మన దేశంలో సామాన్యుడికి అత్యంత చేరువలో ఉన్న రవాణా సౌకర్యం ఏదంటే అది కచ్చితంగా రైల్వేస్ (indian railways) మాత్రమే. లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే రైల్వే శాఖ.. రాబోయే 2026 నాటికి తన రూపురేఖలను పూర్తిగా మార్చుకోబోతోంది. ఇప్పటివరకు మనం చూసిన రైల్వే స్టేషన్లు, ఎక్కిన రైళ్లు ఒక ఎత్తైతే.. 2026లో మనం చూడబోయే హంగులు మరో ఎత్తు.
మరి 2026లో ఇండియన్ రైల్వేస్ (indian railways) లో రాబోతున్న ఆ ఆసక్తికరమైన మార్పులేంటో ఓసారి చూద్దామా!
1. నిద్రపోతూ ప్రయాణం.. వందే భారత్ స్లీపర్ వచ్చేస్తోంది!
వందే భారత్ రైళ్లు అనగానే మనకు గుర్తొచ్చేది వేగం, లగ్జరీ. కానీ ప్రస్తుతం ఇవి కేవలం పగటిపూట కూర్చుని వెళ్లేందుకే (Chair Car) వీలుగా ఉన్నాయి. అయితే 2026 నాటికి వందే భారత్ స్లీపర్ ట్రైన్లు పట్టాలెక్కనున్నాయి. రాత్రిపూట హాయిగా పడుకుని ప్రయాణిస్తూ.. రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే వేగంగా గమ్యాన్ని చేరుకోవచ్చు. ముఖ్యంగా పట్నా-ఢిల్లీ వంటి రూట్లలో వీటిని ముందుగా ప్రారంభించే అవకాశం ఉంది.
2. బుల్లెట్ రైలు కల సాకారం దిశగా..
దేశంలో బుల్లెట్ రైలు ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. 2026లో గుజరాత్‌లోని సూరత్ నుంచి బిలిమోరా మధ్య బుల్లెట్ ట్రైన్ ట్రయల్ రన్స్ (Trial Runs) ప్రారంభం కాబోతున్నాయి. అంటే 300 కిలోమీటర్ల పైచిలుకు వేగంతో దూసుకెళ్లే జపనీస్ టెక్నాలజీ రైలును మన కళ్లముందే చూడబోతున్నామన్నమాట.

3. విమానాశ్రయాల్లా మారనున్న రైల్వే స్టేషన్లు
'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్' కింద దేశవ్యాప్తంగా సుమారు 1300 స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. 2026 నాటికి వీటిలో మెజారిటీ స్టేషన్లు సరికొత్త లుక్‌తో మెరిసిపోనున్నాయి. లిఫ్టులు, ఎస్కలేటర్లు, అత్యాధునిక వెయిటింగ్ రూమ్స్, రూఫ్ ప్లాజాలతో రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలను తలపిస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన స్టేషన్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి.
4. రద్దు ఛార్జీలు లేవు.. ప్రయాణ తేదీ మార్చుకోవచ్చు!
ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వేస్ (indian railways) తీసుకురాబోతున్న అతిపెద్ద ఊరట ఇది. ప్రస్తుతం ఒకసారి టికెట్ బుక్ చేసుకున్నాక తేదీ మార్చాలంటే క్యాన్సిల్ చేసి మళ్ళీ బుక్ చేసుకోవాలి. దీనివల్ల ఛార్జీలు కట్ అవుతాయి. కానీ 2026 జనవరి నుంచి, కన్ఫర్మ్ అయిన టికెట్ తేదీని ఆన్‌లైన్‌లోనే ఎటువంటి ఎక్స్‌ట్రా ఛార్జీలు లేకుండా మార్చుకునే వెసులుబాటు రాబోతోంది. సీట్ల లభ్యతను బట్టి ఈ మార్పు చేసుకోవచ్చు.
5. ప్రమాదాలకు చెక్.. 'కవచ్' వ్యవస్థ!
ప్రయాణికుల భద్రత విషయంలో మన రైల్వేస్ రాజీ పడటం లేదు. రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా బ్రేకులు వేసే 'కవచ్' (Kavach) టెక్నాలజీని 2026 నాటికి ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా వంటి బిజీ రూట్లలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనివల్ల రైలు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి.
ఇకపోతే వీటితో పాటు 2026లో పర్యావరణ హితమైన హైడ్రోజన్ ట్రైన్లు కూడా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ మార్పులన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో రైలు ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారబోతోందని అర్థమవుతోంది. ఇంకా మన రైల్వేస్ ఇంకెన్ని మార్పులు చేయబోతోందో చూడాలి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications