ఉన్నది పోయింది... ఉంచుకున్నదీ కూడా పోయింది...అందరం వినే ఉంటారు కదా అలానే ఒకటి జరిగింది. బెంగళూరు కేంద్రంగా ఉన్న రియల్-మనీ గేమింగ్ కంపెనీ గేమ్స్‌క్రాఫ్ట్ మాజీ CFO రమేష్ ప్రభు పై కంపెనీ పోలీస్ ఫిర్యాదు చేసింది. FIR ప్రకారం, ఆయన సుమారు ఐదు సంవత్సరాలుగా కంపెనీ నిధులను అనధికారంగా మళ్లించి, ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్‌కి ఉపయోగించగా, ఆ కారణంగా రూ. 250 కోట్లు నష్టపోయారు.

మార్చి 5న ప్రభు గేమ్స్‌క్రాఫ్ట్‌కు తన తప్పును ఒప్పుకుంటూ ఒక ఇమెయిల్ పంపించారు. ఆ ఇమెయిల్‌లో ఆయన మూడు-నాలుగు సంవత్సరాల పాటు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంగీకరించి, ఇది CFO గా తన బాధ్యతకు విరుద్ధం అని వెల్లడించారు. ఆయన ఈస్కీమ్ లో ఇతర ఉద్యోగులు భాగం ఏమ్ లేనట్లుగా చెప్పారు.
FIR ప్రకారం, ప్రభు అనధికారంగా సుమారు రూ. 270.43 కోట్లు మళ్ళించి, తన ట్రేడింగ్‌కి ఉపయోగించాడని పేర్కొన్నారు. ఈ కేసులో IPC మరియు BNS కింద అనేక నేరాలను నమోదు చేశారు, వాటిలో దొంగతనం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అకౌంట్లలో మోసం, ఫోర్జరీ వంటి అంశాలు ఉన్నాయి.
కంపెనీ వివరంగా "ఫ్యాక్ట్ ఫైండింగ్" రివ్యూ చేసింది. FY20-FY25 మధ్య, ప్రభు 231.39 కోట్లు అనధికారికంగా ట్రేడింగ్‌కి మళ్లించినట్లు తేలింది. FY24లో 211.53 కోట్లు 'ఇన్వెస్ట్మెంట్స్'గా చూపించారు, FY25లో మరో 19.86 కోట్లు 'ఇన్వెస్ట్మెంట్స్'గా నమోదు చేశారు. ఫలితంగా, FY25 ఆర్థిక సంవత్సరం కోసం రూ. 270.43 కోట్లు లెక్కల నుండి తీసివేయాల్సి వచ్చింది. ప్రభు ఈ లావాదేవీలను RBL బ్యాంక్ ఖాతా ద్వారా తన వ్యక్తిగత ఖాతాకు మళ్లించారు. ఫిర్యాదు ప్రకారం, ఆయన ఫేక్ బ్యాంక్ మరియు మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్స్ కూడా సృష్టించి, లావాదేవీలను దాచే ప్రయత్నం చేసాడు.
47 సంవత్సరాల వయస్కుడైన ప్రభు ఒక చార్టర్డ్ అకౌంటెంట్. 2018లో CFOగా గేమ్స్‌క్రాఫ్ట్ చేరాడు. అతను త్రీ వీల్స్ యునైటెడ్ అనే సంస్థలో కో-ఫౌండర్ మరియు CEOగా పనిచేశారు, ఆ సంస్థ ఆటో, రిక్షా డ్రైవర్లకు తక్కువ రుణాలను అందించేది.
ఇక ఈ కేసు భారత ప్రభుత్వం రియల్-మనీ గేమ్స్‌పై కొత్త చట్టాలు ప్రవేశపెట్టిన సమయంలో వెలుగులోకి వచ్చింది. గేమ్స్‌క్రాఫ్ట్, రమ్మి కల్చర్, Pocket52 వంటి ఆన్‌లైన్ రమ్మీ, పోకర్ యాప్‌లను నిలిపివేసింది. FY25లో కంపెనీ నెట్ ప్రాఫిట్ రూ. 706 కోట్లు, FY24లో రూ. 947 కోట్లు. రెవెన్యూస్ రూ. 4,009 కోట్లు FY25లో, FY24లో రూ. 3,521 కోట్లు. తగ్గుదలలో GST 28% ప్రభావం మరియు గత అనధికారిక లావాదేవీల అడ్జస్ట్‌మెంట్ ప్రధాన కారణంగా ఉంది.
జూలైలో సుప్రీంకోర్ట్ గేమింగ్ కంపెనీలపై GST, రాష్ట్ర స్థాయి నిషేధ చట్టాల కేసులపై తీర్పును రిజర్వ్ చేసింది. అలాగే రూ. 2.5 లక్షల కోట్లు GST నోటీసులు చెల్లింపుల చట్టాల చెల్లుబాటు పై కూడా తీర్పు ఇవ్వాల్సి ఉంది.
రమేష్ ప్రభు గేమ్స్‌క్రాఫ్ట్ నిధులను అనధికారంగా మళ్లించి, F&O ట్రేడింగ్‌లో రూ. 250 కోట్లు నష్టపోయాడు. FIR ప్రకారం, అతను అకౌంట్లను తప్పుడు చూపిస్తూ, ఫండ్స్‌ను తన వ్యక్తిగత ఖాతాలకు మళ్లించాడు. ఈ ఘటన భారతంలో రియల్-మనీ గేమ్స్‌పై కొత్త చట్టాలు ప్రవేశంలో ఉన్న సమయంలో వెలుగులోకి వచ్చింది.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications