Inflation: ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ద్రవ్యోల్బణం పెను ప్రభావం.. ఇప్పుడు కోటి విలువ భవిష్యత్తులో ఎంతంటే..
Future value of 1 crore: కాలం మారుతున్న కొద్దీ ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతోంది. తద్వారా డబ్బు విలువ పడిపోతుంది. అంటే ఈరోజు 100 రూపాయలతో కొనుగోలు చేస్తున్న ఓ ఉత్పత్తి భవిష్యత్తులో అదే ధరకు లభించదు. ఏటా పెరిగే ద్రవ్యోల్బణం ఆ విలువను నిర్ధారిస్తుంది. అందుకే ప్రస్తుతం రిటైర్మెంట్ కార్పస్ కింద కోటి రూపాయలు సమంజసమని భావిస్తే, రాబోయే 20 నుంచి 30 ఏళ్లలో దాని విలువ కోటి కాదని గుర్తించాలి. కాబట్టి అప్రమత్తంగా వ్యవహరిస్తూ భవిష్యత్తు కోసం సేవ్ చేయాల్సిన అవసరాన్ని గమనించాలి.
ఏటా నమోదవుతున్న ద్రవ్యోల్బణం ఆధారంగా రిటైర్మెంట్ మరియు సేవింగ్స్ ప్లాన్ ను రూపొందించుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం మంచి పెట్టుబడిలతో కూడిన పోర్ట్‌ఫోలియోను తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సలహా ఇస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం భారత గరిష్ఠ టాలరేటెడ్ ద్రవ్యోల్బణ రేటు 6 శాతంగా ఉంది. కాబట్టి అంతకంటే ఎక్కువ రిటర్న్ వచ్చేలా పెట్టుబడులను ప్లాన్ చేయమని సూచిస్తున్నారు.

ప్రస్తుతం 10 లక్షలకు కొనగలిగే కారు మరో 10 ఏళ్ల తర్వాత అదే మొత్తానికి రాదు. ఏటా 6 శాతం ద్రవ్యోల్బణం పెరుగుదల చొప్పున లెక్కేస్తే ప్రస్తుత కోటి పదేళ్ల తర్వాత కేవలం 55 లక్షలు మాత్రమే అవుతుంది. ఇక 20 ఏళ్ల తర్వాత 31 లక్షలు, 30 ఏళ్లకు 17 లక్షలకు ఆ కోటి విలువ పడిపోతుంది. ఈ తరహా గణాంకాలను పరిశీలిస్తూ రిస్క్ తక్కువతో పాటు రిటర్న్స్ ఎక్కువ ఉండే విధంగా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయాలని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రస్తుత కాలంలోని యువత సంపాదిస్తున్న మొత్తాన్ని జల్సాలకు, అనవసర ఖర్చులకు తగలేస్తూ ఉండటంపై ఫైన్సియల్ అడ్వైజర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇల్లు, కారు వంటి అధిక కాలం పాటు కొనసాగే లోన్స్ జోలికి వెళ్లవద్దని చెబుతున్నారు. అద్దె ధరలు ఎక్కువగా ఉండే చోట్ల పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. యుక్త వయసులో సంపాదనను తెలివిగా ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా వృద్ధాప్యంలో మెరుగైన జీవితం ఆస్వాదించవచ్చని గుర్తుచేస్తున్నారు.


Click it and Unblock the Notifications