Gold savings: హద్దు లేకుండా చెలరేగిపోతున్న బంగారం ధరలకు కళ్లెం వేయడం కుదరడం లేదు. అందుకే కొంచెం తెలివిగల వాళ్లు తక్కువ రేటు ఉన్నప్పుడే భారీ స్థాయిలో కొనుగోలు చేసి దాచుకుంటున్నారు. వీటికి సెక్యూరిటీ కోసం బ్యాంకు లాకరులో కూడా పెట్టి భద్రపరుస్తున్నాయి. అయితే బంగారానికి సంబంధించి దేశంలో పలు నిబంధనలు అమలులో ఉన్నాయని చాలా మందికి తెలియదు.
ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం.. ఓ వ్యక్తి ఇంట్లో కొంతవరకు మాత్రమే బంగారాన్ని స్టోర్ చేసుకోగలడు.అంతకుమించి దాచుకోవాలని ప్రయత్నిస్తే IT విభాగం తీవ్రంగా పరిగణిస్తుంది. చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం వెనకాడే ప్రసక్తే లేదు. ఈ బంగారం లిమిట్ కూడా మగాళ్లకు ఒక రకంగా, ఆడవాళ్లకు మరో రకంగా ఉండేలా నిబంధనలు రూపొందించింది.

IT శాఖ రూల్స్ ప్రకారం వివాహిత మహిళలు 500 గ్రాములు బంగారం తమ వద్ద ఉంచుకోవచ్చు. పెళ్లి కాని వారు అందులో సగం అంటే 250 గ్రాములు కలిగి ఉండవచ్చు. అదే మగవాళ్లకు వచ్చేసరికి కేవలం 100 గ్రాములతో సరి పెట్టుకావాల్సిందే. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను పరిగణలోనికి తీసుకుని IT శాఖ ఈ నిబంధనలు రూపొందించినట్లు చెబుతుంటారు.
ఇక సేవింగ్స్ సంగతి కొంతసేపు పక్కన పెడితే వంశపారపరంగా వస్తున్న ఆభరణాలు మరియు నగలు పై కూడా IT శాఖ నిబంధనలు క్లియర్ గా ఉన్నాయి. ఈ తరహా బంగారంపై ఎటువంటి పన్ను విధించబడదు. ఇదే విధంగా దొరికిన ఆభరణాల గురించి నిర్ణీత పరిమితి వరకు IT విభాగం ప్రశ్నించదు. అయితే ఏదైనా కారణం వల్ల ఇన్వెస్ట్ చేస్తున్న బంగారం లాభసాటి ధరకు విక్రయిస్తే, అందుకు సంబంధించి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
More From GoodReturns

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఆఫర్లు.. బంగారం, డైమండ్లపై భారీ డిస్కౌంట్లు!

Tax rules: ట్యాక్స్ పేయర్లకు అలర్ట్! కొత్త ఐటీ చట్టంతో మారిన రూల్స్.. ఇకపై ఆ పోర్టల్ ద్వారానే సేవలు!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?



Click it and Unblock the Notifications