పాన్ కార్డ్ నంబర్ సీక్రెట్ తెలుసా.. ఒక్కో అక్షరం వెనుక ఇంత అర్ధం ఉంటుందా..
మనకు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్లలో పాన్ కార్డ్ ఒకటి. ఏదైనా మని ట్రాన్సక్షన్స్ కోసం పాన్ కార్డును ఎక్కువగా వాడుతుంటారు. మీరు మీ పాన్ కార్డ్‌పై 10 అంకెల నంబర్ చూసే ఉంటారు. ఇందులో మీ అన్ని రకాల సమాచారం ఉంటుంది. ఈ నంబర్లలోని సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖ ట్రాక్ చేస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇన్కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ప్రతి ఒక్కరికీ పాన్ కార్డును జారీ చేస్తుంది. అయితే, పాన్ కార్డుపై రాసి ఉన్న నంబర్లను అర్థం చేసుకునేవారు లేదా గుర్తించే వారు చాలా తక్కువ. పాన్ కార్డ్‌పై ఉన్న ఆల్ఫాన్యూమరిక్ నంబర్ అర్ధం ఏంటో తెలుసా...
కార్డ్ హోల్డర్ పేరు, పుట్టిన తేదీ పాన్ కార్డ్‌పై ప్రింట్ చేసి ఉంటుంది. కానీ పాన్ కార్డ్ నంబర్‌లో మీ ఇంటి పేరు కూడా ఉంటుంది. పాన్ కార్డులోని ఐదవ అక్షరం మీ ఇంటి పేరును సూచిస్తుంది. ఆదాయపు పన్ను శాఖ డేటాలో కార్డు హోల్డర్ ఇంటి పేరును మాత్రమే రిజిస్టర్ చేస్తుంది. అందుకే ఈ నంబర్‌లో మీ సమాచారం ఉంటుంది. పన్ను శాఖ ఈ సమాచారాన్ని కార్డు హోల్డరుకి వెల్లడించదు.

10 అంకెల ప్రత్యేక నంబర్
PAN కార్డ్ నంబర్ అనేది ఒక ప్రత్యేకమైన 10 అంకెల నంబర్, ఇది లామినేటెడ్ కార్డ్ రూపంలో వస్తుంది. పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికీ ఆదాయపు పన్ను శాఖ దీన్ని జారీ చేస్తుంది. పాన్ కార్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఒక వ్యక్తి అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సక్షన్స్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పాన్ కార్డ్‌తో లింక్ చేస్తుంది. ఇందులో పన్నుల చెల్లింపు, క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక లావాదేవీలు అన్నీ ఆ శాఖ పర్యవేక్షణలోనే ఉంటాయి. పాన్ నుంబర్ మొదటి మూడు అంకెలు ఇంగ్లీష్ అక్షరాలు ఇవి AAA నుండి ZZZ వరకు ఏదైనా కావచ్చు. ప్రస్తుతం నడుస్తున్న సిరీస్‌ల ప్రకారం డిపార్ట్‌మెంట్ నిర్ణయిస్తుంది. పాన్ నంబర్‌లోని నాలుగో అక్షరం కూడా కార్డుదారుని స్టేటస్ తెలియజేస్తుంది.
ఇందులో నాల్గవ అంకె కింది వాటిలో ఏదైనా కావచ్చు. పి - సింగిల్ పర్సన్, ఎఫ్ - ఫర్మ్, సి - కంపెనీ, ఎ - అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, టి - ట్రస్ట్, హెచ్ - హిందూ అవిభాజ్య కుటుంబం, ఎల్ - లోకల్, జె - ఆర్టిఫిషియల్ జ్యుడీషియల్ పర్సన్, జి - ప్రభుత్వం కోసం. పాన్ కార్డులోని ఐదవ అంకె ఆంగ్ల అక్షరం. ఇది మీ ఇంటిపేరులోని మొదటి అక్షరం. దీని తర్వాత పాన్ కార్డులో నాలుగు నంబర్లు ఉంటాయి. ఇది 0001 నుండి 9999 వరకు ఏదైనా కావచ్చు.
PAN నంబర్‌ని మార్చలేరు
మీ పాన్ కార్డ్ నంబర్‌లు ఒక సిరీస్‌ను చూపుతాయి. దీని చివరి అక్షరం ఏదైనా అక్షరం కావచ్చు. ఇదిలా ఉంటే ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ అవసరం. మీరు మీ అడ్రస్ మార్చినప్పటికీ పాన్ కార్డ్ నంబర్ మాత్రం మారదు. మీరు పాన్ కార్డును గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగించవచ్చు.


Click it and Unblock the Notifications