్చు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వ్యాపారవేత్త హేమత్ సబారియా మహా కుంభమేళాకి వెళ్లేందుకు రెండు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలిపాడు.

ఓ విలాసవంతమైన హోటల్‌లో రూమ్ తీసుకున్నానని, రోజుకు భారీగానే రెంట్ చెల్లించానని చెప్పగా అంతేకాకుండా వివిధ చోట్ల ట్రావెలింగ్ సమయంలో భోజనం, వాహన ఖర్చుతో మొత్తం రెండు లక్షల రూపాయలు ఖర్చుయినట్లు చెప్పారు. మహా కుంభమేళాను సందర్శించేందుకు ప్రతి ఒక్కరి బడ్జెట్‌కు అనుగుణంగా వివిధ కంపెనీలు టూర్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. ప్రీమియం ప్యాకేజీలు రోజుకు 40 వేల రూపాయల వరకు ఛార్జ్ చేస్తాయి. ఇందులో రూమ్ రెంట్, ఫుడ్, ట్రావెలింగ్ చార్జెస్ కూడా కలిపి ఉంటాయని చెప్పారు.

తెలంగాణ నుంచి వెళ్లాలనుకునే వారు బడ్జెట్‌లో ప్రయాణం చేయాలనుకుంటే రైలులో ప్రయాగ్‌రాజ్‌కి వెళ్లి, ఉచిత వంటశాలలలో భోజనం చేసి, ఉచిత టెంట్‌లలో ఉండి, తక్కువ మొత్తం ఖర్చులో వెళ్లి రావొచ్చు. లేదంటే యాప్‌ల ద్వారా హోటల్ రూమ్‌లు, టూర్ ప్యాకేజీలను అడ్వాన్స్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మధ్య ఆదాయ వర్గానికి చెందిన వారైతే ఇద్దరు వ్యక్తులకి హైదరాబాద్ నుండి రూ.25 వేల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ట్రైన్ ద్వారా వెళ్లాలనుకుంటే హైదరాబాద్ నుండి రూ.1000 టికెట్ చార్జెస్ మొదలవుతాయి. విమానంలో అయితే 6వేల నుండి టికెట్స్ చార్జెస్ ఉంటాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సౌకర్యార్దం ఎన్నో ఉచిత సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇవన్నీ ఎలాంటి చార్జెస్ లేకుండా ఉచితంగా లభిస్తాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+