Reward points: రూ. 2 లక్షల టిక్కెట్ కేవలం రూ. 4,600కే! క్రెడిట్ కార్డ్ తో మీరు కూడా ఇలా చేయొచ్చు..
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలు సామాన్యులకు భారంగా మారాయి. విమాన మార్గాలు మారడం, ఇంధన ఖర్చులు పెరగడంతో ఇండియా నుంచి యూరప్ వెళ్లే విమాన టిక్కెట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ముంబై నుంచి లండన్ వంటి బిజీ రూట్లలో ఎకానమీ క్లాస్ టిక్కెట్ ధర కూడా రూ. 2 లక్షలు దాటిపోతోంది. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి తన తెలివితేటలతో లక్షల రూపాయల టిక్కెట్‌ను కేవలం కొన్ని వేల రూపాయలకే దక్కించుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అసలేం జరిగింది?
ముంబైకి చెందిన ఒక వ్యక్తి అత్యవసరంగా లండన్ వెళ్లాల్సి వచ్చింది. ఎయిర్ ఇండియాలో టిక్కెట్ ధర చూస్తే రూ. 2,20,000 ఉంది. సాధారణంగా ఎవరైనా ఇంత ధర చూసి బెంబేలెత్తిపోతారు. కానీ, అతని దగ్గర ఒక ప్లాన్ ఉంది. అతను గత ఏడు నెలలుగా తన 'యాక్సిస్ అట్లాస్' క్రెడిట్ కార్డుపై పేరుకుపోయిన రివార్డ్ పాయింట్స్ (reward points) ను వాడాలని నిర్ణయించుకున్నాడు. తన దగ్గర ఉన్న పాయింట్లను ఎయిర్ కెనడా యొక్క 'ఏరోప్లాన్' ప్రోగ్రామ్‌లోకి మార్చుకున్నాడు. ఫలితంగా రూ. 2.15 లక్షల విలువైన టిక్కెట్ కాస్తా తగ్గిపోయి.. కేవలం రూ. 4,600 ట్యాక్సులు మాత్రమే చెల్లించి ప్రయాణాన్ని పూర్తి చేశాడు.
రివార్డ్ పాయింట్స్ మ్యాజిక్ ఎలా పనిచేస్తుంది?
చాలా మంది క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమకు వచ్చే పాయింట్లను క్యాష్‌బ్యాక్ లేదా వోచర్ల కోసం వాడేస్తుంటారు. కానీ ఫైనాన్స్ నిపుణుల ప్రకారం.. పాయింట్లను ఎయిర్‌లైన్ మైల్స్‌గా మార్చుకున్నప్పుడే వాటికి అసలైన విలువ వస్తుంది.
- స్టేబుల్ ప్రైసింగ్: విమాన టిక్కెట్ల ధరలు డిమాండ్‌ను బట్టి నిమిష నిమిషానికి మారుతుంటాయి (Cash Fares). కానీ పాయింట్ల ద్వారా బుక్ చేసుకునేటప్పుడు (Point Bookings) ధరలు చాలా వరకు స్థిరంగా ఉంటాయి.
- వాల్యూ మల్టిప్లికేషన్: ఒక రివార్డ్ పాయింట్ విలువ సాధారణంగా 25 నుండి 50 పైసలు ఉంటుంది. కానీ అమిత్ కేసులో, అతను ఒక పాయింట్‌కు దాదాపు రూ. 12 విలువను పొందగలిగాడు.
మీరు గుర్తుంచుకోవాల్సిన చిట్కాలు
మీరు కూడా మీ క్రెడిట్ కార్డ్ reward points ను సమర్థవంతంగా వాడుకోవాలంటే ఈ క్రింది విషయాలు గమనించండి..
- క్యాష్‌బ్యాక్ వద్దు.. మైల్స్ ముద్దు: పాయింట్లను ఎప్పుడూ క్యాష్‌బ్యాక్ రూపంలో కాకుండా, ఎయిర్‌లైన్ లేదా హోటల్ పార్టనర్లకు ట్రాన్స్‌ఫర్ చేయండి. అప్పుడే వాటి విలువ 2 నుండి 3 రెట్లు పెరుగుతుంది.
- మైల్‌స్టోన్ బెనిఫిట్స్: కార్డుపై నిర్ణీత మొత్తంలో ఖర్చు చేసినప్పుడు వచ్చే అదనపు పాయింట్లను ట్రాక్ చేయండి.
- ముందుగానే ప్లాన్ చేయండి: రివార్డ్ పాయింట్ల ద్వారా బుక్ చేసుకునే సీట్లు పరిమితంగా ఉంటాయి. కాబట్టి ప్రయాణానికి కొన్ని నెలల ముందే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.
భారతదేశంలో యాక్సిస్ అట్లాస్, హెచ్‌డిఎఫ్‌సి ఇన్ఫీనియా లేదా అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి కార్డులు ఇలాంటి ట్రావెల్ బెనిఫిట్స్ కోసం బాగా పేరు పొందాయి. సరైన కార్డును ఎంచుకుని, పాయింట్లను తెలివిగా వాడితే లక్షల రూపాయల ప్రయాణాన్ని మీరు కూడా అతి తక్కువ ఖర్చుతో పూర్తి చేయవచ్చు.


Click it and Unblock the Notifications