రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా మరో చారిత్రక మైలురాయిని చేరుకుంది. రూ.20 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను చేరుకున్న మొదటి భారతీయ కంపెనీగా నిలిచింది. ఈ ఘనత సాధించిన రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ అందరి చేత విస్తృతంగా ప్రశంసలు అందుకుంటున్నారు.ఆయన ఇంతటి విజయాల వెనుక.. అంబానీకి సహచరులుగా, సలహాదారులుగా నిలిచిన విశ్వసనీయ మిత్రుల బృందం ఉందని చాలామంది చెబుతుంటారు. అంబానీకి కుడిభుజంగా మనోజ్ మోడీని తరచూ ప్రస్తావిస్తారు. అయితే అంతర్గత వర్గంలో మరో ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. ఆయనే ముఖేష్ అంబానీ చిరకాల స్నేహితుడు ఆనంద్ జైన్.
ముఖేష్ అంబానీ, ఆనంద్ జైన్‌ల స్నేహం: ముంబైలోని హిల్ గ్రాంజ్ హై స్కూల్‌లో చదువుతున్న రోజులలోనే ముఖేష్ అంబానీ, ఆనంద్ జైన్‌ల స్నేహం ప్రారంభమైంది. ఈ స్నేహ బంధం కాలక్రమేణా మరింతగా బలపడింది. 1981లో అంబానీ అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి తిరిగి వచ్చినప్పుడు.. అప్పటికే ధీరూభాయ్ అంబానీతో కలిసి సన్నిహితంగా పనిచేస్తున్నాడు జైన్. ఢిల్లీలో సాగిస్తున్న తన వ్యాపారాలను వదిలి రిలయన్స్‌లో చేరాడు. ఈ నిర్ణయం ఆయన జీవితానికే కాకుండా రిలయన్స్ ని కూడా కీలకమైన మలుపు తిప్పింది.
11వ అత్యంత సంపన్న భారతీయుడిగా: 2007లో ఫోర్బ్స్ జాబితాలో ఆనంద్ జైన్ 11వ అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచాడు. అప్పుడు ఆయన నికర విలువ సుమారు 4 బిలియన్ల డాలర్లు (రూ.33,000 కోట్లకు పైగా). ఈ స్థాయికి చేరడానికి జై కార్ప్ అనే తన సంస్థలోని వ్యాపార విస్తరణ ప్రధాన కారణమైంది. ఆ సమయంలో జై కార్ప్ మార్కెట్ విలువ 45 బిలియన్ల డాలర్లకు చేరింది. అయితే కాలక్రమేణా వ్యాపార పరిస్థితులు మారాయి. 2012 నాటికి ఆయన సంపద గణనీయంగా తగ్గి, సుమారు 525 మిలియన్ డాలర్లకు పడిపోయింది.

14 నగరాల్లో 30కిపైగా ప్రాజెక్టుల్లో జై కార్ప్ ముద్ర: 1985లో స్థాపించబడిన జై కార్ప్ లిమిటెడ్.. ఉక్కు తయారీ, ప్లాస్టిక్ ప్రాసెసింగ్, నూలు పరిశ్రమ, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో పనిచేసింది. ప్రత్యేక ఆర్థిక మండలాల (SEZలు) అభివృద్ధి, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు వంటి విభాగాల్లో 14 నగరాల్లో 30కిపైగా ప్రాజెక్టుల్లో జై కార్ప్ తన ముద్ర వేసింది. రియల్ ఎస్టేట్, క్యాపిటల్ మార్కెట్లు, ఫైనాన్స్ రంగాల్లోని అనుభవంతో జైన్.. రిలయన్స్‌లో ముఖ్యమైన వ్యూహాత్మక సలహాదారుగా అవతరించాడు.
అంబానీ సామ్రాజ్యంలో ఆయన ప్రభావం ఎంతో ఉన్నప్పటికీ.. రిలయన్స్ నుండి ఆయన ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకపోవడం విశేషం. కంపెనీ టెలికాం విభాగం రిలయన్స్ ఇన్ఫోకామ్ వంటి కీలక ప్రాజెక్టుల్లో ఆయన నేరుగా పర్యవేక్షణ చేపట్టాడు. ముంబై పోర్ట్ ట్రస్ట్, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ వంటి సంస్థల్లోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు.
వ్యక్తిగత జీవితం: ఆనంద్ జైన్, భార్య సుష్మా జైన్‌తో ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు నేహా జైన్, హర్ష్ జైన్. వీరిలో హర్ష్ జైన్ వ్యాపార ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. తన స్నేహితుడు భవిత్ సేథ్‌తో కలిసి ఆయన 2008లో డ్రీమ్11 అనే ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌ను స్థాపించాడు. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచ క్రీడా రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది ఏప్రిల్ 2019లో డ్రీమ్11 యునికార్న్ హోదా సాధించింది. అక్టోబర్ 2023 నాటికి 200 మిలియన్లకు పైగా యూజర్లతో ఈ సంస్థ క్రీడాభిమానులకు క్రికెట్, ఫుట్‌బాల్, బేస్‌బాల్ వంటి గేమ్‌లలో పాల్గొనే కొత్త అనుభవం అందిస్తోంది.
హర్ష్ జైన్ ఎవరు : ఇండియా కార్పొరేట్ ప్రపంచంలో నేటి ట్రెండింగ్ పేరు డ్రీమ్11 సహ వ్యవస్థాపకుడు హర్ష్ జైన్. 1986లో ముంబైలో జన్మించిన హర్ష్ జైన్, చిన్నప్పటి నుంచే విద్యలో ప్రతిభ కనబరిచాడు. పెన్సిల్వేనియా యూనివర్శిటీ మరియు కొలంబియా బిజినెస్ స్కూల్‌లో చదివిన ఆయన, మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌గా తన కెరీర్‌ను ఆరంభించాడు. 2008లో భావిత్ షేత్‌తో కలసి డ్రీమ్11 అనే ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌ను స్థాపించాడు. ఇది కొద్ది కాలంలోనే భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ అతి పెద్ద ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగింది. నేడు డ్రీమ్11 విలువ దాదాపు రూ. 65 వేల కోట్లకు పైగా చేరింది.
హర్ష్ జైన్ కేవలం డ్రీమ్11కే పరిమితం కాలేదు. డ్రీమ్ స్పోర్ట్స్ ఇంక్ కింద అనేక సంస్థలను నడుపుతున్నారు..వాటిలో FanCode, DreamSetGo, Dream Sports Foundation, Dream Game Studios, Sixer వంటి బ్రాండ్లు ఉన్నాయి. ఇవన్నీ క్రీడాభిమానులకు కొత్త అనుభవాలను అందిస్తూ, భారతీయ స్పోర్ట్స్ టెక్నాలజీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించాయి.
రూ. 2,400 కోట్ల ఆర్థిక మోసం కేసు: అయితే హర్ష్ జైన్ పేరు మరింతగా హైలైట్ అవ్వడానికి కారణం ఆయన కుటుంబ నేపథ్యమని చెప్పుకోవచ్చు. ఆయన తండ్రి Anand Jain వ్యాపార ప్రపంచంలో బలమైన స్థానం కలిగిన వ్యక్తి. ఆనంద్ జైన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీకి అత్యంత సన్నిహితుడు. చాలామంది ఆయనను ధీరూభాయ్ మూడవ కుమారుడు అని పిలిచేవారు. ప్రస్తుతం ఆయనపై రూ. 2,400 కోట్ల ఆర్థిక మోసం కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. అయినప్పటికీ, ఆయన అంబానీ కుటుంబానికి సన్నిహిత మిత్రుడిగానే కొనసాగుతూ వస్తున్నారు.
తండ్రి నేపథ్యం కారణంగా హర్ష్ జైన్ కూడా అంబానీ కుటుంబానికి దగ్గరయ్యాడు. ఇటీవల ఆయన ముంబైలోని వాల్కేశ్వర్ రోడ్‌లో ఉన్న లోధా మలబార్ ప్రాజెక్ట్‌లో రూ. 138 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారు. ఇది అంబానీ కుటుంబ నివాసమైన ఆంటిలియా (రూ. 15 వేల కోట్ల విలువ) సమీపంలో ఉంది. ఈ ఫ్లాట్‌లో 9,546 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండగా, ఆరు కార్ పార్కింగ్ సౌకర్యాలు ఉన్నాయి. కేవలం స్టాంప్ డ్యూటీగానే ఆయన రూ.8.3 కోట్లు చెల్లించారు.
ఆర్థిక పరంగా హర్ష్ జైన్ స్థాయి అంచనా వేస్తే, ఆయన నికర విలువ సుమారు సుమారు 8 మిలియన డాలర్స్ గా పేర్కొంటారు. ఆయన నెలవారీ ఆదాయం దాదాపు రూ. 33 లక్షలు., అలాగే డ్రీమ్ స్పోర్ట్స్‌లో ఆయన వాటా విలువ రూ.696 కోట్లకు పైగా ఉంది. ఈ స్థాయికి ఎదగడం వల్ల ఆయనను దేశంలోని అత్యంత ప్రభావవంతమైన యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌లో ఒకరిగా గుర్తిస్తున్నారు.
అతని ప్రతిభను గుర్తిస్తూ 2022లో AIMA యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు, IMPACT పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించాయి. 2024లో ఆయన మరియు భాగస్వామి భావిత్ షేత్, IDFC FIRST ప్రైవేట్, హురున్ ఇండియా జాబితాలో టాప్ 200 స్వయం నిర్మిత వ్యాపారవేత్తల్లో 7వ స్థానంలో నిలిచారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications