Vijayawada real estate News: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఆనుకుని కృష్ణా నది ఒడ్డున కాలర్ ఎగరేస్తూ ఉన్న నగరం విజయవాడ. ఎవరు వెళ్లినా అక్కున చేర్చుకునే నగరం. ఇప్పుడు టీ2 నగరంగా ఎదుగుతోంది. రాజధాని ప్రాంతం కావడంతో అందరూ విజయవాడ వైపే చూస్తున్నారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు ప్రధాన ప్రదేశంగా విజయవాడను ఎంచుకుంటున్నారు. మరి విజయవాడ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది. అక్కడ భూములు కొంటే ముందు ముందు లాభాలు వస్తాయా.. లేక నష్టాల్లో కూరుకుపోవాలా..ఈ కథనంలో చూద్దాం.
ఇప్పుడు విజయవాడ నగరం రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాల అభివృద్ధితో విజయవాడ నగరం దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతోంది. అయితే గత ప్రభుత్వం విజయవాడను విస్మరించడంతో అక్కడ భూములు ధరలు భారీగా పడిపోయాయి. ఈ సారి వచ్చిన ప్రభుత్వం అమరావతి కేంద్రంగా పనిచేస్తుండటంతో అక్కడి భూములకు రొక్కలొచ్చాయి. అయితే పెట్టుబడిదారుల్లో మాత్రం రాజకీయ పరంగా కాసింత ఆందోళన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మళ్లీ ప్రభుత్వం మారితే విజయవాడ భూములు ధరలు తగ్గిపోతాయనే భయంతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో విజయవాడ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం మిశ్రమంగా ఉందని రియాల్టీ వ్యాపారులు చెబుతున్నారు. కొందరు ఏజెంట్లు నగరంలో భూమి అమ్మకానికి మంచి సమయం కాదని.సిటీలో అభివృద్ధి మందగించిందని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం భూములు అమ్ముకోవచ్చని అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో చాలా మంది ఏజెంట్లు విజయవాడ నగరంలో ప్లాట్లు, ఇళ్ళు అమ్మడానికి అందుబాటులో ఉన్నాయని, కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కూడా ఉందని సూచిస్తున్నారు.

చాలా మంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో అభివృద్ధి మందగించిందని కాబట్టి ఈ సమయంలో భూములు అమ్మకం మంచిది కాదని ఓ నెటిజన్ Redditలో పోస్ట్ చేశారు. మరొక నెటిజన్ అమ్మడం ఎప్పుడైనా చేసుకోవచ్చని బ్రోకర్ల సహాయంతో అమ్మకాలు వేగవంతం చేయవచ్చని పోస్ట్ చేశారు.
ప్రధానంగా చూసుకున్నట్లయితే.. విజయవాడలో కొన్ని ప్రాంతాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా కృష్ణలంక, పోరంకి, ఎనికపాడు వంటి ప్రాంతాలలో కొత్త లేఅవుట్లు, ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి.
అయితే మీరు విజయవాడలో ఎక్కడ భూమి కొనాలనుకుంటున్నారో ముందుగా తెలుసుకోవడం ముఖ్యం. కొన్ని ప్రాంతాలలో అభివృద్ధి ఎక్కువగా ఉండవచ్చు, మరికొన్నింటిలో తక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. నగరంలో మీ బడ్జెట్ కు తగినట్లుగా ప్లాట్లు, ఇళ్ళు అందుబాటులో ఉన్నాయో లేదో చెక్ చేయాలి.
ఇక విజయవాడ నగరంలో IT, ఆటోమొబైల్, వాణిజ్య విస్తరణ నడవుతుండడంతో భూమి, రెసిడెన్షియల్, కమర్షియల్ డిమాండ్ ఏర్పడుతోంది. మేట్రో, హైవే విస్తరణ వంటి మౌలిక సదుపాయాలతో భవిష్యత్తులో భూమి విలువలకు రెక్కలు రావొచ్చు. ప్రభుత్వ ప్రోత్సాహక చర్యలు, పర్యావరణ ప్రాజెక్ట్స్, పునరుద్ధరణ ప్రణాళికలు రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు తెస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే.. రాష్ట్ర ప్రభుత్వం 8,500 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్లు తిరిగి వేయడానికి రెడీ అవుతోంది.
ఇక ఎపీఐఐసీ ద్వారా లూజు గ్రూపుకు 4.15 ఎకరాలు బహుముఖ వాణిజ్య అభివృద్ధి కోసం కేటాయించారు. తద్వారా విజయవాడ పాత బస్‌స్టాండ్ దగ్గర మొత్తం రూ.156 కోట్ల అంచనాతో 2.3 లక్ష స్క్వేర్ ఫీట్ మాల్ నిర్మాణం జరగనుంది. ఇది నగరానికి కొత్త ఊపిరి అందించనుంది. రిటైల్, ఇంటర్టైన్‌మెంట్, ఆఫీస్‌లకు కొత్త అవకాశాలు కల్పించనుంది.
విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ కు చివరి దశలో అడుగులు పడుతున్నాయి. ఏపీఎంఆర్‌సీ ఆధ్వర్యంలో జూలై 2025లో మొదటి ప్యాకేజ్ బిడ్స్‌కు ఆహ్వానించారు. ఇందులో డబుల్-డెక్కర్ ఫ్లైవోవర్-కమ్-మెట్రో వియడక్ట్‌తో పాటు 32 ఎలివేటెడ్ స్టేషన్ల నిర్మాణం ఉంటుంది. ఇక హైదరాబాద్-విజయవాడ హైవేని 6-లేన్‌గా విస్తరించే పనులు త్వరలో చేపడతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రతిపాదిస్తున్నాయి. ఇవన్నీ కూడా భవిష్యత్ లో విజయవాడ భూమి ధరల పెరుగుదలకు సహకరించనున్నాయి.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

Amaravati: అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు! ఖాతాలో పడ్డ రూ. 2,800 కోట్లు.. నెక్స్ట్ ప్లాన్ ఇదే!

ప్రాప్‌షేర్ సెలెస్టియా REIT ఐపీఓ: నేడే చివరి అవకాశం!

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

హైదరాబాద్ నీటి కష్టాలు: ఐటీ కారిడార్‌లో అద్దెలు ఆకాశానికి!

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్‌లో పెరిగిన డిమాండ్!

క్వాంటం కంప్యూటర్ అంటే ఏమిటి.. దాని వల్ల లాభాలు, వచ్చే నష్టాలు ఏమిటి.. పూర్తి సమాచారం ఇదిగో..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications