బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సినిమా కాకుండా మరో రంగంలో రూ.110 కోట్లు సంపాదించాడంటే నమ్మలేము కదా? కానీ నిజమే ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో ఆయన తీసిన నిర్ణయాలు, పెట్టుబడులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు మారాయి.

అక్షయ్ కుమార్ రియల్ ఎస్టేట్ డీల్స్ ఎలా భారీ లాభాలు వచ్చాయో చూద్దాం. వోర్లీలోని 'Oberoi Three Sixty West' ప్రాజెక్ట్‌లో ఉన్న 6,830 చదరపు అడుగుల విలాసవంతమైన ఫ్లాట్‌ను రూ. 80 కోట్లకు అమ్మారు. ఇది ఆయన రియల్ ఎస్టేట్ ఆదాయంలో అత్యధిక భాగం, దాదాపు 70-75% శాతం వరకు ఇదే ఉంటుంది. బొరివలిలోని 'Oberoi Sky City'లో ఉన్న 3BHK ఫ్లాట్లు మరియు స్టూడియో అపార్ట్‌మెంట్‌లను విక్రయించి మరో రూ. 4.25 కోట్లు వచ్చాయి. అలాగే ముంబైలోని ఇతర రెండు అపార్ట్‌మెంట్‌లను అమ్మి రూ. 6.60 కోట్లు సంపాదించారు. అంతేకాకుండా, లోవర్ పేరెల్‌లో ఉన్న 'Lodha One Place' కమర్షియల్ ఆఫీస్‌ను 2020లో రూ. 4.85 కోట్లకు కొనుగోలు చేసి, 2025లో రూ. 8 కోట్లకు అమ్మారు. దీని ద్వారా ఆయన 65% లాభాన్ని పొందారు. ఈ డీల్స్ వల్ల ఆయన పెట్టుబడి వ్యూహం ఎంత విజయవంతమైందో స్పష్టంగా చూపిస్తున్నాయి.
ఆయన ముంబయిలోనే కాదు, పుణె, గోవా, కెనడా లాంటి ప్రాంతాల్లోనూ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టారు. ఇవన్నీ భవిష్యత్‌లో మంచి లాభాలు రావాలనే ఉద్దేశంతో జాగ్రత్తగా పెట్టిన పెట్టుబడులే. అంతేకాదు, ఆయనకు ప్రత్యేక పెట్టుబడి సలహాదారుల బృందం ఉంది. వారు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ, సరైన సమయంలో ప్రాపర్టీలు కొనడం లేదా అమ్మడం వంటి నిర్ణయాల్లో సహాయపడతారు.
ఆర్థికంగా వృద్ధి చెందడంలో ఆయన బ్రాండ్ ఎండోర్స్మెంట్‌లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. హోండా మోటార్స్, పాలసీబజార్, హార్పిక్ వంటి ప్రముఖ బ్రాండ్స్‌కు ప్రచారం చేస్తూ ఆయన మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. కొన్ని బ్రాండ్స్‌లో ఈక్విటీ వాటా కూడా ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ కలిపి, అక్షయ్ కుమార్‌ను కేవలం నటుడిగా కాకుండా విజయవంతమైన పెట్టుబడిదారుగా కూడా నిలబెడుతున్నాయి.
అక్షయ్ కుమార్ సినీ నటుడిగా మాత్రమే కాకుండా, మంచి వ్యాపార దృష్టి కలిగిన వ్యక్తిగా కూడా గుర్తింపు పొందుతున్నారు. ఫిట్‌నెస్, హెల్త్, ఫుడ్ డెలివరీ వంటి స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం ఉంది. పన్నులు చెల్లించే విషయంలో కూడా ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి సంవత్సరం అత్యధిక పన్ను చెల్లించే సెలెబ్రిటీల్లో ఒకరిగా ఉంటారు.
రియల్ ఎస్టేట్ విషయంలో, సరైన సమయంలో ఆస్తులను కొనుగోలు చేసి, విలువ పెరిగిన తర్వాత అమ్ముతూ లాభాలు పొందుతున్నారు. ఇది తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఎక్కువ ధరకు అమ్మడం అనే వ్యూహానికి మంచి ఉదాహరణ. అలాగే, ఆయనకు బిజినెస్ మీద ఆసక్తి పెరిగింది. సినిమా నిర్మాణం చేయడమే కాదు, ఇప్పుడు ఫైనాన్స్, వ్యాపారాల్లో నుంచి ఆదాయాన్ని పెంచడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇవన్నీ కలిపి చూస్తే, అక్షయ్ కుమార్ ఇప్పుడు ఒక సంపూర్ణ వ్యాపారవేత్తగా కూడా ఎదుగుతున్నారని చెప్పొచ్చు.
అక్షయ్ కుమార్ సినిమాలపై మాత్రమే ఆధారపడకుండా, పెట్టుబడులు, ఆస్తి నిర్వహణ (Property Management), వ్యాపారాల్లో నిపుణుల సహకారంతో ముందడుగు వేయడం ద్వారా ఆయన తన ఆర్థిక స్థితిని బలంగా మలచుకున్నారు. ఇది కొత్త తరానికి ఒక స్పష్టమైన సందేశం. ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఒకే మార్గాన్ని కాకుండా, ఎన్నో దారుల గురించి ఆలోచించడం, ఖర్చు తగ్గించి పొదుపుగా ఉండటం, డబ్బును తెలివిగా పెట్టుబడి చేయడం ఎంతో ముఖ్యం.


Click it and Unblock the Notifications