ప్రస్తుతం పెళ్లిళ్ల, శుభకార్యాల సీజన్ నడుస్తుంది. దీనికితోడు ఎప్పుడెప్పుడు పసిడి, వెండి ధరలు తగ్గుతాయా అని కొనుగోలుదారులు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ పెళ్ళిళ్ళ సీజన్లో పసిడి, వెండి ధరలు కాస్త పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 78వేల చేరువలో ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 72వేలకి దగ్గరగా ఉంది. ఇక వెండి ధర చూస్తే ఒక లక్షకి చేరువలో ఉంది. వీటికి మేకింగ్ అండ్ gst చార్జీలు అదనంగా ఉంటాయి.
ఒక విధంగా చెప్పాలంటే ఈసారి పెళ్లిళ్ల సీజన్లో బంగారం, వెండి కొనాలనుకునే వారికీ నిరాశే ఎదురైంది. మన దేశంలో మహిళలు బంగారం, పసిడి ఆభరణాలు ఎక్కువగా కొనేందుకు ఇష్టపడుతుంటారు. కానీ సామాన్యుడు బంగారం కొనాలంటే చుక్కలు చూడాల్సి వస్తుంది. అయితే పసిడి ధరలు రానున్న రోజుల్లో ఇదే ధోరణి కొనసాగిస్తాయా లేదా రిలీఫ్ అందిస్తాయా అనేది వేచి చూడాల్సిందే. ఒకవేళ పసిడి ధరలు ఇలానే పెరుగుతూపోతే 10 గ్రాముల ధర లక్ష వరకు చేరే ఛాన్స్ ఉంది. అయితే ప్రతి ఏడాది ప్రతిపాదికన బంగారం, వెండి ధరలను గమనిస్తే ఒకప్పుడు 50 వేల మార్క్ దాటిన పసిడి నేడు 80 వేలకి దగ్గరవుతుంది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా కొనసాగుతుంది. గత వరంలో పసిడి ధరలు అమాంతం పడిపోవడం కొనుగోలుదారులకు ఉరటనిచ్చింది.

దీనిపై గోల్డ్ రేట్స్ నిపుణులు ఎం చెప్తున్నారంటే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం, దిగుమతుల సుంఖం చార్జీలు, డిమాండ్ సప్లయ్ ఇంకా ఇతర కారణాలతో సహా పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారంపై పెట్టుబడి పెడుతున్నారని అందుకే బంగారం ధర పెరుగుతోందని చెబుతున్నారు. అలాగే ఈ ధరలు ప్రస్తుతం 72 వేల నుండి 78 వేల మధ్యలో ఉన్నప్పటికీ 85 వేల మార్క్ చేరే అవకాశం ఉందని అయితే కొత్త ఏడాదిలో పసిడి, వెండి ధరల్లో తగ్గుదల మార్పు చూడవచ్చని అంటున్నారు.
దీపావళి, అక్షయ తృతీయ సమయంలో కూడా పసిడి కొనుగోళ్లు శుభప్రదంగా భావిస్తారు. ఇలాంటి సమయంలో ఎప్పటిలాగే కొనుగోళ్లు జోరందుకుంటాయని భావించిన జ్యువెలరీ షాపులకి ఆశించినంతగా అమ్మకాలు లేవని తెలిపారు. భారతదేశం ఇతరల దేశాల కంటే అత్యధికంగా బంగారం దిగుమతి చూసుకునే దేశాలలో ఒకటి ఇంకా బంగారం బిస్కెట్లు, బార్ల రూపంలో దిగుబతి అవుతుంది. వచ్చే ఏడాది జనవరి తరువాత మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ ఉండటంతో అప్పుడైనా పసిడి, వెండి ధరలు సామాన్యులకి కలిసొస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications