ఒకప్పుడు మనం వాడుతున్న మొబైల్ ఫోన్ల వెనుక 'మేడ్ ఇన్ చైనా' లేదా 'మేడ్ ఇన్ వియత్నాం' అని కనిపించేది. కానీ, ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం మీరు వాడుతున్న స్మార్ట్‌ఫోన్ వెనుక మేక్ ఇన్ ఇండియా (make in india) అని గర్వంగా కనిపిస్తోంది. కేవలం పదేళ్ల కాలంలోనే భారత్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఊహించని విప్లవాన్ని సృష్టించింది. ఇదెలా సాధ్యమైంది? ఇప్పుడు తెలుసుకుందాం!
తాజాగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా భారత్ అవతరించింది. మొబైల్ విడిభాగాల తయారీలో కూడా మన దేశం టాప్ లో ఉంది. అలాగే సెమీ కండక్టర్ చిప్స్ తయారీలో ప్రపంచ స్థాయిలో ఎదిగేందుకు వేగంగా అడుగులు వేస్తుంది. ఎలక్ట్రానిక్స్ తయారీ విషయంలో గత 11 ఏళ్లలో దేశీయంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి ఏకంగా 6 రెట్లు పెరగడం విశేషం.

పీఎల్ఐ స్కీమ్ (PLI Scheme) ప్రభావం..
భారత్ ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం ప్రవేశపెట్టిన PLI స్కీ్మ్. (Production Linked Incentive).
- ఈ పథకం కింద కంపెనీలు ఎంత ఎక్కువ ఉత్పత్తి చేస్తే, ప్రభుత్వం అంత ఎక్కువ ప్రోత్సాహకాలను అందిస్తుంది.
- దీనివల్ల ఇప్పటివరకు సుమారు రూ.13,475 కోట్ల పెట్టుబడులు దేశంలోకి వచ్చాయి.
- ఫలితంగా సుమారు రూ.9.8 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ వస్తువులు మన దేశంలోనే తయారయ్యాయి.
లక్షలాది ఉద్యోగాల కల్పన
కేవలం ఫ్యాక్టరీలు రావడం మాత్రమే కాదు.. ఈ రంగం నిరుద్యోగులకు కల్పవృక్షంగా మారింది. గత దశాబ్ద కాలంలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ద్వారా దేశవ్యాప్తంగా 25 లక్షల ఉద్యోగాలు లభించాయి. కేవలం గత ఐదేళ్లలోనే 1.3 లక్షల మందికి కొత్తగా ఉపాధి దొరికిందంటే ఈ రంగం ఎంత వేగంగా దూసుకుపోతుందో అర్థం చేసుకోవచ్చు.
విడిభాగాల తయారీలోనూ మనమే టాప్!
మొదట్లో మనం కేవలం విదేశాల నుండి పార్ట్స్ తెచ్చి ఇక్కడ అసెంబ్లీ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు ప్రభుత్వం 'ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్' ద్వారా విడిభాగాలను కూడా ఇక్కడే తయారు చేసేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం సుమారు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి.
సెమీకండక్టర్ రంగంలో భారత్ మార్క్
మొబైల్ ఫోన్లకు గుండెకాయ వంటివి ' సెమీ కండక్టర్ చిప్స్' (Semiconductors). ఇప్పటివరకు వీటి కోసం మనం ఇతర దేశాలపై ఆధారపడ్డాం. కానీ, ఇప్పుడు భారత్‌లో సొంతంగా సెమీకండక్టర్ యూనిట్లు ఏర్పాటు అవుతున్నాయి. ఇప్పటికే 10 యూనిట్లకు అనుమతులు లభించాయి. త్వరలోనే మన దేశంలో తయారైన చిప్స్‌తో కూడిన ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి.
ఏదేమైనా ఒకప్పుడు ఎగుమతుల్లో 7వ స్థానంలో ఉన్న ఎలక్ట్రానిక్స్.. ఇప్పుడు భారత్ నుండి ఎగుమతి అవుతున్న టాప్-3 కేటగిరీలలో ఒకటిగా నిలిచింది. గ్లోబల్ కంపెనీలు భారత్ వైపు నమ్మకంతో చూస్తున్నాయి. యాపిల్ నుండి శామ్‌సంగ్ వరకు అన్నీ మన దగ్గరే తయారవుతున్నాయి. దీన్ని అసలైన మేకిన్ ఇండియా (make in india) విజయగాథగా చెప్పుకోవచ్చు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications