బంగారంపై గోల్డ్ లోన్ కావాలా.. ఎక్కువ డబ్బులు కావాలంటే ఈ విషయం తెలుసుకోండి..
మీరు కొన్నిఅత్యవసర సమయాలలో లేదా ఆర్ధిక పరిస్థితుల్లో డబ్బు కావలసినపుడు లేదా సరిపడా డబ్బులు చేతిలో లేనప్పుడు గోల్డ్ లోన్ చాలా బెస్ట్ అప్షన్గ పరిగణిస్తాం. లోన్ తీసుకునే ముందు గమనించవలసిన విషయం ఏంటంటే గోల్డ్ లోన్ ఎక్కువగా బంగారం స్వచ్ఛతపై ఆధారపడి ఉంటుంది. స్వచ్ఛత ఎక్కువ ఉంటే మీరు లోన్ మొత్తం ఎక్కువ ఉంటుంది అలాగే స్వచ్ఛత తక్కువగా ఉంటే లోన్ మొత్తం కూడా తగ్గుతుంది.
బంగారం స్వచ్ఛత
బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. అందుకే మీరు బంగారం పై నంబర్ పక్కన K అని ఉంటుంది. మార్కెట్లో 24K బంగారం స్వచ్ఛమైనది, ఇందులో 99.9% బంగారం ఉంటుంది. బంగారం స్వచ్ఛత ఎక్కువగా ఉంటె దానితో తయారు చేసిన బంగారు ఆభరణాలు చాల సున్నితంగా ఉంటాయి. అందుకే దృఢత్వాన్ని, మన్నిక పెంచడానికి బంగారంతో ఇతర లోహాలు కలుపుతారు.

24 క్యారెట్ (24K): 99.9% స్వచ్ఛమైన బంగారం, కాబట్టి అరుదుగా ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు.
22 క్యారెట్ (22K): 91.6% స్వచ్ఛమైన బంగారం, అధిక నాణ్యత గల ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు.
18 క్యారెట్ (18K): 75% స్వచ్ఛమైన బంగారం, క్లిష్టమైన డిజైన్‌లతో కూడిన ఆభరణాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
14 క్యారెట్ (14K): 58.3% స్వచ్ఛమైన బంగారం, తక్కువ ఖరీదైన ఆభరణాలలో ఉపయోగిస్తారు.
గోల్డ్ లోన్ vs బంగారం స్వచ్ఛత
బంగారం స్వచ్ఛత అంటే బంగారం క్యారెట్ ఎంత ఎక్కువైతే దాని మార్కెట్ విలువ అంత ఎక్కువగా ఉంటుంది. ప్రతి గ్రామును బట్టి లోన్ మొత్తం ఉంటుంది. అంటే ఎక్కువ స్వచ్ఛత ఉంటే ఎక్కువ ధర పలుకుతుంది. 24K బంగారం స్వచ్ఛమైనది కాబట్టి, మార్కెట్‌లో గ్రాము ధర అత్యధికంగా ఉంటుంది. ఈ కారణంగా 24K బంగారంపై గోల్డ్ లోన్‌లో గ్రాముకు అత్యధికంగా డబ్బు లభిస్తుంది. 22K బంగారం స్వచ్ఛత కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి 24K బంగారం కంటే కొంచెం తక్కువ మొత్తం లోన్ పొందుతారు. ఇక 18K అండ్ 14K బంగారానికి ఇదే ఫార్ములా వర్తిస్తుంది.
బెస్ట్ గోల్డ్ లోన్ పొందడానికి మీరు ఈ ట్రిక్స్ పాటిస్తే చాలు. ICICI డైరెక్ట్ ప్రకారం, మీ గోల్డ్ లోన్ మొత్తాన్ని ఎక్కువగా పెంచుకోవడానికి, వీలైతే ఎక్కువ నాణ్యతగల బంగారం (22K లేదా 24K) తాకట్టు పెట్టండి. గోల్డ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఉపయోగించే లోన్ ప్రాసెస్ ఇంకా మీ బంగారం వాల్యూ అది ఎలా తగ్గిస్తుంది తెలుసుకోండి. వివిధ బ్యాంకులు ఇచ్చే గోల్డ్ లోన్ అంటే 1 గ్రాముకు ఇచ్చే వాల్యూ పోల్చి చూసి బెస్ట్ గోల్డ్ లోన్ తీసుకోవడం మీకు చాల సహాయపడుతుంది.


Click it and Unblock the Notifications