ఇంట్లో ఉన్న బంగారంపై ట్యాక్స్ ఉంటుందా? పెళ్లయిన స్త్రీ ఇంట్లో ఎంత బంగారం పెట్టుకోవచ్చు?
బంగారం పై మహిళలకు ఉన్న మక్కువ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండియాలో బంగారానికి ఉన్న ప్రాముఖ్యత అలాంటిది. ఎలాంటి శుభకార్యనీకైన కనీసం 1గ్రాము బంగారం కొనేందుకు కూడా వెనకాడరు. భారతదేశం అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశాలలో ఒకటి. పెళ్లిళ్లు, ఇంటి శుభకార్యాలు, పండుగలు ఇలా అన్నిటికి బంగారం అవసరం. కొంత మంది బంగారాన్ని పెట్టుబడిగా కూడా కొంటుంటారు. బంగారంపై ఈ క్రేజ్ చాలా కాలంగా కొనసాగుతుంది. అయితే ఇంట్లో ఎంత బంగారం ఉండాలనే దానిపై కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. బంగారం కొనడం ఇంకా ఇంట్లో ఉంచుకోవడంపై ప్రభుత్వం నియమాలను ఏర్పాటు చేసింది. ఈ నిబంధనల ప్రకారం ఒక వివాహిత మహిళ 500 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చు.
ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చు అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ప్రకారం.. నిర్ణయించిన మొత్తంలో మాత్రమే బంగారాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు. అలాగే, మీ దగ్గర ఎంత బంగారం ఉన్నా అది ఎలా వచ్చిందనేదానికి మీ దగ్గర ఫ్రూప్స్ ఉండాలి. మహిళలు ఎంత బంగారం ఉంచుకోవచ్చు అంటే పెళ్లయిన ఒక మహిళలు 500 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చని ఆదాయపు పన్ను చట్టం పేర్కొంది. అవివాహిత మహిళ 250 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చు. అదే విధంగా కుటుంబంలోని పురుషులు 100 గ్రాముల బంగారాన్ని మాత్రమే ఉంచుకోవచ్చు. వారసత్వ బంగారంపై పన్ను విధిస్తారా అనేదానికి మినహాయింపు పొందిన వృత్తి ద్వారా వచ్చే ఆదాయం..అంటే వ్యవసాయం మొదలైనవి తీసుకోవచ్చు. అలాంటి వాటి నుంచి లేదా చట్టబద్ధమైన వారసత్వం ద్వారా బంగారం కొంటె పన్ను ఉండదు.

అయితే బంగారంపై ట్యాక్స్ లేదు కానీ బంగారం అమ్మకందారులు దానిపై పన్ను చెల్లించాలి. బంగారం కొన్న 3 సంవత్సరాల తర్వాత విక్రయిస్తే దానిపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (LTCG) విధించబడుతుంది. గోల్డ్ బాండ్ల అమ్మకంపై ఎంత పన్ను అంటే గోల్డ్ బాండ్‌ను కొన్న 3 సంవత్సరాలలోపు విక్రయిస్తే అది విక్రేత ఆదాయంలో చేర్చబడుతుంది ఇంకా పన్ను నిబంధనల ప్రకారం పన్ను విధిస్తారు. అంటే, మెచ్యూరిటీ వరకు గోల్డ్ బాండ్ ఉంచి విక్రయిస్తే పన్ను ఉండదు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) భారతదేశంలో వివాహిత లేదా అవివాహిత పురుషులు 100 గ్రాములు బంగారు ఆభరణాలు ధరించవచ్చు అంటే 1kg బంగారం. ఈ రోజుల్లో పురుషులు అధిక విలువ చేసే బంగారు ఆభరణాలు వేసుకోవడం ఫ్యాషన్ గా కూడా మారింది.


Click it and Unblock the Notifications