పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటేస్ట్ చిత్రం OG. They Calling him OG ఉప శీర్షిక. ప్రమఖ నిర్మాత డీవీవీ దానయ్య తన సొంత బ్యానర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై భారీగా నిర్మించారు. ఈ సినిమాకు సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.
ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ నిర్వర్తించారు. ఈ సినిమా థమన్ ఎస్ అందించిన మ్యూజిక్ హైలెట్‌గా మారింది. యాక్షన్, థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజై రికార్డు స్థాయి వసూళ్లను సాధించి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొన్నది. ఈ నేపథ్యంలో దర్శకుడు సుజిత్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అరుదైన బహుమతిని అందించారు. ఆ బహుమతి వివరాల్లోకి వెళితే..

OG సినిమాను హై రేంజ్ బడ్జెట్ అంటే.. సుమారుగా 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ సుమారుగా 155 కోట్లకుపైగా జరిగింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 160 కోట్ల రూపాయలకుపైగా జరిగింది. దాంతో ఈ చిత్రం 165 కోట్ల షేర్.. 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
పవన్ కల్యాణ్ నటించిన ఈ చిత్రం తెలుగులో 198 కోట్ల నెట్ కలెక్షన్లు, కన్నడలో 20 కోట్ల రూపాయలు, తమిళనాడులో 4 కోట్ల రూపాయలు, కేరళలో 50 లక్షల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఈ చిత్రం 228 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది.
ఓజీ చిత్రం వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 191.5 కోట్ల నెట్, 228.4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 65.25 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 293.65 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని బాక్సాఫీస్ ట్రాకర్ సాక్ నిక్ వెల్లడించింది.
అయితే ఇంతటి ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు సుజిత్‌కు అరుదైన బహుమతి లభించింది. ఆయనకు విలాసవంతమైన, ఖరీదైన కారు ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను పవన్ కల్యాణ్ చేతుల మీదుగా అందించారు. పవర్ స్టార్ స్వయంగా ఈ కారును సుజిత్ అందించడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ విషయాన్ని సుజిత్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. నా జీవితంలో బెస్ట్ గిఫ్ట్ ఇది. ఈ బహుమతి అందుకోవడం ద్వారా ఆనందంలో మునిగిపోయాను. మాటలు రావడం లేదు. ఇలాంటి ప్రోత్సాహం నా ఓజీ కల్యాణ్ గారి నుంచి రావడం నా లైఫ్‌లో గొప్ప విషయం. చిన్నతనం నుంచి నేను ఆయనకు అభిమానిని. ఆయన రుణాన్ని నేను ఎప్పటికి మరిచిపోలేను అని సుజిత్ ఎమోషనల్ అయ్యారు.
ఇక ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధర విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో బేస్ మోడల్ డిజిల్/పెట్రోల్ వేరియెంట్ ఖరీదు 1.24 కోట్లు, మిడ్ రేంజ్ సుమారుగా 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు అని తెలిపారు. ఇక టాప్ ఎండ్ విషయానికి వస్తే.. ఈ వాహనం (Octa Edition) వెల సుమారుగా 3 కోట్ల రూపాయలు ఉంటుంది అని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications