Gold Price Today: పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..!
భారతీయ మహిళలు ఎక్కువగా బంగారాన్ని ఇష్టపడతారు. అందుకే ఇండియాలో పుత్తడికి డిమాండ్ ఉంటుంది. అయితే ఈ బంగారం ధరలు మారుతుంటాయి. తాజాగా బంగారం ధర కాస్త పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు అంటే శుక్రవారం 10 గ్రాములకు 554 రూపాయలు పెరిగింది. ఫిబ్రవరి 02న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.63 వేలు దాటింది. వెండి కిలో ధర రూ.71 వేలకు పైగా పెరిగింది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63153గా ఉండగా.. వెండి ధర కిలోకు రూ.71777గా ఉంది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకారం గురువారం సాయంత్రం, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు రూ. 62,599గా ఉండేది. అది ఈ రోజు ఉదయం రూ. 63,153 కు పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,848గా ఉంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.47365 గాఉంది. అదే సమయంలో 14 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.36945గా ఉంది.'

హైదరాబాద్ లో పది గ్రాముల పుత్తడి ధర రూ.64,980గా ఉంది. కిలో వెండి ధర రూ.73,778గా ఉంది. వైజాగ్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.64,980గా ఉంది. కిలో వెండి ధర రూ.73,778గా ఉంది. MCXలో బంగారం ధర రూ.63600 దగ్గరలో ఉంది. విదేశీ మార్కెట్లలో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు కూడా పెరిగాయి. ఈ బంగారం మరియు వెండి ధరలను ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) జారీ చేస్తోంది.. IBJA రేట్ల ప్రకారం, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బంగారం, వెండి సగటు ధరలు పెరిగాయి.


Click it and Unblock the Notifications