తాగి డ్రైవ్ చెయ్యొచ్చా ? పోలీస్ చట్టం కింద ఈ రూల్ గుర్తుంచుకోండి లేదంటే అంతే..
తాగి వాహనం నడపడం వాళ్ళ ఎన్ని అనర్ధాలు, ప్రమాదాలు జరుగుతున్నాయో మనం రోజు వార్తల్లో, పేపర్లలో చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఎన్ని చెర్యలు చేపట్టిన, అవగాహన కల్పించిన కూడా కొందరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పోలీసులకు పట్టుబడుతుంటారు. అయితే తాగి వాహనం నడపడం నేరం అని తెలిసిన కూడా కొందరు చట్టాలను పాటించకుండా డ్రైవ్ చేస్తుంటారు. మద్యం సేవించి వాహనాలు నడపడానికి చట్టం అనుమతించదని మీకు తెలిసే ఉంటుంది. అయితే బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ (BAC) లిమిట్ ఎంత ? ఎంత మొత్తం తాగి డ్రైవింగ్ చేయవచ్చు, మీరు మద్యం మత్తులో ప్రమాదానికి గురైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందా ? తాగి కారు లేదా బైక్ నడుపుతున్నప్పుడు వచ్చే కొన్ని ఆలోచనలు ఇవే. భారతదేశంలో తాగి డ్రైవింగ్ చేయడంపై చట్టం ఎం చెబుతుంది, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా...
ప్రైవేట్ వాహన డ్రైవర్లకు BAC పరిమితి
భారతదేశంలో ప్రైవేట్ వాహన డ్రైవర్లకు చట్టపరమైన BAC పరిమితి 0.03% (100 ml రక్తానికి 30 mg ఆల్కహాల్). వాణిజ్య వాహనాల డ్రైవర్లకు ఈ పరిమితి సున్నా, అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు వారి రక్తంలో ఆల్కహాల్ ఉండకూడదు. మీ BAC (బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్) చట్టపరమైన పరిమితిలో ఉంటే, మీరు టెక్నికల్ గా చట్టం దృష్టిలో DUI (driving under the influence)గా పరిగణించరు. అయితే, మోటారు ఇన్సూరెన్స్ పాలసీల విషయానికి వస్తే భారతదేశంలోని చాలా పాలసీలు అన్ని లేదా థర్డ్ పార్టీ సాధారణంగా "డ్రైవింగ్ అండర్ ది ఇన్‌ఫ్లుయెన్స్" నిబంధనతో ఉంటాయి.

దీనర్థం మీరు చట్టబద్ధమైన BAC పరిమితిలో ఉన్నప్పటికీ ప్రమాదానికి మద్యం కారణమని తేలితే ఇన్సూరెన్స్ కంపెనీ మీ క్లెయిమ్ కొట్టేస్తుంది. ఎందుకంటే మీరు చట్టపరమైన పరిమితిలో ఉన్నప్పటికీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మద్యం తాగడం వల్ల సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోలేరు, రెస్పాన్స్ టైం ఇంకా నిర్ణయం తీసుకునే సామర్ధ్యం పై తీవ్ర ప్రభావితం ఉంటుంది. దీని వల్ల ప్రాణానికే నష్టం వాటిల్లుతుంది.
మోటారు వాహన చట్టం 1988
1988 నాటి మోటారు వాహన చట్టంలో మద్యం లేదా డ్రగ్స్ తాగి వాహనం నడిపితే శిక్ష విధించే నిబంధన ఉంది. తాగి పట్టుబడితే జరిమానా, మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు ఇంకా తీవ్రమైన ప్రమాదాల కేసుల్లో పోలీసులు దర్యాప్తు చేసి జైలు కూడా విధించే అవకాశం ఉంది, మరోవైపు ప్రమాదానికి మద్యం కారణమా కాదా అని ఖచ్చితం చేయడనికి బీమా కంపెనీలు తరచూ పోలీసు రిపోర్ట్స్, సాక్ష్యాలను సమీక్షిస్తాయి.
warning:మద్యం త్రాగడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్య నేరం కూడా.


Click it and Unblock the Notifications