భారతదేశంలో బంగారు గనులు ఉండేవి ఇక్కడే.. తవ్వకాల ద్వారా ఎంత బంగారం ఉత్పత్తి అవుతుందంటే?
Indian Gold Mines: బంగారం అనేది ఎప్పటికి విలువ తగ్గని సంపద. అలాగే అత్యంత విలువైన లోహాలలో ఒకటి. మన దేశంలో బంగారంకి ఉన్న ప్రాముఖ్యత అంత ఇంత కూడా కాదు. మన సంప్రదాయానికి బంగారంతో గొప్ప చరిత్ర కూడా ఉంది. ప్రతి చిన్న శుభకార్యానికైనా, పండగకైన బంగారం కొనేందుకు ముందుగా ప్రాధాన్యత ఇస్తారు. అయితే మహిళలు అన్నిటికంటే మెచ్చేది కూడా బంగారాన్నే.
ఈ బంగారం ఉత్పత్తి ఎక్కడి నుండి అవుతుంది, మన దేశంలో బంగారం అవసరం ఎలా తీరుతుందో తెలుసా.. భారతదేశంలో బంగారు ఉత్పత్తి పరిమితం అయినగాని దేశంలోని కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున బంగారు తవ్వకాలు జరుగుతున్నాయి. మన దేశం నుండి ప్రతి సంవత్సరం సగటున 1.6 టన్నుల బంగారం ఉత్పత్తి అవుతుంది. అయితే, ఈ మొత్తం దేశ మొత్తం డిమాండ్‌లో కొద్ది భాగాన్ని మాత్రమే తీర్చగలదు.

ఇండియాలో బంగారం ఉత్పత్తి చేసే ప్రముఖ రాష్ట్రాలలో కర్ణాటక అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కెజిఎఫ్) ప్రాంతం దశాబ్దాలుగా దేశంలోనే ప్రముఖ బంగారం ఉత్పత్తి ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. KGFలో మైనింగ్ పనులు ప్రస్తుతం ఆగిపోయినప్పటికీ కర్ణాటకలోని హుట్టి గోల్డ్ మైన్స్ ఇప్పటికీ ఒక ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా ఉంది. ఈ గని కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉండగా దేశంలోని మొత్తం బంగారం ఉత్పత్తిలో 80% కంటే ఎక్కువ ఈ ప్రాంతం నుండే వస్తుంది.
బంగారం ఉత్పత్తి చేసే ఇతర రాష్ట్రాలు: భారతదేశంలో బంగారం ఉత్పత్తిలో కర్ణాటకతో పాటు జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ జిల్లాలో బంగారు ఖనిజ నిక్షేపాలు కనిపిస్తాయి, ఆంధ్రప్రదేశ్‌లోని రామగిరి ప్రాంతంలో బంగారం ఉత్పత్తి అవుతుంది. దీనితో పాటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా తవ్వకాల ద్వారా పరిమిత స్థాయిలో బంగారం ఉత్పత్తి అవుతుంది.
బంగారం వినియోగం ఇంకా దిగుమతి: ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారి అయిన భారతదేశం ప్రతి సంవత్సరం 700-900 టన్నుల బంగారంని వినియోగిస్తుంది. స్థానిక ఉత్పత్తి పరిమితంగా ఉండటం వల్ల భారతదేశ బంగారం డిమాండ్‌లో ఎక్కువ భాగాన్ని దిగుమతుల ద్వారా తీర్చుకోవాల్సి వస్తుంది. ఈ కారణంగా భారతదేశ వాణిజ్య లోటు కూడా ప్రభావితమవుతుంది.
ప్రభుత్వ ప్రయత్నాలు, భవిష్యత్తు అవకాశాలు: భారత ప్రభుత్వం కొత్త మైనింగ్ ప్రాంతాలను అన్వేషించడానికి ఇంకా దేశీయ బంగారం ఉత్పత్తిని పెంచడానికి పెట్టుబడులను ప్రోత్సహించే ప్రయత్నాలు చేస్తోంది. కాగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనల ద్వారా ప్రస్తుత గనులలో ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications