Tax on Gold: ఆదాయపన్ను శాఖ బంగారాన్ని క్యాపిటల్ ఎసెట్ గా పరిగణిస్తుందని పెట్టుబడి దారులు గమనించాలి. బంగారంలో వివిధ రూపాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. గోల్డ్ భారతీయులకు అత్యంత ఆకర్షణీయమైన ఆస్తి తరగతి. ఫిజికల్ గోల్డ్‌తో పాటు డిజిటల్ గోల్డ్, పేపర్ గోల్డ్‌కు కూడా ఈ రోజుల్లో డిమాండ్ ఉంది. ఈ రోజుల్లో గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్స్ పెరుగుతున్న తరుణంలో పన్ను బాధ్యతల గురించి పెట్టుబడిదారులు కచ్చితంగా తెలుసుకోవాలి.

ఫిజికల్ గోల్డ్ సేల్స్ పై క్యాపిటల్ గెయిన్స్ టాక్స్:
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం బంగారం మూలధన ఆస్తిగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్లు, బంగారు నాణేలు మొదలైన రూపాల్లో బంగారాన్ని అమ్మినప్పుడు.. క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వర్తిస్తుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లేదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనే దాన్ని బట్టి టాక్స్ లెక్కించటం జరుగుతుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ విలువను పొందేందుకు మీరు ఫిజికల్ గోల్డ్ కొనుగోలు ఖర్చుపై ఇండెక్సేషన్ ప్రయోజనాలను తీసుకోవచ్చు. గోల్డ్ అమ్మకం వల్ల వచ్చే లాభంపై 20 శాతం టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది, దీనికి తోడు 4 శాతం సెస్‌తో పన్ను విధించబడుతుంది. కాబట్టి మొత్తం పన్ను 20.08 శాతంగా ఉంటుంది. బంగారం కొన్న 36 నెలల తరువాత అమ్మితే దానిపై లాంట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ లెక్కిస్తారు.

డిజిటల్ బంగారం అమ్మకంపై పన్ను:
COVID-19 మహమ్మారి సమయంలో.. డిజిటల్ బంగారం భారీగా ప్రజాదరణ పొందింది. డిజిటల్ బంగారం భద్రత, సౌలభ్యం, స్వచ్ఛతను అందిస్తుంది. మీరు వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మెటల్ ట్రేడింగ్ కంపెనీలైన (సేఫ్‌గోల్డ్ లేదా MMTC-PAMP) నుంచి ఈ-బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. Paytm, మోతీలాల్ ఓస్వాల్, Google Pay వంటి వివిధ యాప్‌లు, వెబ్‌సైట్‌లు పెట్టుబడిదారుల కోసం ఇటువంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను అందుబాటులోకి తెచ్చాయి. మెటల్ ట్రేడింగ్ కంపెనీలు పెట్టుబడిదారుడి తరపున డిజిటల్ బంగారాన్ని సురక్షితమైన లాకర్‌లో నిల్వ చేస్తాయి. కానీ.. వీటిని SEBI లేదా RBI వంటి ఏ ప్రభుత్వ సంస్థ నియంత్రించదు.డిజిటల్ బంగారాన్ని అమ్మనప్పుడు కూడా ఫిజికల్ గోల్డ్ లాగానే టాక్స్ లెక్కించబడతాయి.

సావరిన్ గోల్డ్ బాండ్ల విక్రయంపై పన్ను:
దేశంలో ఆర్‌బీఐ ప్రభుత్వం తరపున సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేస్తుంది. ఫిజికల్ గోల్డ్ కలిగి ఉండటానికి ఈ బాండ్లు ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. మీరు ఎనిమిదేళ్ల మెచ్యూరిటీ తర్వాత బాండ్లను రిడీమ్ చేసుకోవచ్చు. అయితే.. మీరు కొనుగోలు చేసిన ఐదు సంవత్సరాల తరువాత కాడా బాండ్లను రిడీమ్ చేసుకోవచ్చు. సెకండరీ మార్కెట్‌లో కూడా సావరిన్ గోల్డ్ బాండ్‌లను విక్రయించే అవకాశం పెట్టుబడిదారుడికి ఉంది. ప్రభుత్వం జారీ చేసిన ఈ గోల్డ్ బాండ్స్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అవుతాయి. 8 ఏళ్ల మెచురిటీ తరువాత ఈ బాండ్లపై వచ్చే లాభం పన్ను రహితమైనది. అదే 5 సంవత్సరాల తరువాత గోల్డ్ బాండ్స్ విక్రయిస్తే.. లాభాలపై 20 శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ ఉంటుంది. ఈ బాండ్లను 36 నెలల్లోపు అమ్మితే సదరు వ్యక్తి సాధారణ పన్ను స్లాబ్ ఆధారంగా టాక్స్ లెక్కిస్తారు. ఈ పెట్టుబడులకు ఆరు నెలలకు ఒకసారి 2.50 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. వడ్డీ ఆదాయాన్ని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద పరిగణలోకి తీసుకుని టాక్స్ లెక్కిస్తారు.

పేపర్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్లపై పన్ను:
మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) వంటి ఇతర పేపర్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ల అమ్మకంపై ఫిజకల్ గోల్డ్ అమ్మనప్పుడు పాటించే పన్ను లెక్కింపు విధానాన్ని ఆదాయపన్ను చట్టం అధఇకారులు ఫ్లాలో అవుతారు. కాబట్టి కేవలం బంగారాన్ని కొనటం మాత్రమే కాకుండా తక్కువ టాక్స్ చెల్లించేందుకు వీలున్న మార్గాలను పెట్టుబడిదారులు ఎంచుకోవటం ఎక్కువ ప్రయోజనకరమని నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!



Click it and Unblock the Notifications